E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్..  ఇదేం ట్విస్ట్ రా అయ్యా..
Advertisement

Illu Illaalu Pillalu Srivalli : బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్స్ జనాలకు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు సీరియల్స్ తో ఆకట్టుకుంటున్న యాక్టర్స్ కు డిమాండ్ కూడా కాస్త ఎక్కువే.. ముఖ్యంగా స్టార్ మా సీరియల్లో ప్రసారం అపవుతున్న సీరియల్స్ ఒక్కొక్కటి జనాలను విపరీతంగా అలరిస్తున్నాయి. ఒకప్పుడు సీరియల్స్ అంటే ఎక్కువమంది చూసేవాళ్ళు కాదు.. కానీ ఈ మధ్య మాత్రం సీరియల్స్ స్టోరీ కొత్తగా సినిమాలను తలపించేలా ఉంటున్నాయి. దానివల్ల ఎక్కువమంది సీరియల్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్లో రామరాజు పెద్ద కోడలు పాత్రలో నటిస్తున్న శ్రీవల్లి క్యారక్టర్ పై నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. తాజాగా మరోసారి ఈ సీరియల్ నుంచి శ్రీవల్లి అవుట్ అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అసలేం జరిగింది? నిజంగానే ఆమె వెళ్ళిపోతుందా..? లేదా ఇంకేమైనా సమస్య ఉందా అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

శ్రీవల్లి అందుకే అవుట్..?

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మధ్యతరగతి కుటుంబంలోని మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో అని చూపించింది. రామరాజు కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమ, ఆప్యాయతలు కావాలని కోరుకొనే మనుషులు. కానీ ఈ మధ్య శ్రీవల్లి పెద్ద కోడలుగా అడుగు పెట్టిన తర్వాత డబ్బులు మీద వ్యామొహం, పెద్ద కోడలు అన్న మాటతో అందరిని తన కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటుంది. దానికోసం ఎంతకైనా తెగిస్తుంది. ఇక చివరికి కుటుంబంలో అందరికి గొడవలు పెడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో తన ప్రవర్తన కారణంగా భర్తకు కూడా దూరం అవుతుంది. అయిన తన బుద్ధి మార్చుకోదు. చివరకు ప్రేమను కూడా ఆ ఇంటికి దూరం చేస్తుంది. తన బాధ ప్రేమ అనుభవిస్తుందని సంతోషపడుతుంది. ఇక వేరే సీరియల్లో భారీ ఆఫర్ రావడంతో ఈ సీరియల్ కు గుడ్బై చెప్తుందని టాక్.. మరి నిజమేంటో తెలియాలి అంటే ఈమె స్పందించి క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే..

త్రివేణి యాదవ్ రియల్ లైఫ్..

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తున్న శ్రీవల్లి అస్సలు పేరు త్రివేణి యాదవ్.. ఈమె తెలుగులో అనేక సీరియల్స్ లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సుందరి అనే సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సీరియల్ ఆమెకు మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సీరియల్ తర్వాత అవకాశాలు వచ్చాయి. ప్రతి సీరియల్ కూడా ఆమెకు మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టడంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువైపోయింది.. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో విలన్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది. ఈ క్యారెక్టర్ ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకుంటే నెక్స్ట్ ఏ క్యారెక్టర్ హైలైట్ అవుతుందో అని సీరియల్ లవర్స్ కాస్త ఆలోచనలో పడ్డారు.. మరి త్వరలోనే ఈమె చీర నుంచి వెళ్ళిపోతుందేమో చూడాలి.. గత కొద్ది రోజులుగా శ్రీవల్లి వెళ్ళిపోతుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో ఎటువంటి నిజం లేదని తేలింది. మరి ఇప్పుడు వస్తున్న వార్తలు కూడా గాలివార్తలా?లేక నిజంగానే ఈ సీరియల్ తప్పుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Related News

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Big Stories

Advertisement
×