E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..
Advertisement

Podarillu Today Episode October 10th : మాధవ్ కన్నా ఇన్ని రోజులు తన తల్లి కోసం వెయిట్ చేసాడు కదా.. ఇప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది కదా వాడు చాలా సంతోషంగా ఉంటాడేమో అని మాధవ్ అనుకుంటూ ఉంటాడు. అలాగే మహాలక్ష్మి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. చక్రి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత నుంచి ఈ ఇంట్లో మంచి రోజులు వచ్చాయి అని అనిపిస్తుంది.  అన్నయ్య ఇప్పుడు వాళ్ళ అమ్మ వస్తే కన్నా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు కదా మరి వాడికి నిజాన్ని చెప్పకుండా ఒకేసారి సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే కన్నా ఇంట్లోకి వస్తాడు. కన్నా ఇంట్లోకి రాగానే నీ షర్టు ఏమీ బాగోలేదు నువ్వు వెంటనే వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి రారా నువ్వు అస్సలు బాగోలేదు అని చెప్పగానే ఏంటి మీరిద్దరూ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తాడు.. అయితే వీళ్ళిద్దరూ ఎందుకు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని కన్నా చాలా బాధపడిపోతూ ఉంటాడు.

మాధవ్ వెయిటింగ్..

మహాలక్ష్మి కన్న వాళ్ళ అమ్మని తీసుకొని వస్తున్నాము అని చెప్పగానే.. మాధవ్తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఎయిట్ చేస్తూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చినా కన్నా వాళ్ళ అమ్మని చూసి నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మాధవ్ కన్నా వాళ్ళ అమ్మ వచ్చేసిందని చాలా సంతోషంగా ఉంటాడు. నారాయణ మంత్రం ఎవరు వస్తున్నారు అంతగా ఎదురుచూస్తున్నారు అని అంటూ ఉంటాడు. అయితే అప్పుడే ఒక కారు వచ్చి ఆగిన కనిపిస్తుంది. అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు రావడం చూసినా నారాయణ ఎవరు ఆ లేడీ అని చూస్తూ ఉంటాడు. దగ్గరికి రావడంతో కన్నా వాళ్ళ అమ్మ లాగా కనిపించడంతో ఒక్కసారిగా సీరియస్ అయ్యి అలానే నిలుచునుని ఉండిపోతాడు. ఆమెను చూడగానే ఒక్కసారిగా నారాయణ కట్టెలు తెచ్చుకోలేని కోపాన్ని తెచ్చుకుంటాడు.

మహా పై నారాయణ సీరియస్..

Advertisement

మహాలక్ష్మి ఆ వచ్చిన ఆవిడకి హారతి ఇవ్వాలని అన్ని సిద్ధం చేస్తుంది.. అయితే నారాయణ మాత్రం ఆ హారతి పల్లెని విసిరి కొట్టేస్తాడు. అసలు దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు. ఎవరు తీసుకుని వచ్చారు ఎందుకు తీసుకుని వచ్చారు అంటూ నారాయణ ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. అయితే నారాయణ అలా సీరియస్ అవ్వడంతో పాటుగా దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటూ గట్టిగా కేకలు వేసి అరుస్తూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు నువ్వు ఎవరు ఇది మా ఇంటి విషయం కదా నువ్వెందుకు దీంట్లో జోక్యం చేసుకున్నావు అంటూ నారాయణ అనగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అసలు ఎందుకని నువ్వు ఇలా తీసుకుని వచ్చి మా నెత్తిన పెట్టావు అంటూ నారాయణ అనగానే మహాలక్ష్మి చాలా ఫీల్ అవుతుంది. మాధవ్ ఏం మాట్లాడుతున్నావ్ నాన్న ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావ్ మహాలక్ష్మి మన ఇంటి ఆడపిల్ల అని అనగానే నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మహా షాక్..

అసలు దీని గురించి నేను ఎందుకు చెప్పలేదు అన్నది మీకు ముందు ముందు తెలుస్తుంది ఇది ఒక జిత్తు మారి నక్క.. ఎవరూ లేదు కదా అని మనం ఆశ్రయమిస్తే మనల్ని ముంచేసిపోతుంది అంటూ నారాయణ ఆమెని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకోడు. అయితే నువ్వు ఇంట్లోకి అడుగుపెడితే కాళ్లు విరగొట్టడం కాదు.. నీ ప్రాణం తీస్తాను అని నారాయణ ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. కానీ మాతో మాత్రం ఎన్ని రోజుల తర్వాత కరుణాకర్ తల్లి వచ్చింది కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు.. వెళ్ళు నాన్న ఇక్కడి నుంచి అని అంటాడు. దానితో నారాయణ మీరు దీన్ని ఎందుకు తీసుకొచ్చానా అని బాధపడతారు అనుభవిస్తారు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నారాయణ ప్రవర్తనను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మహాలక్ష్మి.

కన్నా ఎమోషనల్..

Advertisement

ఆమెని లోపలికి తీసుకొని వెళ్తారు కన్న ఎక్కడా అని అందరూ వెతుకుతారు. అయితే లోపలికి వెళ్లి తలుపు వేసుకున్న కన్నాని బయటకు రమ్మని పిలుస్తారు. కానీ చివరికి ఆమె వెళ్లి బయటకు రమ్మని తీసుకురాగానే కన్నా బయటకొచ్చి ఇన్నేళ్ల తర్వాత నన్ను ఎందుకు చూడడానికి వచ్చావు అమ్మ.. ఇన్నేళ్లు నేను నీకు గుర్తుకు రాలేదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొన్ని పరిస్థితులు నన్ను కట్టిపడే సాయి అనాధగా ఉన్న నేను పసుపు పిల్లాడుగా ఉన్న నిన్ను తీసుకెళ్లి ఏ చెట్టు కింద కూర్చోబెట్టాలో అర్థం కాక వదిలేసి వెళ్ళిపోయాను. ఇన్ని రోజుల తర్వాత వచ్చాను కదా నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను అంటూ అంటుంది. కన్నా బాధపడడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా బాధపడతారు. ఎపిసోడ్కి హైలెట్ సీన్ ఇదే అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Related News

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

Big Stories

Advertisement
×