E-Paper
Advertisement

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!
Advertisement

IRCTC Sri Lanka Tour Package: భారతీయ పర్యాటకులకు విదేశీ పర్యటనతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. రామాయణ ఇతిహాసంతో సంబంధం ఉన్న ప్రాంతాలను సందర్శించాలనుకునే వారి కోసం ‘శ్రీలంక: ఎ జర్నీ విత్ ఇన్’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ఒకే పర్యటనలో ఆస్వాదించేలా ఈ యాత్రను రూపొందించింది.

అక్టోబర్ 22 నుంచి శ్రీలంక పర్యటన!

ఐఆర్‌సీటీసీ ప్రకటించిన ఈ ప్యాకేజీ కోడ్ NDO37. మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. 2026 అక్టోబర్ 22న ఢిల్లీ నుంచి ప్రయాణం ప్రారంభం కానుంది. ఒక్కో ప్రయాణికుడికి ప్రారంభ ధర రూ.74,100గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీలంకలోని నెగొంబో, క్యాండీ, నువర ఎలియా, కొలంబో లాంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. విమాన ప్రయాణం నుంచి హోటల్ వసతి వరకు పర్యటనకు అవసరమైన పలు సదుపాయాలను ఇందులో చేర్చారు.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?

Advertisement

శ్రీలంక పర్యటనకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లను ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీలో అందిస్తోంది. విమాన ప్రయాణం, రోడ్డు మార్గంలో రవాణా, హోటల్ వసతి, భోజనం, టూర్ గైడ్ సర్వీసులు, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇందులో భాగంగా ఉన్నాయి. విదేశీ పర్యటనను సొంతంగా ప్లాన్ చేసుకోవడం కంటే, ఒకే ప్యాకేజీ ద్వారా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.

రామాయణంతో ప్రత్యేక అనుబంధం!

శ్రీలంకకు భారతీయుల దృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. రామాయణ సంప్రదాయం ప్రకారం, ఈ ద్వీపం రావణుడి రాజ్యంతో, సీతాదేవి అశోకవనం సహా పలు అంశాలతో ముడిపడి ఉంది. ఈ ఇతిహాసానికి సంబంధించిన ప్రదేశాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి శ్రీలంక పర్యటన ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.

ప్రకృతి అందాలకు నిలయం నువర ఎలియా!

Advertisement

ఈ పర్యటనలో క్యాండీ, నువర ఎలియా, కొలంబో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన క్యాండీ నగరం తన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ‘లిటిల్ ఇంగ్లాండ్’గా పేరుగాంచిన నువర ఎలియా పచ్చని తేయాకు తోటలు, పొగమంచుతో కప్పుకున్న కొండలు, చల్లని వాతావరణానికి ప్రసిద్ధి. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్రాంతం మంచి అనుభూతిని అందిస్తుంది. మరోవైపు, శ్రీలంక వాణిజ్య రాజధాని కొలంబోలో చారిత్రక కట్టడాలు, మార్కెట్లు, ఆధునిక నగర జీవనం, తీరప్రాంత అందాలను చూడవచ్చు. దీంతో ఈ పర్యటనలో ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి, నగర జీవనశైలిని కూడా ఆస్వాదించవచ్చు.

Read Also: భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

Tags

Related News

IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. భాగ్యనగర అందాలతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం కూడా!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. యాదాద్రిలో ఆగనున్న ప్రత్యేక రైళ్లు!

ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోడీ పేరు..ఉత్తరప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం!

రేపు 10 గంటలపాటు రైళ్లు బంద్, 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

భయంకర పాము ఆకారంలో గుహ.. ఎక్కడుందో తెలుసా?

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?

బస్ డిపోకు వెళ్లాల్సిన పనిలేదు.. మీ కాలనీ నుంచే దసరా స్పెషల్ బస్సులు!

Big Stories

Advertisement
×