Actress : ప్రముఖ మరాఠీ యాక్టర్ జ్యోతి చందేకర్ కన్నుమూశారు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె.. ఆగస్టు 16న సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.. మరాఠీలో ఈమె నటించిన ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఈమె నటించింది. తన నటనతో ఇండస్ట్రీలు కి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈమె వయసు 68 ఏళ్లు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె మరణించింది. జ్యోతి లాంటి లెజెండరీ యాక్టర్ చనిపోవడంతో మరాఠీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నేడు ఈమె అంత్యక్రియలు పూణేలో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈమెలాంటి మంచి నటిని కోల్పోవడం బాధాకరం అని ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టు పెడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు..
జ్యోతి చందేకర్ కన్నుమూత..
ఈమధ్య ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు వరుసగా మరణిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి ఏదో దిష్టి తగిలినట్టు దిగ్గజన్నట్లు అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తీరని లోటుగా మిగిలింది. తాజాగా మారాఠి నటి అనారోగ్య సమస్యలతో పోరాడుతూ నిన్న తుది శ్వాస విడిచారు. తరాలా తార్ మాగ్‌లో పూర్ణ అజీ పాత్ర ద్వారా ప్రసిద్ధి చెందిన మరాఠీ నటి జ్యోతి చందేకర్ శనివారం పూణేలో 68 ఏళ్ల వయసులో మరణించారు. ఈమె మరణంతో మరాఠి ఇండస్ట్రీలో లోటు ఏర్పడింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారని సమాచారం. స్టార్ ప్రవాహ్ నివాళులర్పించారు. ఆమె అంత్యక్రియలు నేడు ఘనంగా జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పూణేలోని వైకుంఠ శ్మశానవాటికలో జరుగుతాయి..
జ్యోతి నటించిన సీరియల్స్..
మరాఠీ ఇండస్ట్రీ, టెలివిజన్ రంగం, రంగస్థలంలో ఆమె చేసిన సేవలకు ఎన్నో అవార్డులు అందుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.. ప్రేక్షకుల మనసు దోచుకొనే పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈమె నటించిన అన్ని పాత్రలు ప్రేక్షకుల మనసుని దోచుకునేలా ఉన్నాయి. ధోల్కీ, ‘తిచా ఉంబర్తా’. ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలు.. ‘ఛత్రీవాలీ’, ‘తూ సౌభాగ్యవతి హో’ వంటి సీరియల్స్ ద్వారా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. జీ గౌరవ్ అవార్డును కూడా ఈమె అందుకుంది. మారాఠి ఇండస్ట్రీ నుంచి ఎన్నో అవార్డులను అందుకుంది. ఈమె మరణ వార్తను విన్న ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు..