E-Paper
Advertisement

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!
Advertisement

Galaxy Watch Settings: శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లో ఫీచర్లు చాలా ఉంటాయి. మొదటిసారి వాడుతున్నప్పుడు ఏది ఆన్‌లో ఉంచాలి, ఏది మార్చాలి అనే విషయం కాస్త గందరగోళంగా అనిపించొచ్చు. ముఖ్యంగా Galaxy Watch 8, Galaxy Watch Ultra వంటి కొత్త మోడళ్లలో చిన్న మార్పులు కూడా బ్యాటరీ, వాడుక అనుభవంపై ప్రభావం చూపుతాయి. అందుకే వాచ్‌ను మీ అవసరాలకు తగ్గట్టు మార్చుకోవడానికి ఈ ఐదు సెట్టింగ్స్ ముందుగా సెట్ చేసుకోవడం మంచిది.

వాచ్ ఫేస్ మార్చండం:

వాచ్ ఫేస్‌ను మీకు నచ్చిన ఫొటోతో మార్చుకోవచ్చు. ఫేస్‌పై లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్లండి. డైలీ డ్యాష్‌బోర్డ్ ఫేస్‌లో ఒకేసారి ఎనిమిది వరకు కాంప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఎక్కువ యానిమేషన్ ఉన్న ఫేస్, AOD, ఆటో బ్రైట్‌నెస్ బ్యాటరీని వేగంగా తగ్గిస్తాయి. AOD, అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఆఫ్ చేసి, బ్రైట్‌నెస్‌ను 25 నుంచి 40 శాతం మధ్యలో ఉంచితే బ్యాటరీ కొంత ఎక్కువసేపు వస్తుంది.

జెస్చర్స్, బటన్లు సెట్ చేయడం:

Advertisement

థంబ్, చూపుడు వేలితో డబుల్ పించ్ చేస్తే కాల్ ఆన్సర్ చేయడం, అలారం ఆపడం, ఫొటో తీయడం వంటి పనులు చేయొచ్చు. రిస్ట్ షేక్‌తో కాల్ రిజెక్ట్ చేయడం కూడా సాధ్యమే. సెట్టింగ్స్‌లో Buttons and gestures ద్వారా వీటిని మార్చుకోవచ్చు. అలాగే వాచ్‌లోని బటన్లకు మీకు ఎక్కువగా అవసరమైన యాప్‌లను కేటాయించండి.

Also Read: 20% – 80% రూల్ నిజంగానే ల్యాప్‌టాప్ బ్యాటరీని కాపాడుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

టైల్స్‌ను కస్టమైజ్ చేయడం:

Advertisement

Galaxy Wearable యాప్‌లో టైల్స్‌ను కస్టమైజ్ చేసి ఒకే చోట ఎక్కువ సమాచారం చూసుకోవచ్చు. ఒక స్టాక్‌లో 11 వరకు విడ్జెట్లు పెట్టుకునే అవకాశం ఉంది. యాప్ లాంచర్‌ను గ్రిడ్ లేదా లిస్ట్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. ఎక్కువగా వాడే యాప్‌లను పైకి తీసుకురావడం, అవసరమైన యాప్‌లను ఫోల్డర్లలో పెట్టడం కూడా సులభమే.

వర్కౌట్స్ మోడ్:

Samsung Healthలో తరచూ చేసే వ్యాయామాలను ఫేవరెట్‌గా పెట్టుకోవచ్చు. మూడు వ్యాయామాలను షార్ట్‌కట్‌గా ఉంచి, వాటి క్రమాన్ని కూడా మార్చొచ్చు. అవసరం లేని వ్యాయామాలను హైడ్ చేసి, మీ రొటీన్‌కు సరిపోయే కస్టమ్ వర్కౌట్‌లను కూడా యాడ్ చేయవచ్చు. దీంతో జిమ్‌లో వాచ్ నుంచే వెంటనే ట్రాకింగ్ మొదలుపెట్టొచ్చు.

మోడ్స్‌తో బ్యాటరీ ఆదా:

Sleep, Theater, Work వంటి Modes ద్వారా కొన్ని పనులను ఆటోమేటిక్‌గా మార్చుకోవచ్చు. మీకు అవసరం లేని సమయంలో AOD, GPS, NFC, Wi-Fi లేదా LTE వంటి ఫీచర్లను ఆఫ్ చేయడం బ్యాటరీని ఆదా చేస్తుంది. అయితే అన్నింటినీ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వాచ్‌ను ఎలా వాడుతున్నారో కొన్ని రోజులు గమనించి, అవసరమైన ఫీచర్లను మాత్రమే ఆన్‌లో ఉంచడం మంచి పద్ధతి. మొదట్లో అన్ని సెట్టింగ్స్ ఒకేసారి మార్చాల్సిన పని లేదు. ఒక్కో ఫీచర్‌ను మార్చి కొన్ని రోజులు వాడితే మీకు ఏ సెట్టింగ్ నిజంగా ఉపయోగపడుతుందో సులభంగా తెలుస్తుంది.

Also Read: రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో ఈ ఒక్కటి ఆన్ చేయండి.. పొద్దున్నే చాలా ఫ్రెష్‌గా లేస్తారు!

Tags

Related News

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

ఫోన్ వేడిగా ఉన్నప్పుడు పొరపాటున కూడా..ఈ పనులు చేయొద్దు!

20% – 80% రూల్ నిజంగానే ల్యాప్‌టాప్ బ్యాటరీని కాపాడుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఒక ఇయర్‌బడ్‌లో సౌండ్ తక్కువగా వస్తోందా? కొత్తవి కొనే ముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

కొత్త మిడ్-రేంజ్ ఫోన్ బెస్ట్ ఆ? పాత ఫ్లాగ్‌షిప్ మొబైలా? ఏది కొనాలి?

అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!

Big Stories

Advertisement
×