E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Bhagya Raj: మరణంలో కూడా ఆగని సాయం.. భాగ్యరాజ్ గొప్ప మనసుకు సినీలోకం ఫిదా!

Bhagya Raj: మరణంలో కూడా ఆగని సాయం.. భాగ్యరాజ్ గొప్ప మనసుకు సినీలోకం ఫిదా!
Advertisement

Bhagya Raj: చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు అభిమానులను అగాధంలోకి నెట్టివేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారంలోనే ఇద్దరు దిగ్గజ దర్శకులు తుది శ్వాస విడబడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దిగ్గజ దర్శకుడు భారతీ రాజా మరణ వార్త మరువకముందే ఆయన శిష్యుడు, దర్శక – రచయిత కే భాగ్యరాజ్ మరణం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం (జూన్ 27న) నాడు ఆయన తన నివాసంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. కే.భాగ్యరాజ్ మరణించినప్పటికీ మరణాంతరం కూడా తన గొప్ప మనసుని చాటుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.

గొప్ప మనసు చాటుకున్న భాగ్యరాజ్..

సాధారణంగా సెలబ్రిటీలలో కొంతమంది సినిమాలలో నటించామా.. డబ్బు పోగు చేసుకున్నామా..అనే కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది సంపాదించిన డబ్బులు ఇతరుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది తమ మరణాంతరం కూడా తాము ఏదో విధంగా ఇతరులకు ఉపయోగపడాలి అనే కోణంలో ఆలోచిస్తూ తమ అవయవాలను కూడా దానం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కే భాగ్యరాజ్ కూడా అవయవ దానం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

మరొకరికి కంటి చూపు..

Advertisement

తాజాగా ఆయన చనిపోతూ మరొకరికి కంటి చూపు ప్రసాదించారు. చాలాకాలం క్రితమే కళ్ళు దానం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ఆయన.. మరణించగానే ఆయన మాటను గౌరవిస్తూ కుటుంబ సభ్యులు కంటి ఆసుపత్రికి సమాచారం ఇచ్చారు. ఇక వెంటనే ఆయన ఇంటికి చేరుకున్న డాక్టర్లు ఆయన కళ్ళను సేకరించారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భాగ్యరాజ్ మంచి మనసుకి నెటిజన్స్ ఫిదా అవుతూ సెల్యూట్ చేస్తున్నారు.

భాగ్యరాజ్ కెరియర్..

 

Advertisement

భాగ్యరాజ్ విషయానికొస్తే.. 1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలో జన్మించిన భాగ్యరాజ్ తన సినీ ప్రయాణాన్ని డైరెక్టర్ భారతీరాజా వద్ద ప్రారంభించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, రచయితగా తన కెరీర్ను ప్రారంభించిన ఈయన సామాన్య ప్రజల జీవితాలను , సున్నితమైన హాస్యాన్ని తన సినిమాలలో అద్భుతంగా ఆవిష్కరించి, ఒక ప్రత్యేకమైన మార్క్ వేసుకున్నారు. ముఖ్యంగా ఆయన కథనాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. పైగా కోలీవుడ్ లో ఈయనను స్క్రీన్ ప్లే కింగ్ అని కూడా పిలిచేవారు. ఇక ఆయన తన సినీ ప్రస్థానంలో 75 కి పైగా చిత్రాలలో నటించి , 25 కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. వెంకటేష్ నటించిన అబ్బాయిగారు చిత్రానికి కథను అందించిన ఈయన.. ముందానై ముడిచు అనే చిత్రంతో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

also read: ట్రాక్ ఎక్కిన అయ్యగారు.. లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!

Related News

ట్రాక్ ఎక్కిన అయ్యగారు.. లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!

కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి.. బాహుబలి పార్ట్ 2 చూస్తానో లేనో అంటూ!

Ram Charan : లండన్ లో ‘పెద్ది’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్..

OG యూనివర్స్ ఎక్స్‌పాండ్.. మేకర్స్ నుండీ మరో సర్‌ప్రైజ్!

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ… కాంట్రవర్సీకి తెరలేపిన ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ !

పెళ్లి, విడాకులపై త్రిష కామెంట్స్!

వెంకీ మామ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ లాక్.. మిస్ అవుతారేమో?

Big Stories

×