Intinti Ramayanam Today Episode May 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య అవని దగ్గరికి వెళ్లిన విషయాన్ని చెప్తుంది. అది విన్న పల్లవి అక్షయ్ పార్వతీతో చెప్తుంది.. పార్వతి అక్షయలు మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీకరు లాయర్ గా అప్పుడప్పుడు కేసు కోట్లని తిరుగుతున్నాడు కానీ కమల్ మాత్రం ఆఫీస్ కి రావట్లేదు ఎలాగైనా వాన్ని దారిలో పెట్టాలి అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఆరాధ్యను అవనికి దూరం చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుంటుంటే పల్లవి సడన్గా ఎంట్రీ ఇస్తుంది. మీరు అనుకుంటున్నట్లు ఆరాధ్య అవనీని మర్చిపోవడం కాదు మావయ్య ఆరాధ్యను అవన్నీ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. రేపు కమల్ కూడా అవని దగ్గరికి తీసుకెళ్తాడు ఏదో ఒకటి చేయకుంటే మనం ఆరాధ్య కోసం ప్రణతిలాగే అవని దగ్గరికి వెళ్లాలని పల్లవి అంటుంది. అవనికి అక్షయ్ షాకిస్తాడు. అవని ఇంటికి వెళ్లి గొడవ వేసుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. అవని ఆరాధ్యను స్కూల్ మార్పించిన విషయాన్ని ప్రణతి వాళ్ళతో చెప్తుంది. తల్లి బిడ్డను వేరు చేయాలనుకోవడం ఎంత పాపము అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇంటి నుంచి కోడల్ని గెంటేసారు ఇప్పుడు తల నుంచి బిడ్డని వేరు చేయాలని చూస్తున్నారా ఇలా చేయడం వల్ల ఎంత పాపమో తెలుసా అని అందరూ తలా ఒక మాట అంటారు. కానీ అవని మాత్రం నేను నా బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్తానో ఇప్పటివరకు నేను మౌనంగా ఉండడమే చూశాను అని అంటుంది. బిడ్డ కోసం నేను ఏం చేయాలో అది చేస్తాను మీరు ఏం కంగారు పడకండి అని అవని వెళ్ళిపోతుంది.
స్వరాజ్యం దయాకర్ ప్రణతి భరత్ అవినీకి ఆరాధ్యను ఎలా దగ్గర చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఒక ప్లాన్ ప్రకారం చేస్తే ఆరాధ్య మన దగ్గరికి వస్తుంది అని స్వరాజ్యం అంటుంది. అయితే మీరిద్దరు సపోర్ట్ చేయాలి ఈ విషయాన్ని అవనికి ఎట్టి పరిస్థితులను తెలియకుండా ఉంచాలి అని అంటారు. ప్రణతి భరత్ ఇద్దరూ మా అక్క కోసం మేము ఏమైనా చేస్తామని ఎలా చేయాలో అలా చేద్దామని ప్లాన్ చేస్తారు. మొత్తానికి అనుకున్న ప్లాన్ ని రేపు వర్కౌట్ అయ్యేలా చేయాలని అనుకుంటారు.
ఇక కమల్ నిద్రపోతుంటే పల్లవి దగ్గరికి భానుమతి వస్తుంది. నాకు ఒక అనుమానం ఉందే మా ఆయన నిజంగానే వస్తున్నాడా? మీ ఆయనే మా ఆయన లాగా గెటప్ వేసుకుని నన్ను ఆట పట్టించడానికి వస్తున్నాడేమో అని నాకు అనుమానం గా ఉంది అని అడుగుతుంది.. మరి నువ్వు చెప్పినట్లు వినాలి అంటే ఏం చేయాలో విషయం చెప్పు అని అడుగుతుంది. అయితే ఈసారి మీ ఆయన వస్తే బాధ పెట్టు ఆ వాత మీ మనవడుకుందో లేదో చూసుకో అని పల్లవి అంటుంది. మా ఆయనకు వాత పెట్టమంటావా మీ ఆయనకు బాధ పెట్టడమే కరెక్ట్ అని భానుమతి అంటుంది. ఆ విషయాన్ని నిద్రపోతున్నట్లు నటించిన కమల్ వింటాడు..
ఇక ఉదయం ఆఫీసుకు వెళ్ళగానే అవని అక్కడ పువ్వులను సద్దుతూ ఉంటుంది. అప్పుడే అక్షయ అక్కడికొచ్చి తన ఆఫీసులో ఒక మనిషిని చెప్పిన పని చేయడం మీకు చేతకాదా అని అరుస్తాడు. నిన్ను కూడా ఇలాగే ఆఫీసులో అరవకుండా ఉండాలంటే నేను రాకముందు నేను వెళ్ళిన తర్వాత నీ పని నువ్వు చూసుకోని వెళ్ళు నేను వచ్చిన టైంలో నువ్వు వస్తే అస్సలు బాగోదు అని అంటాడు. తల్లిని బిడ్డని వేరు చేయాలని మీరు అనుకోవడం న్యాయమే నాని అవని అంటుంది.. నువ్వు చేస్తుంది అలా ఉంది కాబట్టే ఇలా అంటున్నాను అని అక్షయ్ అంటాడు. ఒకప్పుడు నాతో మాట్లాడాలని చాలా ఆరాటపడేవారు. కానీ ఇప్పుడు నాతో మాట్లాడటం ఇష్టం లేదని మొహానే చెప్పేస్తున్నారు అని అక్షయ్ తో అవని అంటాడు..
తల్లి కూతుర్లను వేరు చేయడం మీకు న్యాయమని అనిపిస్తుందా..? నా కూతురు ను దక్కించుకోవాడానికి ఎక్కడికైనా వెళ్తాను మీరు ఏం చేస్తే అది చేసుకోండి అని అవని అక్షయతో అంటుంది. ఇక రాజేంద్రప్రసాద్ ఇంటి ముందర దయాకర్ స్వరాజ్యం తో పాటు మరికొంతమంది అక్కడ కూర్చుని అవినీతి న్యాయం జరగాలి అంటూ ఫ్లెక్సీలు పట్టుకొని ధర్నాకు దిగుతారు. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి ఏంటి ఇలా చేస్తున్నారు అవని నేర్పించిందని పల్లవి అంటుంది. రాజేంద్రప్రసాద్ సంతోష పడతాడు. అయితే శ్రీకర్ కమల్ వాళ్లతో చేరి అవినీతి న్యాయం జరగాలని ధర్నా చేస్తారు..
పల్లవి నేను మీకు ఎంత కావాలో అంత ఇస్తాను ఇక నుంచి వెళ్లిపోండి అని అంటుంది. దిమ్మ తిరిగేలా పల్లవికి ప్రణతి సమాధానం చెప్తుంది.. ఇక పార్వతి అక్షయ్ కి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్తుంది. నువ్వంటేనే రారా అని అనగానే అవనిని పిలిచి అక్షయ అరుస్తాడు. దిగజారి పోయావ్ ఏంటి నువ్వు నీ మనిషిని నా ఇంటి దగ్గరికి పంపించి ధర్నా చేయమని చెప్పావా? ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు నేనేం చేస్తానో నాకు తెలియదు మీ వాళ్ళందని పోలీసులు పెట్టి అరెస్టు చేస్తాను అని చెప్పగానే అవని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళుతుంది.. అక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..