E-Paper
Advertisement

Kissik Talks: సినిమా టికెట్ ధరలపై సంజన రియాక్షన్!

Kissik Talks: సినిమా టికెట్ ధరలపై సంజన రియాక్షన్!
Advertisement

Kissik Talks:బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న సంజన గల్రాణి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చి.. టికెట్ ధరలపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా టికెట్ రూ.300 అయితే పాప్ కార్న్ రూ.350 కదా.. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని వర్షా అడిగింది

టికెట్ ధరల పెంపుపై సంజన రియాక్షన్..

సంజన మాట్లాడుతూ.. “బెంగళూరులో మేము గోల్డ్ క్లాస్ వెళ్తాము.. సినిమాకి వెళ్ళాలి అంటే ఒక్కొక్క టికెట్ ధర రూ.8000. రిక్లైనర్ సీట్ అయితే రూ.1500 ఒక్కొక్కరికి.. ఒక నలుగురు వెళ్లాలి అంటే మినిమం రూ.6000 టికెట్స్ కి ఖర్చు అవుతుంది. రిక్లైనర్ సీట్ కి మాత్రమే ఈ ప్రైజ్. మీరేమో రూ.350 అంటున్నారు . కానీ అక్కడ పెద్ద బకెట్ రూ.800 నుంచి రూ.900 ఉంటుంది. సినిమాకి వెళ్తున్నామా లేక ఫ్లైట్లో వెళ్తున్నామా అని అనుమానం కలుగుతుంది. అంటూ తెలిపింది సంజన.

ధర పెంపుపై కాదు నిర్మాతల గురించి ఆలోచించాలి – సంజన

Advertisement

ఇక డబ్బున్న వాళ్ళకైతే పరవాలేదు.. మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమాకు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలి అంటే మీరు ఏం చెప్తారు? అని ప్రశ్నించగా.. “ఆడియన్స్ నుంచే కాదు అటు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వైపు నుంచీ కూడా మాట్లాడాలి. ముఖ్యంగా వారు ఒక్కో సినిమాకి రూ. 400 నుండి రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయిస్తారు. అంత డబ్బు వాళ్లు ఎలా రికవరీ చేస్తారో .. లైఫ్ అంటేనే ఒక ఛాలెంజ్.. నేను కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో చెప్పండి. 10 పెద్ద సినిమాలు విడుదలయితే.. అందులో ఒకటి లేదా రెండు చిత్రాలు మాత్రమే హిట్ అవుతున్నాయి . మిగిలిన ఎనిమిది మంది నిర్మాతలు తమ డబ్బును కోల్పోతున్నారు. నష్టాల్లో మునిగిపోతున్నారు. ఒక్క మూవీ ఫ్లాప్ అయ్యింది అంటే ఆ దర్శక నిర్మాతలకు జీవితమే పోతుంది. డబ్బు అప్పుగా తీసుకుంటారు. ఆ వడ్డీలు కట్టాలి.. ఇక్కడ డబ్బు పోతుంది.. ఇక వారు ఎంత నరకం అనుభవిస్తారో మనం మాటల్లో చెప్పలేము. ముఖ్యంగా ఆస్తులను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇక ఆ సమయంలో వారి పరిస్థితి చూస్తే నాకు కూడా చాలా భయం వేస్తుంది” అంటూ టికెట్ ధరల పెంపు పై అటు ఇండస్ట్రీ నుంచి కూడా అభిప్రాయాలను చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది సంజన.

also read:Kissik Talks: ప్రభాస్ పై సంజన ఊహించని కామెంట్స్.. అలాంటి రోజు వస్తుందా?

టికెట్ ధర పెరిగినా పర్వాలేదు..

Advertisement

మొత్తానికైతే సంజన చేసిన కామెంట్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది సామాన్యుడు ఇంత పెద్ద భారం మోయగలడా అనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇండస్ట్రీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆమె మాట్లాడుతూ సినిమా టికెట్ ధర పెరిగిన నాకేం ప్రాబ్లం లేదు అంటూ తెలిపింది. ముఖ్యంగా రియల్ టైం సినిమాలను ఫీల్ అవ్వడానికి మాత్రమే నేను థియేటర్ కి వెళ్తాను. లేదా ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ పై ఆధారపడుతున్నాను అంటూ తెలిపింది.

Related News

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Big Stories

Advertisement
×