E-Paper
Advertisement

సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?

సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
Advertisement

Reshma Rathore: డాక్టర్లుగా , ఇంజనీర్లుగా పనిచేసిన ఎంతోమంది.. సినిమా మీద మక్కువతో ఆ వృత్తిని పక్కనపెట్టి, కెమెరా ముందు ముఖానికి రంగు వేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్న వారిని చూసాం. కానీ ఇక్కడ ఒక తెలుగు హీరోయిన్ మాత్రం తెలుగులో సినిమాలు, సీరియల్స్ చేసి.. నటిగా మంచి పేరు సొంతం చేసుకొని.. ఇప్పుడు సినిమాలు పక్కన పెట్టి, తన కొత్త జీవితాన్ని ఆరంభించింది. ఏకంగా ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో లాయర్ గా పనిచేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి తెలుగు ప్రేక్షకులను తెరపై ఆకట్టుకొని.. ఇప్పుడు సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తూ అందరిని మెప్పిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

సుప్రీంకోర్టులో లాయర్ గా..

ఆమె ఎవరో కాదు రేష్మ రాథోర్ (Reshma Rathore). సీరియల్స్ లో నటించి తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత వెంకటేష్(Venkatesh), త్రిష( Trisha ) కాంబినేషన్లో వచ్చిన ‘బాడీగార్డ్’ సినిమాలో త్రిషకు ఫ్రెండ్ గా నటించి ఆకట్టుకుంది. ఇక అదే ఏడాది ‘ఈ రోజుల్లో’ అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె..హీరోయిన్గా నటించిన తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలో తన కెరియర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవడంలో విఫలం అయింది అని చెప్పాలి. ఈ రోజుల్లో తర్వాత జైశ్రీరామ్, ప్రతిఘటన, లవ్ సైకిల్, జీలకర్ర బెల్లం అంటూ తెలుగు చిత్రాలు చేసిన ఈమె.. ఆ తర్వాత తమిళ్ , మలయాళం చిత్రాలలో కూడా నటించింది కానీ ఏవి కూడా ఈమెకు గుర్తింపును అందించలేదు.

నటనకు పూర్తిగా గుడ్ బై..

Advertisement

దీంతో నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. 2017లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది .అలా బిజెపి పార్టీలో చేరిన ఈమె మరొకవైపు లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. ఇకపోతే నటిగా సత్తా చాటలేకపోయినా ఈమె.. అటు పొలిటికల్ పరంగా ఇటు లాయర్ గా తనదైన మార్క్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.. గత ఏడాది ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు లాయర్ గా పదోన్నతి పొందినట్లు సమాచారం. ఇకపోతే అప్పట్లో ఒకలా ఉన్న రేష్మ ఇప్పుడు చాలా వరకు మారిపోయి.. చాలా కొత్త లుక్ లో కనిపించింది . ఆమెను వెంటనే చూస్తే గుర్తుపట్టలేరు. కానీ కాస్త తీక్షణంగా చూస్తే ఆమెను గుర్తుపట్టవచ్చు. ఏది ఏమైనా ఒక తెలుగు హీరోయిన్ ఇప్పుడు సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తుండడం నిజంగా గ్రేట్ అంటూ ఆమెపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

also read: బిగ్ బాస్ 10 హోస్ లోకి వెళ్లే సెలబ్రిటీస్, కామనర్స్ లిస్ట్ ఇదే!

తల్లి న్యాయవాది..

Advertisement

రేష్మ రాథోర్ విషయానికి వస్తే.. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఎల్లందులో జన్మించారు. ఈమె తండ్రి శ్రీ హరిదాసు రాథోర్.. గోదావరి ఖనిలోని సింగరేణి కాలరీస్ కంపెనీలో డిప్యూటీ సూపర్డెంట్ గా, మైనింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈమె తల్లి దివంగత శ్రీమతి రాధాబాయి రాథోర్. గతంలో ఈమె హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ఇక రేష్మ రాథోర్ వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ ని అభ్యసించడానికి ప్రవేశం పొందారు. ఇక ఈమెకు తమ్ముడు పృథ్వీరాజ్ రాథోర్ కూడా ఉన్నారు. ఇతను బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ కోర్స్ పూర్తి చేశారు.

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×