BigTV English

OTT Movie : మార్వెల్ నుంచి వచ్చిన విచ్ స్టోరీ… మంత్రగత్తె కోసం కుర్రాడి సాహసం

OTT Movie : మార్వెల్ నుంచి వచ్చిన విచ్ స్టోరీ… మంత్రగత్తె కోసం కుర్రాడి సాహసం

OTT Movie : హారర్ సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడం కష్టమే. అది థియేటర్లలో రిలీజ్ అవుతుందా ఓటిటిలో రిలీజ్ అవుతుందా అన్నది ముఖ్యం కాదు. హారర్ మూవీనా కాదా అన్నదే ఇంపార్టెంట్. సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలు ఎంత ఎంగేజింగ్ గా ఉంటాయో అంతే భయంకరంగా కూడా ఉంటాయి. అయితే ఈ జానర్లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ అన్ని వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వచ్చిన ప్రతి హారర్ సినిమాను వదలకుండా చూడాలి అనుకుంటారు హర్రర్ మూవీ లవర్స్. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన విచ్ స్టోరీ. మరి ఈ మూవీ పేరేంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయంలోకి వెళ్తే…


డైరెక్ట్ గా ఓటీటీలోకి…

మార్వెల్ సంస్థ గురించి హాలీవుడ్ మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సూపర్ హీరోల సినిమాలన్నీ దాదాపుగా మార్వెల్ సినీమాటిక్ యూనివర్సిటీ వస్తాయి. అందుకే మార్వెల్ నుంచి వచ్చే సినిమాలు, సిరీస్లకు మంచి పాపులారిటీ ఉంటుంది. ప్రమోషన్స్ కూడా అక్కర్లేదు అన్న రేంజ్ లో బజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ఒక మంత్రగత్తెకు సంబంధించింది. ఈ సిరీస్ ను మార్వెల్ టెలివిజన్ అనే ఒక కొత్త ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించి, డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. పైగా మార్వెల్ నుంచి వస్తున్న ఫస్ట్ హారర్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. ఇక ఇప్పటిదాకా మార్వెల్ సినీమాటిక్  యూనివర్స్ లో 10 వెబ్ సిరీస్ లు రూపొందగా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వెబ్ సిరీస్ 11వ స్థానంలో ఉంటుంది. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. అయితే నిరాశను కలిగించే విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ సిరీస్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులో వచ్చే అవకాశం ఉంది.


Llega Agatha All Along: para los amantes de WandaVision y Kathryn Hahn

స్టోరీ లోకి వెళ్తే…

వాండా విజన్ అనే వెబ్ సిరీస్లో అగదా అనే పాత్రను చూసే ఉంటారు. ఇప్పుడు ఆ పాత్రతోనే సెపరేట్ గా ఈ వెబ్ సిరీస్ ను తీసుకొచ్చారు మార్వెల్ మేకర్స్. ఇక స్టోరీలోకి వెళ్తే అగదా అనే మంత్రగత్తె తాను కోల్పోయిన మంత్ర శక్తులను తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే విచ్ రోడ్ కు ఒక కుర్రాడి సహాయంతో వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక చాలామంది మంత్రగత్తెలు కనిపిస్తారు. అసలు వీళ్లంతా ఒక్క దగ్గరకు చేరి ఏం చేస్తున్నారు? ఆ మంత్రగత్తకు సహాయం చేసిన కుర్రాడు ఎవరు? మంత్రగత్తె అని తెలిసినా ఎందుకు హెల్ప్ చేశాడు? ఆ మంత్రగత్తే తన శక్తులను కోల్పోవడానికి కారణం ఏంటి? అనే విషయం తెలియాలంటే అగదా ఆల్ అలాంగ్ అనే ఈ సిరీస్ ని చూడాల్సిందే. మొత్తంగా 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం రెండు ఎపిసోడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ చివరి నాటికి కంప్లీట్ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది.

Related News

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

OTT Movie : 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ కు పవర్స్… ఒక్కొక్కడినీ చిత్తుచిత్తుగా కొట్టి తరిమేసే పిల్ల పిశాచాలు… పిల్లలకు పండగే

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

OTT Movie : డ్రగ్స్ మత్తులో దెయ్యాలని పిలిచే మెంటలోడు… కట్ చేస్తే ఒక్కొక్కడికి ఉంటదిరా చారీ

Idli Kottu OTT: ధనుష్ ఇడ్లీకొట్టు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… పెళ్ళాన్ని లేపేయడానికి మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×