Satyabhama Today Episode December 22 nd : నిన్నటి ఎపిసోడ్ లో.. సంధ్యా నందిని రావడంతో క్రిష్ సత్యలు సంతోషపడతారు. సంధ్యను మాత్రం సంజయ్ తన బెడ్ రూమ్ కి తీసుకెళ్లి లోపల లాక్ చేస్తాడు. సంధ్య సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి కాసేపు రొమాన్స్ చేసుకుంటారు. సంధ్య నాకు భయమేస్తుంది నేను వెళ్ళిపోతాను అంటే వెళ్లాలనుకుంటే వెళ్ళు అంటాడు. కానీ సంధ్య మాత్రం వెళ్ళదు. ఇక బర్త్డే ఏర్పాట్లను సత్య దగ్గరుండి చూసుకుంటుంది. సత్య సంధ్య ఎక్కడ కనిపించట్లేదు అనేసి క్రిష్ తో అంటుంది..సంధ్య ఏమైనా చిన్నపిల్లనా ఎక్కడికి పోతుంది వస్తుందిలే అనేసి అరుస్తాడు. క్రిష్ రాగానే నా డ్రెస్ ఎలా ఉంది బాపు అని అడుగుతాడు. చాలా బాగుందిరా అని క్రిష్ సెలెక్షన్ పై తెగ పొగిడేస్తారు. ఇదంతా కాదు నేను అసలు నిజం చెప్పాలి ఈ డ్రెస్ ని సెలెక్ట్ చేసింది నీ చిన్న కోడలే అంటాడు. నా చిన్న కోడలు ఏదైనా గాని మొగుడు గురించి బాగా ఆలోచిస్తుంది అందుకే ఇంత బాగా సెలెక్ట్ చేసిందనేసి మహదేవయ్య సత్యను మెచ్చుకుంటాడు. చక్రవర్తి కూడా పార్టీకి వస్తాడు. సంజయ్ ఇంకా రాలేదని సత్య వెళ్లి పిలుచుకొని వస్తుంది. ఇద్దరు కలిసి కేకు కట్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే..ఇక క్రిష్ మహాదేవయ్య అనుకోని చక్రవర్తి వైపు క్రిష్ తిరుగుతాడు. ఇక సత్య కేకు తీయడానికి కుదరదు ఎవరివైపు తిరిగావో వారికే కేక్ పెట్టాలి అంటే నువ్వు మీ బాబాయికి కేక్ పెట్టాలి అనేసి అంటుంది.. ఇక క్రిష్ అందరి మాట విని బాబాయ్ కి కేక్ పెడతాడు. ఇక సంజయ్ నువ్వు మా డాడీకి కేకు పెట్టావు నేను మీ డాడీకి పెడతాను అంటాడు. ఇదంతా చూసిన భైరవి ఏంటి గందరగోళం అనేసి అనుకుంటుంది. ఎవరికీ ఎవరు కొడుకు అర్థం కావట్లేదు. మరోవైపు మహదేవయ్య సత్య పుట్టిళ్లు తనది అని గొడవ చేసిన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చావ్రా అని అడుగుతాడు. డబ్బు కావాలని ఆ వ్యక్తి చెప్తాడు. నందిని తండ్రిని ఆ వ్యక్తిని చూసి గుర్తు పట్టి వాడేంటి ఇక్కడికి వచ్చి బాపుతో మాట్లాడుతున్నాడని అనుకుంటుంది. తండ్రి ఆయనకు డబ్బు ఇవ్వడం చూసేస్తుంది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని తెలుసుకోవాలని అనుకుంటుంది.. సత్య వదిన చెప్పింది నిజమే ఏమో తెలుసుకోవాలని అనుకుంటుంది. క్రిష్ కు బాబాయ్ గోల్డ్ చైన్ ఇస్తాడు. మహాదేవయ్య సంజయ్ కు గోల్డ్ చైన్ ఇస్తాడు. అది చూసిన సత్య మీ కొడుకుకు గోల్డ్ చైన్ ఇచ్చారా అని అడుగుతుంది. క్రిష్ ఎవరి కొడుకో నాకు నిజం తెలుసు అనగానే మహాదేవయ్యకు చెమటలు పడతాయి.
సత్య చెప్పిన దానికి మహాదేవయ్య టెన్షన్ పడతాడు. ఈ నిజం ఎలా తెలుసు అని ఆలోచిస్తాడు. సత్యభామ ఫిక్స్ అయితే తెలుసుకోకుండా ఆగదు. మీరు చూస్తూ ఉండండి తండ్రి కొడుకులు కలిసిపోతారు అనేసి అనగానే మహాదేవయ్యకు చెమటలు పడతాయి. ఏంటి మామా కోడలు ఏదో గుసగుసలు చెప్పుకుంటున్నారని జయమ్మ ఆడుతుంది. కొడుకు సంతోషం చూసి మురిసిపోతున్నాడు మామయ్య అనగానే అందరు నవ్వుకుంటారు. అందరు కేకు పెట్టేసిన తర్వాత భోజనానికి వెళ్తారు. సత్య స్పెషల్ తో ఒక పట్టు పడతారు. అందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి సత్యనే కారణం అని అంటాడు. ఇక భోజనాలు అయ్యాక క్రిష్ సత్య కోసం వెయిట్ చేస్తాడు. సత్య ఎక్కడుందా అని అడుగుతాడు. గార్డెన్ లో ఉన్న సత్యను కలుస్తాడు. ఇంట్లో అందరు గొడవలు అన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉన్నారు ఇదంతా నీ వల్లే.. ఇదంతా నా సంతోషం కోసం చేసావు నువ్వు చేసిందానికి నేనేం చెయ్యాలో చెప్పు అంటాడు. ఇక సత్య మనమధ్య ఏం జరిగిన మనం విడిపోకూడదు అని ఎమోషనల్ అవుతుంది. నీ ఏ కష్టం రాకుండా నువ్వు చేసే ప్రతి పనికి తోడుగా ఉంటాను అని మాట ఇస్తాడు..
ఇక సత్య ఈ ఒక్క మాట చాలు. నేను ఏదో గెలిచినా ఫీలింగ్ వస్తుంది అంటుంది. అంతేనా ఇక ఏం లేదా అని రొమాన్స్ చేస్తారు. ఇక ఆ తర్వాత రోజు ఉదయం మహాదేవయ్య టెన్షన్ పడుతుంటాడు. ఎమ్మెల్యే గా గెలుస్తానా? అని క్రిష్ ను అడుగుతాడు. ఎమ్మెల్యే అవ్వడం నీకల దాన్ని నేరవెర్చే బాధ్యత నాది అంటాడు. అలాగని మాట ఇవ్వు అంటాడు. అది చూసిన సత్య షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.