BigTV English

Satyabhama Today Episode : సత్య ప్రేమకు క్రిష్ ఫిదా.. మహాదేవయ్యకు మాట ఇచ్చిన క్రిష్..

Satyabhama Today Episode : సత్య ప్రేమకు క్రిష్ ఫిదా.. మహాదేవయ్యకు మాట ఇచ్చిన క్రిష్..

Satyabhama Today Episode December 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజయ్ కు ఎలాగైనా నిజం చెప్పాలని సంధ్య నందినితో కలిసి మహాదేవయ్య ఇంటికి వస్తారు. సంధ్యను మాత్రం సంజయ్ తన బెడ్ రూమ్ కి తీసుకెళ్లి లోపల లాక్ చేస్తాడు. సంధ్య సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి కాసేపు రొమాన్స్ చేసుకుంటారు. సంధ్య నాకు భయమేస్తుంది నేను వెళ్ళిపోతాను అంటే వెళ్లాలనుకుంటే వెళ్ళు అంటాడు. కానీ సంధ్య మాత్రం వెళ్ళదు. ఇక బర్త్డే ఏర్పాట్లను సత్య దగ్గరుండి చూసుకుంటుంది. సత్య సంధ్య ఎక్కడ కనిపించట్లేదు అనేసి క్రిష్ తో అంటుంది..సంధ్య ఏమైనా చిన్నపిల్లనా ఎక్కడికి పోతుంది వస్తుందిలే అనేసి అరుస్తాడు. క్రిష్ రాగానే నా డ్రెస్ ఎలా ఉంది బాపు అని అడుగుతాడు. చాలా బాగుందిరా అని క్రిష్ సెలెక్షన్ పై తెగ పొగిడేస్తారు. ఇదంతా కాదు నేను అసలు నిజం చెప్పాలి ఈ డ్రెస్ ని సెలెక్ట్ చేసింది నీ చిన్న కోడలే అంటాడు. నా చిన్న కోడలు ఏదైనా గాని మొగుడు గురించి బాగా ఆలోచిస్తుంది అందుకే ఇంత బాగా సెలెక్ట్ చేసిందనేసి మహదేవయ్య సత్యను మెచ్చుకుంటాడు. చక్రవర్తి కూడా పార్టీకి వస్తాడు. సంజయ్ ఇంకా రాలేదని సత్య వెళ్లి పిలుచుకొని వస్తుంది. ఇద్దరు కలిసి కేకు కట్ చేస్తారు. ఎవరికొడుకుకు వాళ్ళు కేకు పెడతారు గిఫ్ట్ కూడా ఇస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ చక్రవర్తికి కేకు పెడతాడు. అలా సంజయ్ కూడా మహాదేవయ్యకు కేకు పెడతాడు. ఇక ఇదంతా చూసిన భైరవి ఏంటి గందరగోళం అనేసి అనుకుంటుంది. ఎవరికీ ఎవరు కొడుకు అర్థం కావట్లేదు. మరోవైపు మహదేవయ్య సత్య పుట్టిళ్లు తనది అని గొడవ చేసిన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చావ్రా అని అడుగుతాడు. డబ్బు కావాలని ఆ వ్యక్తి చెప్తాడు. నందిని తండ్రిని ఆ వ్యక్తిని చూసి గుర్తు పట్టి వాడేంటి ఇక్కడికి వచ్చి బాపుతో మాట్లాడుతున్నాడని అనుకుంటుంది. తండ్రి ఆయనకు డబ్బు ఇవ్వడం చూసేస్తుంది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని తెలుసుకోవాలని అనుకుంటుంది.. సత్య వదిన చెప్పింది నిజమే ఏమో తెలుసుకోవాలని అనుకుంటుంది. క్రిష్ కు బాబాయ్ గోల్డ్ చైన్ ఇస్తాడు. మహాదేవయ్య సంజయ్ కు గోల్డ్ చైన్ ఇస్తాడు. అది చూసిన సత్య మీ కొడుకుకు గోల్డ్ చైన్ ఇచ్చారా అని అడుగుతుంది. క్రిష్ ఎవరి కొడుకో నాకు నిజం తెలుసు అనగానే మహాదేవయ్యకు చెమటలు పడతాయి.

సత్య చెప్పిన దానికి మహాదేవయ్య టెన్షన్ పడతాడు. ఈ నిజం ఎలా తెలుసు అని ఆలోచిస్తాడు. సత్యభామ ఫిక్స్ అయితే తెలుసుకోకుండా ఆగదు. మీరు చూస్తూ ఉండండి తండ్రి కొడుకులు కలిసిపోతారు అనేసి అనగానే మహాదేవయ్యకు చెమటలు పడతాయి. జయమ్మ ఏంటో ఈ తిరకాసు అనేసి అంటుంది. ఈ బైరవి తిరకాసు కాదు అది 20 కాసుల బంగారం అని అంటుంది. ఇక సంజయ్ చూసావా డాడీ ఏదైనా గాని రావాలనుకుంటే వస్తాయి 20 కాసుల బంగారం నా సొంతమైంది ఎంత ఖరీదైన గిఫ్ట్ చూసావా అనేసి చక్రవర్తితో అంటాడు. ఆ తర్వాత అందరూ ఫ్యామిలీ పార్టీ చేసుకోవాలని నందిని అంటుంది. ముందుగా సత్య క్రిష్లు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ తర్వాత సంజయ్ సంధ్య డాన్స్ వేస్తారు. ఇక అందరూ కలిసి ఫైనల్ గా ఫ్యామిలీ పార్టీ చేసుకుంటారు. వీళ్ళందరూ పార్టీ చేసుకుంటుంటే మహదేవయ్య చక్రవర్తిని తీసుకొని పక్కకు వెళ్తాడు. ఏమైంది నువ్వు నిజం చెప్పావా సత్యకు అంటే నేను నిజం చెప్పలేదు సత్యమే తెలుసుకొని నన్ను అడిగింది ఆ నిజాన్ని క్రిష్ కి చెప్పమని నన్ను బ్రతిమలాడింది నేను నీకు ఇచ్చిన మాట కోసమే ఆగాను కానీ సత్యం మాత్రం ఏదో ఒక రోజు ఆ నిజాన్ని బయటపెడుతుందనేసి చక్రవర్తి అంటాడు. ఆ కాకి పిల్ల కోసం నేను భయపడాలా అది నా చేతిలో ఇంతే అనేసి అనగానే నువ్వు భయపడట్లేదు అన్నయ్య భయపడుతున్నావు. ఏదైనా చేసి చూడు ఆ తర్వాత నీకే తెలుస్తుంది అనేసి అంటాడు. నీకు మళ్ళీ మాట ఇస్తున్నాను నా నోటితో నేను క్రిష్ కి తండ్రిని చెప్పను అనేసి చక్రవర్తి అంటాడు.


ఇక అందరూ భోజనాలు చేసి సంతోషంగా ఉంటే క్రిష్ మాత్రం పార్టీ జరిగిన ప్లేస్ నుంచి రాడు. అందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి సత్యనే కారణం అని అంటాడు. ఈ ప్లేస్ నుంచి వస్తే ఈ మెమొరీస్ అన్ని మాయమైపోతాయని రావాలనిపించట్లేదు సంపంగి అనేసి అంటాడు. మనిషికి ఏ స్థలము శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు అని సత్యం అంటుంది. నీకు బాగా ఇష్టమైన ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే నువ్వు వదిలేస్తావా అని అడుగుతుంది. జీవితంలో వాళ్ళ మొహం నేను చూడనని క్రిష్ అంటాడు. నుంచి సత్య వెళ్ళిపోతుంది. క్రిష్ వచ్చి ఏమైంది సంపంగి అని అడుగుతాడు. నువ్వు అనుకుంటున్న వ్యక్తుల్లో నేను ఉంటే నన్ను వదిలేస్తావా అనేసి సత్య అడుగుతుంది. నా మీద అనుమానమా అని క్రిష్ అంటాడు.. ఇక సత్యకు క్రిష్ మాటిస్తాడు ఏదైనా జరిగినా కూడా నిన్ను నేను వదిలిపెట్టను అనేసి మాటిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big Stories

×