CM Revanth-CMChandrababu: ఏపీ- తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారా? ఈసారి భేటీ విదేశాల్లో జరగనుందా? ఇందుకు ముహూర్తం పెట్టేసుకున్నారా? రాజకీయాల గురించి ఇద్దరి మధ్య ప్రస్తావనకు వస్తుందా? ఆ విధంగా అడుగులు వేయబోతున్నారా? ఇవే ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థికవేత్తల వార్షిక సదస్సుకు ఇండియా నుంచి ముగ్గురు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. వారిలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతున్నారు. ఐదు రోజులపాటు దావోస్‌లో సదస్సు జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా 50 మంది దేశాధి నేతలు, 100 కంపెనీలకు పైగా సీఈవోలు హాజరుకానున్నారు. అక్కడికి వచ్చే పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులతో విడివిడిగా మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రులకు ఛాన్స్ లభించనుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, అలాగే భారతదేశంలోని అనుకూల పరిస్థితులను ప్రజెంట్ చేయనున్నారు ఆయా నేతలు.
మరోవైపు ఆరునెలల గ్యాప్‌లో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రులుగా పగ్గాలు చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై తొలిసారి ఇరువురు సీఎంలు హైదరాబాద్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఒక్కో అడుగు ముందుకు పడుతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: అల్లు అర్జున్ పై కామెంట్స్.. సీఎం రేవంత్ సీరియస్.. ఆ అధికారిపై చర్యలు
నార్మల్‌గా ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే సమావేశానికి వెళ్లినప్పుడు మాట్లాడుకోవడం సహజం. పరిపాలనతోపాటు రాజకీయాల గురించి సహజంగా మాట్లాడుకుంటారు. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగబోతోందనే నేతలు రకరకాలుగా చర్చించుకోవడం మొదలైంది. అభివృద్ధిలో ఏ రాష్ట్రం దూసుకెళ్తోంది అనేదానిపై కేంద్రం ఇచ్చే నివేదికల తర్వాత మాత్రమే తెలుస్తోంది.
గతంలో కేటీఆర్- జగన్ దావోస్ వెళ్లినప్పుడు ఇద్దరు సమావేశమయ్యారని గుర్తు చేస్తున్నారు మరికొందరు. ఎవరు ఇల్లు వారిది అయినప్పుడు ఇందులో కొత్తగా మాట్లాడుకోవడానికి ఏమందని అంటున్నవాళ్లు లేకపోలేదు. రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు కాబట్టి, ఇరువురు నేతలు భేటీ అనేది కామనేనని చెబుతున్నారు.
ఎవరు అడుగులు వేసినా, వారి వారి రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నవాళ్లూ లేకపోలేదు. ముఖ్యమంత్రులు దావోస్ టూర్‌కు ఇంకా నెలరోజులుండడంతో ఇంకెన్ని వార్తలు వెలుగులోకి వస్తాయో చూడాలి.