Satyabhama Today Episode December 28 th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాపు కోసం నేను ఆగాను అంతే కానీ ముసలోళ్ళకి ఏమి చేయలేకపోతున్నానని క్రిష్ బాధపడుతూ ఇంటికి వస్తాడు. క్రిష్ గాని సత్య నా క్రిష్ ఏదైనా సాధించుకోస్తాడనేసి గొప్పగా చెప్తుంది.. కానీ క్రిష్ మాత్రం నేనేమీ చేయలేకపోయాను సత్య అనేసి అంటాడు. నువ్వు అనుకుంటే సాధించంది ఏముంది క్రిష్ మీ బాబుకి ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు ఆ నరసింహతో ఎంత గొడవకి దిగావో నీకు తెలుసు కదా ఇప్పుడు అంతకుమించి నువ్వు చేయగలవు కానీ నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదు పదిమంది ముసలాలను కాపాడడం తప్పా క్రిష్ అనేసి క్రిష్ కి హితబోధ చేస్తుంది.. నీకు మీ బాపు అంటే భయం ఉంది అందుకే నువ్వు బాపుకి ఎదురు తిరిగితే ఏం చేస్తాడు అని భయంతోనే నువ్వు ఏం మాట్లాడకుండా వచ్చేసావు అది నిజం కదా క్రిష్ ఇప్పటికైనా ఒప్పుకో అనేసి రెచ్చగొడుతుంది.. నీ చేతకాదని నాకు అర్థం అయిపోయింది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఆ పెద్దావిడకు న్యాయం చేస్తానని క్రిష్ తో శపథం చేస్తుంది సత్య.. ఇంట్లో బాపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు నువ్వు మతుండి మాట్లాడుతున్నావా సత్య. మా బాపుకి పోటీగా ఎమ్మెల్యే అవుతున్నానంటున్నావు నీకు అర్థం అవుతుందా సోయలో ఉండి మాట్లాడుతున్నావా అని సత్యను నిలదీస్తాడు క్రిష్. మీ బాపు చేతిలో అధికారం ఉంది అతనికి చెప్తే పోలీస్ కేసు పెడతాడు కానీ మీ బాపు చెప్పలేకపోయాడు నాకు అధికారం ఉంటే నేనే ఆ పని చేస్తాను అని క్రిష్ కు షాక్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నాకు ఇష్టం లేదు సత్య అనేసి క్రిష్ అంటాడు కానీ సత్య మాత్రం వెనక్కి తగ్గేదేలేదు అని మొండిగా కూర్చుంటుంది నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఇక ఏమి మాట్లాడకుండా కిందకు వచ్చేస్తాడు. మహదేవయ్య లాయర్ తో ఎమ్మెల్యే ఫామ్ ను ఫిల్ అప్ చేయిస్తుంటాడు. అప్పుడే సత్య కిందకి వస్తుంది. సత్య నువ్వు సైన్ చెయ్ అమ్మ నీ చేయి చాలా మంచిది నీకు పట్టుచీర కొని పెడతానని అంటాడు. ఇక భైరవి చీర సరిపోదా ఇంకేమైన కావాలా అని అడుగుతుంది. దానికి క్రిష్ సత్య సైన్ చేయదు బాపు అనేసి అరుస్తాడు. ఏందిరా నువ్వు చెప్పేది ఏం మాట్లాడుతున్నావ్ రా అనేసి బైరవి అడుగుతుంది. నేను చెప్పేది నిజమే బాపుకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిలబడుతుందట అనేసి బైరవితో అరుస్తాడు క్రిష్.. ఇదంతా చూస్తూ మహదేవయ్య సంతోషపడతాడు. ఈ కుండలు బద్దలు కొట్టడమే నాకు కావాలి కోడలు గాని కోడలా అనేసి మహదేవయ్య మనసులో అనుకుంటాడు. ఇదంతా చూసి సంతోష్ పడుతున్నావా మావయ్య తెగించేసాను అనే సేమ్ సత్య కూడా మనసులో అనుకుంటుంది. ఒక అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను ఆ అన్యాయాన్ని ఎలాగైనా ఎదిరించాలని అనుకుంటాను కానీ నాకు అధికారం కావాలి అధికారం ఉంటేనే అన్యాయాన్ని ఎదిరించవచ్చని నాకు అర్థమైంది ఈ విషయంలో నా మనసు మార్చుకునేదే లేదు అనే శ్రీ సత్య వెళ్ళిపోతుంది. ఇక భైరవి మాత్రం చూసావా రా నీ పెళ్ళాం ఎలా మాట్లాడుతుందో కనీసం అత్త మామ అంటే భయం లేదు మొగుడి మాట కూడా వినలేదు ప్రేమించానని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టావు ఇప్పుడు చూడు ఎలా జరిగిందో అనేసి అంటుంది. సత్య ఇలా మొండిగా మాట్లాడుతుంది ఎవరు చెప్తే వింటుందో నాకు తెలుసు అనేసి క్రిష్ అంటాడు.
క్రిష్ సత్య పుట్టింటికి వెళతాడు. ఇంట్లో సంతోషంగా అందరూ ఆటలాడుకుంటూ సరదాగా ఉంటారు. కోపంగా అక్కడికి వస్తాడు. ఇక సంధ్య నా ప్లేస్ లో కూర్చుని ఆడు అని అంటుంది అలాగే నందిని కూడా అంటుంది కానీ క్రిష్ కోపంగారుస్తాడు.. ఏమైంది బాబు ఎందుకు వచ్చారు అని సత్య వాళ్ళ నాన్న అడుగుతాడు. మీ అమ్మాయి పద్ధతి బాగోలేదు మామయ్య మీ అమ్మాయి చేసే విషయాలు ఇంట్లో గొడవలు తెచ్చిపెడుతున్నాయి మీరు చెప్తే సత్య మాట వింటుంది. మా బాపుకి పోటీగా ఎమ్మెల్యే అవుతానని మొండికేసి కూర్చుంది. ఒకే జాగలు ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ చేస్తే అది కూడా ఒకే కుటుంబాన్ని నుంచి పోటీ చేస్తే మా పరువు పోతుంది అది ఆలోచించే నేను ఇంత దూరం వచ్చాను అని అనగానే నందిని వదినని తప్పు చేసిన నువ్వు అనుకుంటున్నావా? అందులో ఏదో ఒకటి కారణం ఉంటుందని సపోర్ట్ చేస్తుంది. మా ఇంటి పరువును తీయాలనుకొని మీ అమ్మాయి అనుకుంటుంది నేను ఎంత చెప్పినా మీ అమ్మాయి వినట్లేదు ఇంట్లో గొడవలు పెట్టాలని అనుకుంటుంది మీరైనా ఒకసారి చెప్పండి అనేసి వెళ్ళిపోతాడు.
ఇక విశ్వనాథం క్రిష్ ఇంటికి వెళ్ళగానే భైరవి కోపంగా ఉన్నట్లు మాట్లాడుతుంది గొంతు పిసికితే చర్చి ఊరుకుంటుంది కానీ ఇలా తెగించి మాట్లాడుతుందా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడుతూ ఉంటుంది.. విశ్వనాథం రావడం చూసి ఒంటి కాలు మీద లేస్తుంది నీ కూతురు పెంపకం ఇదేనా నువ్వు నేర్పిన చదువు మర్యాదలు ఇవేనా అత్తమామలు అంటే మర్యాదలు ఉండవు కనీసం మొగుడు అన్న కూడా మర్యాద లేకుండా పెంచారని నానా మాటలు అంటుంది. ఇక జయమ్మ అక్కడికి వచ్చి నీ కూతురు నిర్ణయం ఇంట్లో గొడవలు తెచ్చిపెడుతుంది అది కొంచెం ఆలోచించుకోమని చెప్పండి సత్య తప్పు చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఇది గొడవలకి దారితీస్తుందని మీరు నచ్చ చెప్పండి అని పంపిస్తుంది. ఇక సత్య దగ్గరికి విశ్వనాథం వెళ్లి ఏమైంది అంతగా బాధపడుతున్న వెంటమ్మ నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు కానీ నాకు చెప్పుకోలేని బాధలు ఉన్నా చెప్పు అనేసి విశ్వనాథం అడుగుతాడు.. సత్య బాధపడుతూ తన బాధని చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..