BigTV English

Aamir Khan: అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ రావడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది.. అమీర్ ఖాన్ ఓపెన్ కామెంట్స్

Aamir Khan: అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ రావడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది.. అమీర్ ఖాన్ ఓపెన్ కామెంట్స్

Aamir Khan: ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఒక్క తెలుగు హీరోకు కూడా నేషనల్ అవార్డ్ రాలేదు. ఆ ఘనత దక్కించుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. ‘పుష్ప’లో అల్లు అర్జున్ చేసిన పుష్పరాజ్ అనే పాత్రకు తనకు నేషనల్ అవార్డ్ దక్కింది. కానీ కొందరు తెలుగు ప్రేక్షకులు మాత్రం అసలు అల్లు అర్జున్ (Allu Arjun) అవార్డుకు అర్హుడే కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ కామెంట్స్ చేశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్‌పై కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచాడు.


అవార్డ్ ఫంక్షన్స్ వద్దు

మామూలుగా సౌత్ ఇండస్ట్రీల కంటే బాలీవుడ్ వారే అవార్డ్ ఫంక్షన్స్‌ను చాలా గ్రాండ్‌గా చేస్తుంటారు. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ అవార్డ్ ఫంక్షన్స్‌లో పాల్గొనడానికి ఇష్టపడుతుంటారు. కానీ సీనియర్ హీరో అమీర్ ఖాన్ మాత్రం చాలా డిఫరెంట్. తను దాదాపు 20 ఏళ్ల నుండి ఒక్క అవార్డ్ ఫంక్షన్‌కు కూడా రాలేదు. తనకు అలాంటివి నచ్చవని ఎప్పుడో ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు అమీర్. ఇక తాజాగా మరోసారి తను అవార్డ్ ఫంక్షన్స్‌కు వెళ్లడానికి ఎందుకు ఇష్టపడడు అనే విషయాన్ని బయటపెట్టాడు. సినిమాల కలెక్షన్స్‌ను బట్టి అవార్డులు వస్తాయని, అది తనకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గురించి కూడా మాట్లాడాడు.


Also Read: ప్లీజ్.. నన్ను అల్లు అర్జున్‌తో పోల్చకండి.. బిగ్ బి ఇంత మాట అనేశాడేంటి.?

అతడికి అవార్డ్ రావాల్సింది

‘పుష్ప’ వల్ల అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ రావడం తనకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందని చెప్పాడు. దాని బదులు ‘సర్దార్ ఉద్దమ్’ సినిమాలో విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్‌కు అవార్డ్ రావాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆర్ట్ అనేదాన్ని లెక్కలతో పోల్చడం కరెక్ట్ కాదన్నాడు. ముఖ్యంగా ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని అవార్డులను యాక్టర్లను చూసి ఇస్తారని, వారి ఆర్ట్‌ను చూసి ఇవ్వరని అన్నాడు. దీంతో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోతుండగా చాలామంది అమీర్ వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తున్నారు.

రెండుసార్లు అన్యాయం

అమీర్ ఖాన్ (Aamir Khan) అవార్డ్ ఫంక్షన్స్‌ను బాయ్‌కాట్ చేయడం కొత్త కాదని దాదాపు బాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. మొదట్లో తను అవార్డ్ ఫంక్షన్స్‌కు వచ్చేవాడు. కానీ 1993లో తను నటించిన ‘హమ్ హై రహి ప్యార్ కే’ సినిమాకు కాకుండా షారుఖ్ నటించిన ‘బాజీగర్’కు అవార్డ్ దక్కింది. ఆ తర్వాత 1995లో కూడా అమీర్ నటించిన ‘రంగీలా’ను పక్కన పెట్టి ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’కు అవార్డ్ ఇచ్చారు. కలెక్షన్స్ పరంగా షారుఖ్ నటించిన సినిమాలే ఎక్కువగా సక్సెస్ అందుకున్నాయి. అందుకే అవార్డులు తనకు వెళ్లాయని అమీర్ ఫీలయ్యాడు. అప్పటినుండి తన ఆర్ట్‌కు విలువ లేదని ఫీలయ్యి అవార్డ్ ఫంక్షన్స్‌కు వెళ్లడం మానేశాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×