Satyabhama Today Episode December 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇక సత్య దగ్గరికి విశ్వనాథం వెళ్లి ఏమైంది అంతగా బాధపడుతున్నవెంటమ్మ అని అడుగుతాడు. నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు కానీ నాకు చెప్పుకోలేని బాధలు ఉన్నా చెప్పు అనేసి విశ్వనాథం అడుగుతాడు.. సత్య బాధపడుతూ తన బాధని చెప్తుంది. తండ్రిని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటుంది సత్య. నేను చేస్తుంది తప్పో ఒప్పో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా నాన్న అంటే.. నిన్ను ఎలా రక్షించుకోవాలో అర్థంకాక టెన్షన్ పడుతున్నా అంటాడు.. నాకు పవర్ కావాలి నాన్నా నా జీవితాన్ని కొందరు తొక్కిపెట్టేస్తున్నారు అంటుంది. కానీ సత్య నిర్ణయం వెనక్కు తీసుకోదు.. ఇక అదే మాట భైరవికి చెప్తాడు. ఇక జయమ్మ కూడా సత్య దగ్గరకు వస్తుంది. నువ్వు చెప్పేది చేసేది తప్పు కాదు.. భైరవి భోజనం వడ్డీంచొద్దు అని వాదిస్తుంది. సత్య చేస్తున్న పనికి నానా రచ్చ చేస్తుంది.. ఇక క్రిష్ పై కూడా భైరవి అరుస్తుంది. మహాదేవయ్యతో భైరవి ఒంటి కాలుతో లేస్తుంది. చిన్నాను చూసి మాట మారుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. ఇక క్రిష్ మాట్లాడడానికి సత్య ప్రయత్నిస్తుంది. క్రిష్ మాత్రం మౌనంగా ఉంటాడు. ఇక బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే సత్య బెడ్ ని సరి చేస్తూ ఉంటుంది. క్రిష్ రాగానే సత్య సాంబార్ చాలా బాగా కుదిరింది కానీ నువ్వు మిస్ అవుతున్నావ్ అది గమనించి క్రిష్ అనేసి అంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఇష్టం కదా ఇంకాస్త ఉల్లిపాయలు ఎక్కువ వేసి మరీ చేశాను ఈరోజు చాలా బాగుంది నువ్వు మిస్ అయితే ఇక నీ ఇష్టం అని చురకలాంటిస్తుంది. మీకోసం సాంబార్ అన్నం కలిపి తీసుకొచ్చాను అనేసి అనగానే క్రిష్ నాతో మాట్లాడొద్దు అని అంటాడు. అడ్డుగా ఉన్నానంటే చెప్పు నేను పక్కకెళ్ళిపోతాను నువ్వు శుభ్రంగా తినేసి ఉండొచ్చు అనేసి అంటుంది.. ఇక క్రిస్ తో గొడవకు దిగుతుంది సత్య.. కానీ క్రిష్ మాత్రం సత్యకు లొంగడు. సత్య మాత్రం క్రిష్ ని ఎక్కడ తగ్గకుండా మాటలతో కట్టిపడేస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత అని ముగ్గులోకి దించేస్తుంది మొత్తానికి కృషి మెల్ట్ అయ్యి సత్య దారిలోకి వచ్చేస్తాడు. ఇద్దరి మధ్య కాసేపు గొడవలు తగ్గిపోతాయి. ఏదైనా గొడవలు ఉంటే గది బయట చూసుకుందాం గదిలోపల మాత్రం మొగుడు పిల్లలుగా ఉందామని అంటుంది.
ఇక హర్ష నందిని బయటికి వెళ్తారు. టైరు పంచర్ అయితే హర్ష నేను చేయించుకుని వస్తానని చెప్తాడు.. విశ్వనాథం ఇంటిని కబ్జా చేసిన వ్యక్తి కనిపిస్తే అతనితో మాట్లాడాలని నందిని అక్కడికి వెళ్తుంది. అతనితో రివర్స్లో అడిగానని అనుకుంటుంది. దాంతో మహదేవయ్య ప్లాన్ గురించి మొత్తం నిజం చెప్తాడు ఆరోజు దొంగ డాక్యుమెంట్స్ చేయించామని వాటిని తీసుకొని వాళ్ల దగ్గరికి వెళ్లి అవి నిజమే నేను నమ్మేలా చేయాలని అడుగుతాడు. ఆ తర్వాత ఆయన డబ్బులు ఇచ్చి ఆ ఇంటిని కొన్నట్టు నాటకం ఆడాలని చెప్పాడు మొత్తం అనుకున్నది అనుకున్నట్లయితే చేస్తాడు అసలు అంత బాగా రావడానికి కారణం మహదేవయ్య నటన సినిమాల్లోకి వెళ్తే బెస్ట్ విలన్ గా బాగా రానిస్తాడు అనేసి పొగడ్తలు కురిపిస్తాడు అది విన్న నందిని షాక్ అవుతుంది.
సత్య మీడియాను పిలిపిస్తుంది కానీ భైరవి మహదేవయ్య మీడియా ఎందుకు వస్తున్నారని ఆలోచిస్తూ ఉంటారు. సత్య పిలిపించిందని మీడియా వాళ్ళు చెప్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నట్లు మీడియాతో ప్రకటిస్తుంది. మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారని మీడియా వాళ్ళు అడిగితే నాకు అధికారం కావాలి అధికారం ఉంటేనే నేను పదిమందికి న్యాయం చేయగలను అని అనుకుంటున్నాను అందుకే మీడియా వరకు ఎమ్మెల్యేగా అవ్వాలని ప్రకటిస్తున్నాను అనేసి అంటుంది. ఇక మహదేవయ్యను అడిగితే మా ఇంటి నుంచి మరొకరు పోటీకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి మహదేవయ్య అంటాడు. నందిని వాళ్ళింట్లో సత్య అసలు వింటుందా లేదా అని విశాలాక్షి మాట్లాడుతుంది అప్పుడే టీవీ పెడుతుంది నందిని. ఇందులో మహదేవ సత్య పోటీ పడబోతున్నట్లు మీడియాలో రావడంతో అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఏం జరుగుతుందో చూడాలి..