BigTV English
Advertisement

Leopard Choked : చిరుతపులి గొంతు నులిమేశాడు.. వైరల్ వీడియో చూసి మండిపడుతున్న నెటిజెన్లు

Leopard Choked : చిరుతపులి గొంతు నులిమేశాడు.. వైరల్ వీడియో చూసి మండిపడుతున్న నెటిజెన్లు

Leopard Choked | ఒక ఊరిలో చిరుతపులి ప్రవేశించి అమాయక గ్రామాస్తులపై దాడులు చేసింది. పాడిపశువులను చంపుతినడం ప్రారంభించింది. చిరుతపులి భయంతో గ్రామస్తులంతా అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామంలోని యువకులు ధైర్యంతో రక్తం రుచి మరిగిన చిరుతపులి కోసం వెతికడం ప్రారంభించారు. చివరికి గ్రామస్తులు ఆ చిరుతని పట్టుకొని.. వారిలో ఒక యువకుడు ఆ చిరుతని తన చేతులతో గొంతునులిమేశాడు. ఈ ఘటన సమయంలో అక్కడ చుట్టూ ఉన్నవారిలో ఒకరు మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహరాజ్ గంజ్ పట్టణం సమీపంలోని ఒక గ్రామంలో పక్కనే అడవి నుంచి రెండు వారాల క్రితం ఒక చిరుతపులి వచ్చి రాత్రి వేళ ఒంటరిగా ఉన్న మనుషులపై దాడులు చేసింది. మరి కొన్ని చోట్ల గొర్రెలు, మేకలపై దాడులు చేసింది. గ్రామంలో చిరుతుపులి దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. పాడి రైతుల గొర్రెలు, మేకలు చిరుతపులికి ఆహారమయ్యాయి. దీంతో గ్రామంలో ఒంటరిగా వెళ్లాలంటే జనం భయపడే పరిస్థితి.

ఈ ఘటనలతో గ్రామ పెద్దలు అటవీ శాఖ అధికారుల వద్దకు వెళ్లి.. ఆ కృూర మృగాన్ని అదుపు చేయమని విన్నపం చేశారు. కానీ అధికారులు పట్టించుకోలదే. దీంతో గ్రామస్తులు నిత్యం భయంతో జీవించలేక.. ఇక తామే అడవికి వెళ్లి చిరుతను పట్టుకోవాలన్ని నిర్ణయించకున్నారు.


Also Read: టీనేజర్‌పై గ్యాంగ్ రేప్.. సవతి తల్లే డబ్బులు తీసుకొని..

అలా అడవిలో నాలుగు రోజులుగా వెతికిన తరువాత ఒక చోట చిరుతపులి నిద్రిస్తున్నట్లు గుర్తించారు. ఆ చిరుతపులిని దాదాపు 20 మంది చాలా కష్టపడి పట్టుకున్నారు. ఆ తరువాత తమ బంధవులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఆ మృగాన్ని ఇద్దరు యువకులు తమ హస్తాలతో పట్టుకున్నారు. వారిలో ఒక యువకుడు చిరుతపులి తన చేత్తుల్లో చిరుతపులి మెడని గట్టిగా పట్టుకొని నులిమేస్తుండగా.. అక్కడే నిలబడి ఉన్న యువకుడు ఇదంతా వీడియో తీశాడు.

వీడియలో కనిపిస్తున్న దృశ్యాలలో ఒకడు చిరుతపులి వెనుకవైపు నుంచి కాళ్లు పట్టుకోగా.. ఆ జంతువు నిస్సహాయంగా తన ముందు కాళ్లు ఆడిస్తూ కనిపించింది. దాని ఊపిరి ఇక కొంచమే ఉన్నట్లు అనిపిస్తోంది. చుట్టూ ఉన్న గ్రామస్తులు ఆ పులిని చంపేయాలని గట్టిగా అరుస్తున్నట్లు వినిపిస్తోంది.

ఈ ఘటన గురించి ఫారెస్ట్ ఆఫీసర్లు తెలుసుకొని వెంటనే అక్కడికి చేరుకున్నట్లు తెలిసింది. కానీ చిరుతపులి బతికి ఉందా? లేదా మరిణించిందా? అనేది స్పష్టం కాలేదు.

ఈ వైరల్ వీడియోపై నెటిజెన్లు మండిపడుతున్నారు. కృూర జంతువైనా అది ఆహారం కోసం మాత్రమే గ్రామంలో దాడులు చేసిందని.. కానీ గ్రామస్తులందరూ అంత మంది కలిసి దాన్ని చంపేసేందకు ప్రయత్నించడం అమానుషమైన ఒక యూజర్ కామెంట్ చేశాడు.

మరొక యూజర్ అయితే.. ఆ చిరుతపులి ఇల్లు అడవి. కానీ మనుషులు అడువులను ఆక్రమించుకుంటున్నారు. అందుకే జంతువులు తమ నివాసం కోల్పోయి మనుషుల నివాసాల ప్రవేశిస్తున్నాయని.. అలా వచ్చిన జంతువులు ఆహారం కోసం దాడులు చేస్తున్నాయని తన అభిప్రాయం రాశాడు. కానీ ఇదంతా మనుషులు చేస్తున్న తప్పుల వల్లేనని నిలదీశాడు.

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×