BigTV English

Kill Pig Eat: రంగస్థల నాటకం.. పందిని స్టేజిపై నిజంగా చంపి తిన్న కళాకారుడు.. ప్రేక్షకులు షాక్

Kill Pig Eat: రంగస్థల నాటకం.. పందిని స్టేజిపై నిజంగా చంపి తిన్న కళాకారుడు.. ప్రేక్షకులు షాక్

Kill Pig Eat| నిజమైన కళాకారులు ప్రేక్షకుల మెప్పు పొందడానికి వారి నుంచి ప్రశంసలు అందుకోవడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అలాంటిది ఒక కళాకారుడు నాటకంలో లీనమైపోయి రాక్షసుడి పాత్రలో సహజత్వం కోసం నిజంగానే ఒక పందిని తెచ్చి.. దాన్ని అందరి ముందు వధించి.. దాని మాంసం భుజించాడు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకుల రోమాలు నిక్కుపొడుచుకన్నాయి. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఒడిళాలోని గంజం జిల్లా రాలాబ్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం కంజియనాల్ యాత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో రామాయణం నాటకం ప్రదర్శించారు. ఈ నాటకంలో బింబాధర్ గౌడా అనే 45 ఏళ్ల కళాకారుడు రాక్షసుడి పాత్ర పోషించాడు. అయితే నాటక నిర్వహకులు అడవి లాంటి భావన కలిగించడానికి కొన్ని నిజమైన జంతువులను తీసుకొని వచ్చారు.

Also Read: బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..


ముఖ్యంగా రామాయణంంలో శ్రీ రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు అడవిలో పాములున్నట్లు చూపించారు. ఆ సందర్భం రాగానే స్టేజి పైకి పాములను, ఉడతలను తీసుకొచ్చారు. ఆ తరువాత రాక్షసుడి పాత్ర పోషించిన బింభాదర్ నాటకంలో సందర్భాను సారంగా వచ్చాడు. నాటకంలో ఒడియా, సంస్కృత పద్యాలు వల్లించాడు. కానీ రాక్షసుడి పాత్రం కావడంతో క‌ృూరత్వం చూపించడానికి అడవిలో తిరుగుతున్న ఒక పందిని పట్టుకొని చంపితినే సీన్ ఉంది. ఆ సీన్ నిజంగా స్టేజిపై చేశాడు.

నాటక నిర్వహకులు స్టేటిపైకి ఒక చిన్న పందిని వదిలారు. బింబాధర్ రాక్షసుడి పాత్రలో లీనమై ఆ సీన్ లో నిజంగానే ఆ పందిని చంపేశాడు. అది చూసి ప్రేక్షకులంతా షాకయ్యారు. అయినా బింబాధర్ అంతటితో ఆగలేదు. ఆ పంది శరీరాన్ని చీల్చి దాని మాంసాన్ని నోటితో రాక్షసుడిలా పీక్కొని తిన్నాడు.

నిర్వహకులు ఈ నాటకం గురించి ప్రచారం గురించి ఈ సీన్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చూసిన తరువాత స్థానిక బిజేపీ నాయకులు బాబు సింగ్, సనాతన్ బిజౌలి ప్రాంత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారికి సమాచారమందించారు. ప్రస్తుతం పోలీసులు బిబాధర్ గౌడను జంతువుల పట్ల క‌ృూరత్వం చూపినందుకు నిబంధనలకు ఉల్లంఘించినందుకు అరెస్టు చేశారు.

దీంతో పాటు స్టేజిపై పాములు తీసుకొచ్చినందుకు నాటక నిర్వహకులపై కూడా అటవి జంతువు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్టేజి నాటకం నిర్వహకులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

దారుణం.. పెంచుకున్న కుక్కను ఉరితీసి చంపాడు.
మహారాష్ట్రలో కూడా జంతుహింస కేసునమోదు అయింది. పుణెలోని పిరంగుట్ పట్టణానికి చెందిన ఓంకార్ జగ్తాప్ అనే యువకుడి వద్ద గత అయిదు సంవత్సరాలుగా ఒక కుక్క ఉంది. అయితే ఆ కుక్కను ఇటీవల చితకబాదాడు. ఆ తరువాత తన ఇంట్లో ఉన్న ఫ్యానుకు తాడు కట్టి కుక్కను ఉరితీశాడు. పోలీసులు అతడిపై జంతుహంస కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×