Satyabhama Today Episode February 10th: నిన్నటి ఎపిసోడ్లో.. జయమ్మ పంచాంగం వల్ల సంజయ్ సంధ్యల శోభనం ఆగిపోతుంది. ఇక సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శోభనం అయితే క్యాన్సిల్ అయింది అని ఎలాగైనా చక్రవర్తి మావయ్యను రప్పించి ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్లిద్దరిని విడగొట్టేలా చేయాలని అనుకుంటుంది సత్య. తర్వాత రోజు ఉదయం సంధ్యా సంజయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ హ్యాపీగా పూల పంపు అసలు మనం ఇలా సోఫాలో కూర్చుని ఒకరి మొహాలకు చూసుకుంటున్నామని బాధపడుతూ ఉంటారు. అది చూసిన సత్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ దుర్మార్గం నుంచి నా చెల్లెల్ని కాపాడుకున్నాను. ఇక ఏం చేయాలనేది ఆలోచించాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సత్య దగ్గరికి మహదేవయ్య వచ్చి వాళ్ళిద్దర్నీ హనుమన్ పంపిస్తున్నాను నీకు ఇంకా రెండు రోజులు ఏముంది ఆ రెండు రోజులు నువ్వు వెనక్కి తగ్గుతావా లేదా మీ చెల్లెలు ప్రాణం గాల్లో కలిపేయమంటావా అనేసి వార్నింగ్ ఇస్తాడు.. సంధ్యకు ఏమైనా అవుతుందని సత్య టెన్షన్ పడిపోతుంది. తన చెల్లెలిని కాపాడుకోవాలి సత్య శత విధాల ప్రయత్నిస్తుంది.. ఏం చేయాలో అర్థం కాక సత్య చక్రవర్తికి ఫోన్ చేస్తుంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకున్నారా? మామయ్య మీరు ఇప్పటివరకు ఎలా ఉన్నారు ఏంటి అని కూడా మీరు అడగట్లేదు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అక్కడక్కడ ఉన్నారు కదా మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అని సత్య సీరియస్ అవుతుంది. ఏమైందమ్మా సత్య ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఏం జరిగిందో చెప్పు అని చక్రవర్తి అంటాడు. కనీసం సత్య మాత్రం పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలియదా మామయ్య లేకపోతే తెలిసి కూడా మీరు కూడా దాచాలని ప్రయత్నిస్తున్నారని కడిగి పడేస్తుంది. నా మీద కోపంతోనే సంజయ్ ఇలా చేస్తున్నాడు నా చెల్లెలుకు ఏమన్నా అవుతుందని నాకు భయంగా ఉంది మావయ్య మీరే ఏదో ఒకటి చేయాలి అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యకు చక్రవర్తి సంజయ్ ఫారెన్ లో ఉన్న రూప అనే అమ్మాయిని ప్రేమించాడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అని నాతో అన్నాడు.. ఇప్పుడు మీ చెల్లెలు ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అంటాడు. నేను చెప్తే ఎవరూ నమ్మరు మీరే వచ్చి స్వయంగా చెప్పండి మావయ్య అంటే నేను రేపు వచ్చి ఈ విషయాన్ని అందరితోనూ చెప్తానని చక్రవర్తి అంటాడు. ఇక సత్యని కాదని ఇంట్లో సంధ్య పూజ చేస్తుంది. భైరవి, బామ్మ సంతోషపడతారు. సంధ్య బామ్మకి అత్తకి హారతి ఇస్తుంది. సత్య కళ్లకి హారతి పెట్టి కొన్ని కొన్ని మనసుకి నచ్చనివి జరిగితే డైజస్ట్ చేసుకోవడం కష్టం.. తప్పదు నీ అధికారం లాక్కుంటాను అని నీ భయం కదా.. నీ భయాన్ని నిజం చేస్తా… అందరినీ నా వైపు తిప్పుకుంటా.. నిన్ను ఈ ఇంటి కోడలు అనే విషయం కూడా మర్చిపోయేలా చేస్తా ఏం అనుకోకు అక్క ఇదే జరుగుతుంది అని వార్నింగ్ ఇస్తుంది.
ఆతర్వాత మహదేవయ్య మళ్ళీ పంచాంగం చూపించి వాళ్ళిద్దరూ శోభనానికి ముహూర్తం పెట్టిస్తాడు. ఇంకెవరికైనా అభ్యంతరం ఉందా అని అడుగుతాడు. అప్పుడే చక్రవర్తి అక్కడికి వచ్చి నాకు అభ్యంతరం ఉంది అన్నయ్య కనీసం కన్నతండ్రిని బతికే ఉన్నానన్న విషయం కూడా నా కొడుక్కి గుర్తుకులేదు పెళ్లి చేసుకున్నాడు ఆ విషయాన్ని కూడా నాకు చెప్పలేదు అనేసి అడుగుతాడు. నువ్వు ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అమెరికాలో రూపాని అమ్మాయిని ప్రేమించావు కదా త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా ఇప్పుడేంటి ఇలా చేసావని నిలదీస్తాడు చక్రవర్తి. రూప గురించి చెప్పగానే సంజయ్ మొహంలో బల్బులు వెలుగుతాయి టెన్షన్ పడతాడు..
ఇక సత్యా నేను ఎంత చెప్పినా అతను మంచివాడు అనేసి అందరూ అన్నారు కదా ఇప్పుడు తన కన్న తండ్రి నిజం చెప్పాలని అనుకుంటున్నాడు. అది ఏమంటారు మీరే చెప్పండి అని అందరిని అడుగుతుంది సంధ్యను ఇప్పటికైనా నువ్వు మేల్కో అతను అతని మీద స్వరూపం ఎలాంటిదో తెలుసుకొని అంటుంది కానీ సంధ్య మాత్రం సంజయ్ మీద గుడ్డి ప్రేమతో అస్సలు నమ్మదు. నేను ఏదైనా చూస్తే నమ్మను అంటుంది. ఇక రూపం నెంబర్ తీసుకొని ఆ రూపాకు ఫోన్ చేసి మాట్లాడు అనేసి సంజయ్ దగ్గర ఫోన్ తీసుకోమని సంధ్య కు సత్య చెప్తుంది.. సంజయ్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అవసరం లేదమ్మా ఆ రూప్ అనే కాసేపట్లో వస్తుంది సంజయ్ ఫోన్ చేసుకున్న విషయాన్ని రూప్ అనే నాకు చెప్పింది అనేసి చెప్పగానే సంజయ్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు.. ఇక క్రిష్ సంజయ్ ని బయటికి తీసుకెళ్లి నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు మీరిద్దరూ హ్యాపీగా ఉంటారని నేను అందర్ని ఎదిరించి మీకు పెళ్లి చేశాను కానీ నాకు ఎక్కడో అనుమానంగానే ఉంది నువ్వు ఇలా చేస్తావని ఇప్పుడు చేసింది ఏంటి ఆ విషయం కనుక ఆ అమ్మాయి వచ్చి చెప్పిందంటే నీకు మర్యాదగా ఉండదు అనేసి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత సత్య సంధ్యపై అరుస్తుంది.. నీ పెళ్ళెప్పుడు ముందు జాగ్రత్త కోసం అమ్మ నాన్నల మీద పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నావు కదా ఇప్పుడు ఇది తెలిస్తే నువ్వేం చేస్తావో చెప్పు అనేసి సంధ్యను అంటుంది.. అక్కడికో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో రూప వచ్చి సంధ్యను పక్కకు నెట్టేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..