Satyabhama Today Episode February 11th: నిన్నటి ఎపిసోడ్లో.. సత్యకు చక్రవర్తి సంజయ్ ఫారెన్ లో ఉన్న రూప అనే అమ్మాయిని ప్రేమించాడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అని నాతో అన్నాడు.. ఇప్పుడు మీ చెల్లెలు ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అంటాడు. నేను చెప్తే ఎవరూ నమ్మరు మీరే వచ్చి స్వయంగా చెప్పండి మావయ్య అంటే నేను రేపు వచ్చి ఈ విషయాన్ని అందరితోనూ చెప్తానని చక్రవర్తి అంటాడు. ఇక సత్యని కాదని ఇంట్లో సంధ్య పూజ చేస్తుంది. భైరవి, బామ్మ సంతోషపడతారు. సంధ్య బామ్మకి అత్తకి హారతి ఇస్తుంది. సత్య కళ్లకి హారతి పెట్టి కొన్ని కొన్ని మనసుకి నచ్చనివి జరిగితే డైజస్ట్ చేసుకోవడం కష్టం.. తప్పదు నీ అధికారం లాక్కుంటాను అని నీ భయం కదా.. నీ భయాన్ని నిజం చేస్తా… అందరినీ నా వైపు తిప్పుకుంటా.. నిన్ను ఈ ఇంటి కోడలు అనే విషయం కూడా మర్చిపోయేలా చేస్తా ఏం అనుకోకు అక్క ఇదే జరుగుతుంది అని వార్నింగ్ ఇస్తుంది. మహదేవయ్య మళ్ళీ పంచాంగం చూపించి వాళ్ళిద్దరూ శోభనానికి ముహూర్తం పెట్టిస్తాడు. ఇంకెవరికైనా అభ్యంతరం ఉందా అని అడుగుతాడు. అప్పుడే చక్రవర్తి అక్కడికి వచ్చి నాకు అభ్యంతరం ఉంది అన్నయ్య కనీసం కన్నతండ్రిని బతికే ఉన్నానన్న విషయం కూడా నా కొడుక్కి గుర్తుకులేదు పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాన్ని కూడా నాకు చెప్పలేదు అనేసి అడుగుతాడు. నువ్వు ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అమెరికాలో రూపాని అమ్మాయిని ప్రేమించావు కదా త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా ఇప్పుడేంటి ఇలా చేసావని నిలదీస్తాడు చక్రవర్తి. రూప గురించి చెప్పగానే సంజయ్ మొహంలో బల్బులు వెలుగుతాయి టెన్షన్ పడతాడు.. సత్యా నేను ఎంత చెప్పినా అతను మంచివాడు అనేసి అందరూ అన్నారు కదా ఇప్పుడు తన కన్న తండ్రి నిజం చెప్పాలని అనుకుంటున్నాడు. అది ఏమంటారు మీరే చెప్పండి అని అందరిని అడుగుతుంది సంధ్యను ఇప్పటికైనా నువ్వు మేల్కో అతను అతని మీద స్వరూపం ఎలాంటిదో తెలుసుకొని అంటుంది కానీ సంధ్య మాత్రం సంజయ్ మీద గుడ్డి ప్రేమతో అస్సలు నమ్మదు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చక్రవర్తి వచ్చి నిజం చెప్పినా కూడా సంధ్య మాత్రం వినదు.. రూప నెంబర్ తీసుకొని ఆ రూపకు ఫోన్ చేసి మాట్లాడు అనేసి సంజయ్ దగ్గర ఫోన్ తీసుకోమని సంధ్య కు సత్య చెప్తుంది.. సంజయ్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అవసరం లేదమ్మా ఆ రూప్ అనే కాసేపట్లో వస్తుంది సంజయ్ ఫోన్ చేసుకున్న విషయాన్ని రూపనే నాకు చెప్పింది అనేసి చెప్పగానే సంజయ్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు.. ఇక క్రిష్ సంజయ్ ని బయటికి తీసుకెళ్లి నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు మీరిద్దరూ హ్యాపీగా ఉంటారని నేను అందర్ని ఎదిరించి మీకు పెళ్లి చేశాను కానీ నాకు ఎక్కడో అనుమానంగానే ఉంది నువ్వు ఇలా చేస్తావని ఇప్పుడు చేసింది ఏంటి ఆ విషయం కనుక ఆ అమ్మాయి వచ్చి చెప్పిందంటే నీకు మర్యాదగా ఉండదు అనేసి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత సత్య సంధ్యపై అరుస్తుంది.. నీ పెళ్ళెప్పుడు ముందు జాగ్రత్త కోసం అమ్మ నాన్నల మీద పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నావు కదా ఇప్పుడు ఇది తెలిస్తే నువ్వేం చేస్తావో చెప్పు అనేసి సంధ్యను అంటుంది..
ఇక సత్యా టెన్షన్ పడుతూ ఉంటే చక్రవర్తి అక్కడికి వచ్చి నువ్వేం టెన్షన్ పడకమ్మా మొత్తం మనం అనుకున్నట్టే జరుగుతుంది రూపా వచ్చి అనుకున్నది చేస్తుంది అని అనగానే ఏమో మావయ్య అనుకున్నవన్నీ రివర్స్ అవుతున్నాయి ఇప్పుడు కూడా ఇది రివర్స్ అవుతుందేమో అని నాకు భయంగా ఉంది అనేసి సత్య టెన్షన్. కానీ అప్పుడే రూప ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. సంజయ్ ని దుమ్ము దులిపేస్తుంది అలాగే సంధ్యకు పెద్ద షాక్ ఇస్తుంది ఈ తాళి నా మెడలో పడాల్సింది నీ మెలో పడింది అనేసి అనగానే సత్య రెచ్చిపోయి మాట్లాడుతుంది. వాడు మోసగాడు అని చెప్పినా నువ్వు వినలేదు నాకు సంజయ్ కావాలి అని అమ్మానాన్నలను వదిలేసి ఇంత దూరం తెచ్చుకున్నావ్ ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో అతని అంత దుర్మార్గుడు అనేసి సత్య సంధ్య కు హిత బోధ చేస్తుంది.
కానీ సంధ్య మాత్రం అస్సలు వినదు అక్క నువ్వు ఏదేదో అనుకుంటున్నావు నువ్వు అనుకున్నట్లు జరగదు. నాకు మీద నీకెందుకు అంత పగ నా జీవితాన్ని నువ్వు ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావ్ అనేసి సంధ్య నిలదీస్తుంది. ఈ రూప గురించి నాకు ముందే సంజయ్ చెప్పాడు ఈమె క్యారెక్టర్ కూడా నాకు తెలుసు డబ్బుల కోసమే కేవలం సంజీవిని పెళ్లి చేసుకోవాలనుకునిందని సంజయ్ నాకు చెప్పాడు అందుకే రూపకు దూరంగా ఉన్నాడు మేమిద్దరం దగ్గర నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు అనేసి సత్యకు వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు ఒక వీడియోను చూపించి అందరికీ షాక్ ఇస్తుంది. ఇక ఎవరేమనుకున్నా సంజయ్ ఎలాంటివాడినా నా జీవితమిక సంజయ్ తోనే అనేసి అందరికీ వార్నింగ్ ఇస్తుంది సంధ్య.. ఇక చక్రవర్తి ఆశీర్వాదం తీసుకుంటారు ఆ తర్వాత రాత్రి సత్య ఏడుస్తూ ఉంటే మహదేవయ్య సత్య దగ్గరికి వెళ్లి ఇంట్లో ఏడిస్తే అందరికి తెలిసిపోతుందని ఇక్కడ కూర్చొని గమ్మున ఏడుస్తున్నవా కోడలా అని ఎద్దేవా చేస్తాడు. నీ హ్యాండ్ రైజ్లో ఉన్నప్పుడు నన్ను ఎన్ని మాటలు అన్నావు గుర్తుందా మావయ్య గాని మావయ్య అంటూ నా చుట్టూ చక్కర్లు తిరుగుతూ మరి నామీద లేనిపోని పంచులు వేసావు.. నీకు ఇచ్చిన గడువులో ఒక్కరోజు మాత్రమే ఉంది నువ్వు ఎలక్షన్ నుంచి తప్పుకోకుండా అంటే నీ చెల్లి సంజయ్ హనీమూన్ కి వెళ్తారు కానీ తెలుగు వచ్చేది మాత్రం సంజయ్ ఒక్కడే అనేసి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మహదేవ సత్య హనీమూన్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..