Satyabhama Today Episode February 19th: నిన్నటి ఎపిసోడ్లో.. భైరవి మహదేవయ్య దగ్గరికి వెళ్లి నువ్వు చేసేదేం బాగాలేదు పెనిమిటి అని అంటుంది. నేనేం చేశాను చిరాగ్గా ఉన్నాను నువ్వు ఇంకా చిరాకు పెట్టుకుని అరుస్తాడు. ఆ సంజయ్ కి 10 కోట్లు ఇవ్వడం ఏంటి నీ తమ్ముడు కొడుక్కి ఆడించుకోలేడా నువ్వు ఇవ్వకపోతే అనేసి కడిగి పడేస్తుంది. దానికి నీకు అసలు విషయం తెలియక అలా మాట్లాడుతున్నావ్ విషయం తెలిస్తే నువ్వే వాడికి ఇస్తావ్ అనేసి అంటాడు. ఏం జరిగింది పెనిమిటి నువ్వు నాకు చెప్పట్లేదు ఏదో దాస్తున్నావు చెప్పు అంటే ఆ సంజయ్ ఎవరో కాదు నా కొడుకు నా సొంత కొడుకు అని మహదేవయ్యా అంటాడు. మన సొంత కొడుకని సంజయ్ గురించి మహదేవయ్య భైరవికి చెప్తాడు.. నువ్వు విన్నది నిజమే ఆడు మన బిడ్డే అందుకే నేను అన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని మహదేవ అంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అని భైరవి అంటుంది. మన బిడ్డ ఏంటి మన పుట్టింది కృష్ణ రుద్రాన్నే కదా అని మహదేవయ్యాను భైరవి అడుగుతుంది.. అసలు ఆరోజు హాస్పిటల్ లో ఏం జరిగిందో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ గురించి మహదేవయ్య భైరవి తో అంటాడు. ఇన్నాళ్లు నాకెందుకు నువ్వు నిజం చెప్పలేదు నీ భార్యనే కదా నిజం చెప్పాలని నీకు అనిపించలేదా అనేసి బైరవి అడుగుతుంది. ఆవగింజ కూడా నాన్నదు అలాంటిది ఈ విషయం చెప్తే నువ్వు అందరితో చెప్పకుండా ఉంటావా అని అందుకే నేను చెప్పకుండా దాచి పెట్టానని అంటాడు.. మహదేవ్ కొడుకు సంజయ్ అన్న విషయాన్ని సంజయ్ కి తెలిసిపోతుంది. ఇంతగా కొట్టాడు కక్ష తీర్చుకుంటాను విని ఇంట్లోంచి బయటికి పంపించేలా చేస్తానని శబదం చేసుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజయ్ కృష్ణ ఎలాగైనా ఇంట్లోంచి బయటికి పంపించాలని ప్లాన్ చేస్తాడు. భైరవిద్వారా ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటాడు. ఇక చిన్నగా బైరవి మనసులో క్రిష్ పై ద్వేషం పెరిగేలా ఇంటిస్తాడు. అటు మైత్రి హర్షను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాలని హర్షను ఇంటికి రప్పిస్తుంది. నేను ఉన్నది ఈ ఒక్కరోజు మాత్రమే అందుకే నేను స్పెషల్ గా రెడీ అయ్యాను ఈ ఒక్కరోజు నిన్ను ప్రేమించినందుకు నాకు స్వీట్ మెమరీగా ఉంచుతావు కదా అనేసి అడుగుతుంది మైత్రి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనిద్దరం కలిసి డిన్నర్ చేద్దామనేసి మైత్రి అంటుంది. హర్ష మాత్రం నా కోసం నందిని వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వెళ్లకపోతే ఫీల్ అవుతుంది అని అంటాడు. నేను ఉన్నది ఈ ఒక్కరోజు మాత్రమే కదా హర్ష నాకోసం ఆ మాత్రం చేయలేవు అని మైత్రి రిక్వెస్ట్ చేస్తుంది..
ఇక మైత్రి మాట కాదనలేక హర్ష ఓకే అంటాడు. ఇక మైత్రి జ్యూస్ తీసుకొస్తానని లోపలికి వెళ్తుంది. జ్యూస్ లో మత్తు టాబ్లెట్ వేస్తుంది మాటల్లో పెట్టేసి హర్షని మత్తులోకి జారుకుని ఎలా చేస్తుంది. బెడ్ మీద హర్షను పడుకోబెట్టి క్లోజ్ గా ఫోటోలు దిగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.. ఇక అందరూ తినడానికి మహాదేవయ్య ఇంట్లో కిందికి వస్తారు. కృషి వస్తుంటే రుద్ర కలెక్టర్ దగ్గరికి వెళ్లిన పని ఏమైంది? బాబు చెప్పిన పని నువ్వు చేసావా అని అడుగుతాడు. తిన్న తర్వాత మాట్లాడుకుందాం అన్నయ్య అనేసి క్రిష్ అంటాడు. తిండి ఏందిరా తిండి ముందు చెప్పిన పని చేయరా చేయకుండా అనేసి రుద్రా అరుస్తాడు. దానికి ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తారు. మధ్యలో భైరవి వచ్చి మహదేవయ్య కొడుకువేనా చెప్పిన పని చేయకుండా ఎలా మారావ్ ఏంట్రా అనేసి అడుగుతుంది. అయితే దానికి క్రిష్ అన్నం తిన్న తర్వాత మాట్లాడుకుందాం అనగానే భైరవి మళ్ళీ అరుస్తుంది. ఇదంతా ఎందుకు ఈ గొడవ ఏంటి తినేటప్పుడు అనేసి జయమ్మ అంటుంది. అవసరమే బామ్మ తల్లి అయిండి ఇలా మాట్లాడొచ్చా. పాతికేళ్లు పెంచిన చిన్న కొడుకు గురించి అత్తయ్య అంత మాట ఎలా అంటుందని సత్య అంటుంది.. వాడిని నేను అసలు కొడుకు కిందే లెక్క వేయను అనగానే భైరవి లోపలికి పో ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తా. చిన్నా మీ అమ్మ కోపంతో అప్నది దాని మాటలు పట్టించుకోకు. నడు తిందువు గానీ. తల్లి మాటలు గుర్తు చేసుకొని ఆవేశంగా కుండీలు తన్నేస్తాడు. చూడు సత్య నాకు ఆవేశం ఎక్కువ కొట్లాటకు పోతా. నన్ను మార్చాలని చూడకు. నా బతకు నన్ను బతకనివ్వు. క్రిష్ అంటే కళ్లెర్ర జేసి బుసలు కొట్టాలి అప్పుడే విలువ. మంచిగా మారి పద్ధతిగా ఆలోచిస్తున్నాకాబట్టి తప్పు ఒప్పుకున్నా. నీ ఒక్క దానికే అది మంచి పనిలా అనిపిస్తుంది. మిగతా అందరూ నా మీద యుద్ధం ప్రకటించారు. నా మీద నాకే అసహ్యంగా ఉంది సత్య.. నువ్వు అంత తప్పు చేయలేదు. క్రిష్ నిన్ను నేను మారమని చెప్పింది నీ కోసం నా కోసం. వాళ్ల కోసం ఆలోచించకు. కలిసి జీవితాంతం బతకాల్సిన వాళ్లం మనకి ఏది మంచో మనమే నిర్ణయించుకోవాలి అని సత్య అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రుద్ర నరసింహను చంపినట్లు క్రిష్కి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..