Satyabhama Today Episode February 22 nd : నిన్నటి ఎపిసోడ్లో.. క్రిష్ తనని ఇలా అన్నందుకు బాధపడుతూ ఉంటాడు. భైరవి మాట తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది చూసిన సత్య నువ్వేం తప్పు చేయలేదు క్రిష్ నువ్వు నిజమే చేసావు మీ బాపు అలా పేద వాళ్ళ భూమిని లాక్కోవడం న్యాయమని అనుకుంటున్నామంటే లేదనే కదా ఇచ్చింది.. అదే నేను చేసిన తప్పు.. ఈరోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను అన్నట్లు ఉంది అని క్రిష్ బాధపడతాడు. నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడాలి? ఇంకొకసారి మీ అమ్మ నా కొడుకుని కాదు అని అంటే అవును నేను నీ కొడుకునే కాదు అనేసి నువ్వు అనేసి అప్పుడు ఆవిడే ఎందుకన్నారని తెలుసుకుంటుందని సత్య క్రిష్ బాధను పోగొడుతుంది. ఇక్కడ వెన్నెలంతా బాగుందో కదా అనేసి అనగానే క్రిష్ మామూలు మూడ్లోకి వస్తాడు.. వీళ్ళిద్దరి సరసాలను చూసి సంజయ్ కుళ్ళు కుంటాడు నేను అనుభవించాలని అనుకుంటే ఆ పని చేయలేకపోతున్నాను వీరీద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ప్లాన్ చేస్తాడు. హర్షకు మైత్రి ప్లాన్ తెలిసిపోతుంది. జన్మలో నందిని వదలను అని వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. ఉదయం హర్ష ఇంటికి వస్తాడు. నేను మోసం చేశాను నందిని మోహం చూడాలంటే నాకు భయమేస్తుంది అని మళ్లీ బయటకు వెళ్లాలని అనుకుంటాడు. హర్ష వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్నమ్మ చూసి హర్షను తిడుతుంది. నువ్వు నందిని మోసం చేయాలనుకుంటున్నావా లేదా నందిని వదిలేయాలని చూస్తున్నావా అది నీకోసం పిచ్చిదాని లాగా రాత్రంతా గుమ్మం దగ్గర నిలబడుకొని వెయిట్ చేస్తూ ఉంది కానీ నువ్వు కనీసం ఫోన్ కూడా చేయలేదంటే ఇక నువ్వే అర్థం చేసుకో అలాంటి పిచ్చిది మంచిది నీకు దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం అని క్లాస్ పీకుతుంది. ఇక హర్ష లోపలికి వెళ్ళగానే నందిని హర్ష తో మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది. అటు క్రిష్ బైరవి అన్నమాటను తలుచుకొని కోపంగా ఉంటాడు. అమ్మంటే ఇలా మాట్లాడుతుందా? అమ్మన్న మాటలకి నేను ఎంత బాధ పడుతున్నానో తెలుసా అని ఆలోచిస్తూ ఉంటాడు.
క్రిష్ ఛాలా కోపంగా ఉన్నాడు దీన్ని ఎలాగైనా కూల్ చేయాలి అని సంజయ్ ప్లాన్ వేస్తాడు. ఏమైంది బ్రో అంత టెన్షన్ పడుతున్నావ్ అంటే అమ్మ ఇలా అంటే బాధగా ఉంటది బ్రో అనేసి అంటాడు బిగ్ మామ్ తో నేను మాట్లాడుతాను అసలు ఏమైందో కనుక్కుంటానని అంటాడు. సంజయ్ మాట నమ్మి తాగడానికి కూర్చుంటాడు క్రిష్. భైరవి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ మొత్తం బాటిల్ ని తాగేస్తాడు. ఇలా మత్తులో చేరుకోవడమే నాకు కావాలి అక్కడ నేను సత్యతో చేయబోయేది నువ్వు చూడకూడదు కదా అనేసి అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కానీ క్రిష్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నావ్ బ్రో అంటే కళా పోషణ కాస్త అలా వెళ్లి వస్తానని అంటాడు. సత్య దగ్గరికి సంజయ్ వస్తాడు. సత్యను చక్కని చూసి కసితో రగిలిపోతూ సత్య తో ఎలాగైనా గడపాలని ముందుకు వస్తాడు. ఎంతగా వాదిస్తున్నా క్రిష్ అని అరుస్తున్న కూడా వినిపించుకోకుండా వస్తాడు.. ఇక అప్పుడే క్రిష్ లోపలికి వస్తాడు. సత్య నువ్వు సంజయ్ పట్టుకోవడం చూసి గట్టిగా అరుస్తాడు. నేను చెప్పాను ఈ సంజయ్ మంచివాడు కాదు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను కానీ నువ్వే వినట్లేదని సత్య అనగానే సంజయ్ పై కోపంతో చితక్కొడతాడు.
ఇక సంజయ్ ని కొట్టుకుంటూ కిందకు వస్తాడు. రేణుక జయమ్మ ఇద్దరు షాక్ అవుతారు. ఎవరు చెప్పిన కూడా క్రిష్ వినకుండా సంజయ్ ని కొడతాడు. సంధ్య ఏమైంది బావ ఎందుకు కొడుతున్నావ్ అని అడ్డుపడుతున్నా కూడా కృషి వీడికి ఈరోజు కాలం చెల్లిపోయింది అని అడ్డు తప్పుకో అనేసి ఇంకా దారుణంగా కొడతాడు. ఇక మధ్యలో వచ్చిన రుద్ర కూడా క్రిష్ పై అరుస్తాడు. ఏం చేసాడో నీకు తెలుసా నా గదిలోకి వెళ్లి సత్య చేయి పట్టుకున్నాడు వదిలేయమంటావా వాడిని అని అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. సోమవారం ఎపిసోడ్లో మహదేవయ్య తన కొడుకు క్రిష్ కాదన్న విషయాన్ని బయట పెట్టేస్తాడు.. నువ్వు నా కొడుకు కాదు సంజయ్ నా కొడుకు అని మహదేవయ్య అంటాడు. మరి క్రిష్ చక్రవర్తితో వెళ్లిపోతాడేమో చూడాలి..