BigTV English

 GHMC: 60 ప్రాపర్టీలు.. రూ.2 వేల కోట్లు టార్గెట్.. జీహెచ్ఎంసీ రప్పా రప్పా

 GHMC: 60 ప్రాపర్టీలు.. రూ.2 వేల కోట్లు టార్గెట్.. జీహెచ్ఎంసీ రప్పా రప్పా

ప్రతి సర్కిల్లో టాప్ 100 డీ ఫాల్టర్‌లపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు కమిషనర్ ఇలంబర్తి. గతేడాది మొత్తం 1960 కోట్ల రూపాయల టాక్స్ వసూలు చేసింది జిహెచ్ఎంసి. ఈ ఏడాది 2 వేల కోట్ల వరకు టాక్స్ వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు అధికారులు. ఇప్పటి వరకు కేవలం 1484 కోట్లు వసూలు చేసింది జిహెచ్ఎంసి. ఇంకా వసూలు చేయాల్సిన టార్గెట్ భారీగా ఉండడంతో టాక్స్ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం అధికారులు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 15 ఏళ్లుగా ట్యాక్స్ ​చెల్లించని ప్రాపర్టీలను గుర్తించి నోటీసులు ఇస్తోంది. స్పందన లేకపోతే సీల్‌ వారెంట్‌లు జారీ చేస్తోంది. తాజాగా తాజ్‌బంజారా హోటల్‌కు అధికారులు సీల్‌ వేయగా.. వెంటనే స్పందించిన యాజమాన్యం ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించింది. వందశాతం ప్రాపర్టీ ట్యాక్ వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో.. అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నెలలో ఆరు లక్షల ప్రాపర్టీలకు నోటీసులు ఇచ్చారు. 60 ప్రాపర్టీలకు సీల్ వారెంట్లు జారీ చేసినట్లు సమాచారం.


15 ఏళ్లుగా జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ కింద 11 వేల 668 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో 4 వేల రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి 5 వేల కోట్లు.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 600 ఆస్తుల నుంచి 500 కోట్లు ఉన్నాయి. ఏటా బకాయిలు పెరగటంతో ఉన్నతాధికారులు ట్యాక్స్ బకాయిదారులపై ఫోకస్ పెట్టారు. ట్యాక్స్ కలెక్షన్ కోసం రెవెన్యూ రికవరీ యాక్టు సెక్షన్269 (2) ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి సీల్ చేసి మరీ పన్ను కలెక్ట్ చేస్తున్నారు. ఇందులో 60 ప్రాపర్టీలు సీల్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాపర్టీలకు సంబంధించి ఆయా శాఖలకు GHMC లేఖలు రాయనున్నట్లు తెలిసింది.

Also Read: బీఆర్ఎస్, బీజేపీకి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..

గ్రేటర్ లో 19.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో రెండున్నర లక్షల మంది కమర్షియల్ ట్యాక్స్, 17 లక్షల మంది రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 12 లక్షల 50 వేల మంది ట్యాక్స్ చెల్లించారు. 14 వందల 84 కోట్ల ట్యాక్స్‌ వసూలైంది. బల్దియా టార్గెట్ 2 వేల కోట్లు కాగా.. 40 రోజుల్లో 516 కోట్లు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×