Satyabhama Today Episode February 26th: నిన్నటి ఎపిసోడ్లో.. బాపు కొడుకుని కాదట పరాయి వాడినంట. నా గుండెల మీద ఎవరో కాళ్లు వేసి తొక్కుతున్నట్లుంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొడుకు కాదు అంటే నేను ఏమైపోవాలి సత్య. బాపు కాదన్నా కూడా నేను బాపు కొడుకునే. ఇక్కడ గుండె నిండా ప్రేమ ఉంది నా ప్రేమ చావదు. అని అంటాడు.. జయమ్మ వాడు నీ కొడుకు కాకపోతే ఎవడ్రా వాడు అని అడుగుతుంది. భైరవి డెలివరీ అయినప్పుడు అక్కడ హాస్పిటల్ లో ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా అప్పుడే పక్కవాడిలో కాన్పైనా చక్రవర్తి కొడుకుని నా కొడుకుగా పెంచాను కేవలం నాకు కాపలాగా మాత్రమే పెంచాను నా కొడుకుని ఆ చక్రవర్తికి ఇచ్చాను అనగానే షాక్ అవుతాడు.. నిజం తెలియదనే చాలా బాధపడిపోతాడు నువ్వు అసలు నా కొడుకువే కాదు నేను ఇన్ని రోజులు నేను కుక్కలాగా పెంచుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు కన్న కొడుకుని చంపాలని చూసావు అందుకే ఈ నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చిందని మహాదేవయ్య అంటాడు.. నీ కన్నకొడుకుని కాదన్నా కాదన్నప్పుడు మరి నువ్వు ఎందుకు నీ గుండెల మీద పచ్చ పట్టుకున్నావ్ అనగానే ఇది నువ్వు ప్రేమనుకుంటున్నావా సరే ఆ ప్రేమనే నేను ఇప్పుడేం చేస్తానో చూడు అని ఆ పచ్చబొట్టు నువ్వు కత్తితో చేరిపేస్తాడు మహదేవయ్యా.. బాపు మాటలకు క్రిష్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఇంట్లో వాళ్ళు అందరు బాధపడతారు. ఇక క్రిష్ బాధను అర్థం చేసుకోకుండా ఇంట్లో మెడ పట్టుకొని బయటకు గేంటెస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ ను బయటికి గెంటేస్తారు మహదేవయ్య కుటుంబం.. ఇక సత్య క్రిష్ పై మాట పడనివ్వకుండా చేస్తుంది. ఇక అప్పుడే ఇంటికి చక్రవర్తి వస్తాడు.. కానీ మహదేవయ్యా తన కొడుకుకి చేసిన అవమానం వల్ల చక్రవర్తి కూడా ఫీలవుతాడు. నా కొడుకును ఇంట్లోంచి గెంటేస్తావా ఇన్ని రోజులు నువ్వు వాడిని ఎలా చూసావో తెలియదా వాడిని ఎలా చేశాడో ఆలోచించవా అని చక్రవర్తి అంటాడు.. ఇక నీ దగ్గర నా కొడుకు ఉంచాల్సిన అవసరం నాకు లేదు నేను నా కొడుకు నా ఇంటికి తీసుకెళ్ళిపోతానని చక్రవర్తి అంటాడు. నువ్వు గాని నీ కొడుకు గాని నా ఇంట్లోకి ఇంకా అడుగు పెట్టడానికి వీల్లేదని మహాదేవయ్య అంటాడు.. ఇక సత్యా ఇక్కడ ఉండడం వేస్ట్ మావయ్య మనము వెళ్లిపోదాం పదండి.. మనిషిని మానసికంగా హింసించడం వేదిక మాత్రమే తెలుసు మనకీ తెలియదు అని వెళ్లి పోదాం అని వెళ్లిపోతారు.
సత్య మహదేవ కుటుంబానికి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఈరోజు ఏ కొడుకును అయితే గుండెల మీద తన్ని గుండెను ముక్కలు చేసి బయటకు గెంటేసావో నీకు అంతకన్నా ఎక్కువ బాధ అనుభవించే రోజు వస్తుంది నీ కొడుకులు నీ గుండెల మీద తన్నే రోజు కూడా వస్తుంది అని సత్య అంటుంది. ఇక కృష్ణుని తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు చక్రవర్తి. హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్లగానే సత్య ఇన్ని రోజులు క్రిష్ మనసులో బాపు అనే ఒక ముసుగుండేది ఇప్పుడు అది లేదు మామయ్య ఇకమీదట నుంచి అతను తన గత జీవితాన్ని పీడకలుగా మర్చిపోతాడు అని సత్య అంటుంది.. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు రా అని అంటుంది మహాదేయ్యతో జయమ్మ అంటుంది. నువ్వు నాకు క్షమాపణ చెప్పడం కాదు నువ్వు ఎవరి మనసునైతే బాధ పెట్టావో వాడికి క్షమాపణ చెప్పాలి. కొడుకుని ఇన్నాళ్లు ఎలా వాడుకున్నావో తెలిసి కూడా సహించాడు వాడికి నువ్వు క్షమాపణ చెప్పాలి నువ్వు చేసింది తప్పు ఏ తల్లి నిన్ను ఇలా అనకూడదు కానీ చేసిన పాపం ఊరికే పోదు అని జయమ్మ అంటుంది. నువ్వు కూడా ఇంట్లోంచి మెడ పట్టుకొని గెంటిస్తావా అయితే నేనే వెళ్ళిపోతాలే వాళ్ళు పంపే అవసరం లేదని అంటుంది..
క్రిష్ మాత్రం చక్రవర్తిని ఇంకా తన తండ్రి అని నమ్మలేక పోతాడు. ఇంట్లోకి తీసుకెళ్లగానే మీ అమ్మ అని ఒక ఫోటోను చూపిస్తాడు. ఆ ఫోటోని చూసినా క్రిష్ ఎమోషనల్ అవుతాడు. మీరు ఏమనుకోనంటే నేనొక మాట అన్నా నేను ఇంకా మిమ్మల్ని నాకు కన్న తండ్రి అనుకోలేకపోతున్నాను ఎన్నన్నా కూడా ఆయనే నా బాపు అని అంటాడు. ఈరోజు ఇంత త్వరగా వస్తుందని నేను కూడా అనుకోలేదు ఎవరికైనా బాధ ఉంటుంది అందుకే నీ జ్ఞాపకాలతో నేను బతికేస్తున్నాను అని క్రిష్ చిన్నప్పుడు ఫోటోలను చూపిస్తాడు. ఇక సత్యా ఇదంతా ఒక పీడకలగలాగా మర్చిపోతే అంతా బాగుంటుంది లేకుండా ఉంటే అదే బాధ ఉంటుంది అవతల వాళ్ళకి లేని బాధ మనకెందుకు అని ఇండైరెక్టుగా క్రిష్ తో అంటుంది. అక్కదితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..