Intinti Ramayanam Today Episode February 26 th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం పల్లవి శ్రియను ఎలాగైనా పడేయాలని ప్లాన్ చేస్తుంది. భానుమతి వచ్చి ఏం చేస్తున్నావ్ అని పల్లవిని అడగగానే షాక్ అవుతుంది. ప్రియాను మన దారికి తెచ్చుకోవాలని అన్నావు కదా బామ్మ అందుకే ఈ ప్లాన్ వేస్తున్నాను శ్రీయను కింద పడేసి దానికి సేవలు చేస్తే అది మన దారికి వచ్చేస్తుంది కదా అని అంటుంది. దానికి భానుమతి శ్రీను పడేయడానికి ఇలాంటి ప్లాన్ వేసావని పల్లవిని అడుగుతుంది నువ్వే కదా అమ్మమ్మ చెప్పావు శ్రీయ అని మన దారిలోకి తెచ్చుకోవాలంటే దాన్ని ఇలా పడేసి మనమే కావాలని కలరింగ్ ఇచ్చి మంచి వాళ్ళమని అనిపించుకోవాలని నేను అనుకున్నాను ఎలా ఉంది ప్లాన్ అనేసి పల్లవి అడుగుతుంది. తాను బాగా అదిరిపోయిందని భానుమతి అంటుంది.
శ్రీయ రాగానే ఆ దారం తగులుకొని కింద పడుతుంది.. శ్రీయా అరుపులు విని భానుమతి అలాగే పల్లవి ఇద్దరు అక్కడికొస్తారు ఏమైందంటే కింద పడ్డాను చాలా నొప్పిగా ఉంది పల్లవి అని అంటుంది.. పల్లవి శ్రీయ ముందు మంచిదాన్ని అని శ్రియకు సేవలు చేస్తున్నట్లు నటిస్తుంది. శ్రీయా అది నిజమే అని నమ్ముతుంది. ఇక భానుమతి కూడా పల్లవి మంచితనం గురించి గొప్పగా చెప్తుంది. శ్రియ మనసులో పల్లవిపై మంచి ప్రభావం ఏర్పడుతుంది.. ఇక మొత్తానికి భానుమతి బయటకు రాగానే ఆ శ్రియా పిచ్చి మొహం ది నీ మాయలో పడిపోయిందని పల్లవికి హింట్ ఇస్తుంది.. ఇక అందరూ కలిసి శ్రియ కింద పడిందని బాధపడుతూ ఉంటారు. ఇక అక్షయ్ ఆఫీసులో తనకు జరిగిన అవమానాన్ని గురించి బయట పెడతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్ర ప్రసాద్ ని భోజనం చేయడానికి రండి అనేసి పార్వతి పిలుస్తుంది. అక్షయ్ కూడా రాని అందరం కలిసి భోజనం చేద్దాం అంటే ఇప్పటికే లేట్ అయింది కదండీ మీరు తినేసి టాబ్లెట్ వేసుకోవాలి కదా అని పార్వతి అడుగుతుంది. అప్పుడే అక్షయ్ ఇంట్లోకి వస్తాడు అదిగో అక్షయ వచ్చాడుగా ఇంక మనం అందరం కలిసి భోజనం చేద్దాం అని రాజేంద్రప్రసాద్ అంటాడు. కానీ అక్షయ మాత్రం నేను ఈరోజు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఈరోజు నా పరువును కాపాడారు ఒకరు అనేసి అంటాడు.
ఈ రోజు నేను ఒక ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి నా మీద ఇష్టంతో తనని నేను పాడు చేసానని ఏదేదో చెప్పేసింది అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చెడ్డగానుకున్నారు కానీ ఒక దేవత నన్ను వచ్చి కాపాడింది లేకున్నా అంటే ఈరోజు నా పరువు ఇంటి పరువు పోయేదని రాజేంద్రప్రసాద్ తో అక్షయ్ అంటాడు. అంత ప్రేమ ఉండేదైతే ఆస్తి మొత్తం ఎందుకు మీ పేరు రాయిస్తుంది అంటే మిమ్మల్ని ఆస్తిని ఎగరేసుకుపోవాలని అనుకుందేమో బావగారు అని అంటుంది. ఇక అక్షయ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. మళ్లీ పార్వతికి అవనిపై చాడీలు చెప్తుంది పల్లవి. అక్షయ బావకు దగ్గర అవ్వాలని ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది అని పల్లవి రాజేంద్రప్రసాద్ అంటుంది.
రాజేంద్రప్రసాద్ మాత్రం ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఆ దేవుడు చూస్తూ ఉంటాడు కానీ కాస్త అటు ఇటు ఆ దేవుడు అందరికీ చేయాల్సిన విధంగా శిక్ష వేస్తాడు అని చెప్తాడు. ఇక పార్వతీ దగ్గరకొచ్చి ఇదంతా అవని యొక్క ప్లాన్ లాగా అనిపిస్తుంది అత్తయ్య ఇంట్లోకి రావడానికి ఇలాంటి ప్లాన్ కూడా వేస్తుందా అని మళ్లీ పార్వతికి అవనిపై కోపం వచ్చేలా మాట్లాడుతుంది..
ఇక ఉదయం లేవగానే శ్రీయా రెడీ అవుతుంది.. పల్లవి అక్కడికొచ్చి బర్త్డే విషెస్ చెప్పడంతో పాటుగా ఖరీదైన నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. నక్లెస్ ఇవ్వగానే శ్రీయా ఫిదా అయిపోతుంది. పల్లవిని పొగిడేస్తుంది ఇక నీ కాలు నొప్పి తగ్గింది కదా అనగానే నువ్వు చేసిన ఇది వల్ల నాకు కాలనొప్పి అప్పుడే తగ్గిపోయింది అక్క అనేసి శ్రీయా అంటుంది. నీ బర్త్ డే కదా ఈరోజు శ్రీకర్ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా సర్ప్రైడ్ ప్లాన్ చేయొచ్చు అని పల్లవి హింట్ ఇస్తుంది. మళ్లీ కాసేపాగి అవని వదిన ఇంట్లో లేదు కదా మనం పార్టీలో అవి ఇవి చేసుకుంటే బాగోదు అని శ్రీకర్ అంటాడని పల్లవి అంటుంది. ఏముండదు శ్రీకర్ ఏదో ఒక ప్లాన్ చేస్తాడని శ్రియ ఆశపడుతుంది..
ఇక వెంటనే శ్రియా శ్రీకర్ కి ఫోన్ చేస్తుంది ఈరోజు ఏంటో స్పెషల్ ఒకటి ఉందని మీరు మర్చిపోయారా అనేసి అడుగుతుంది.. ఇక శ్రీకర్ చెప్పిన మాటలకు శ్రియ ఫీల్ అవుతుంది అది చూసిన పల్లవి నా ప్లాన్ వర్కౌట్ అయింది నేను చెప్పినట్లుగానే శేఖర్ చెప్పినట్లు ఉన్నాడని సంతోషపడుతుంది. ఆరాధ్య ఇంట్లో టిఫిన్ చేయనని బయట చేద్దామని సర్ప్రైజ్ అంటూ బయటికి తీసుకెళ్తుంది. పార్కుకి తీసుకెళ్లగానే అక్కడ అవని పార్క్ కి వస్తుంది. అవని చూసి అక్షయ ఆరాధ్య ఇద్దరు సంతోషపడతారు. నాకు టిఫిన్ తీసుకురమ్మని చెప్పాను కదా అమ్మ టిఫిన్ తీసుకొచ్చావా అని అడుగుతుంది. నీకు నాన్నకి ఇద్దరుకి టిఫిన్ తీసుకొని వచ్చాను అమ్మ ఇదిగో అనేసి అవని ఆరాధ్యకు టిఫిన్ పడుతుంది.. ఏదైనా మాట్లాడు అవని నాకు ఏదోలా ఉంది అని అక్షయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..