Satyabhama Today Episode February 27th: నిన్నటి ఎపిసోడ్లో.. క్రిష్ ను బయటికి గెంటేస్తారు మహదేవయ్య కుటుంబం.. ఇక సత్య క్రిష్ పై మాట పడనివ్వకుండా చేస్తుంది. ఇక అప్పుడే ఇంటికి చక్రవర్తి వస్తాడు.. కానీ మహదేవయ్యా తన కొడుకుకి చేసిన అవమానం వల్ల చక్రవర్తి కూడా ఫీలవుతాడు. నా కొడుకును ఇంట్లోంచి గెంటేస్తావా ఇన్ని రోజులు నువ్వు వాడిని ఎలా చూసావో తెలియదా వాడిని ఎలా చేశాడో ఆలోచించవా అని చక్రవర్తి అంటాడు.. ఇక నీ దగ్గర నా కొడుకు ఉంచాల్సిన అవసరం నాకు లేదు నేను నా కొడుకు నా ఇంటికి తీసుకెళ్ళిపోతానని చక్రవర్తి అంటాడు. నువ్వు గాని నీ కొడుకు గాని నా ఇంట్లోకి ఇంకా అడుగు పెట్టడానికి వీల్లేదని మహాదేవయ్య అంటాడు.. ఇక సత్యా ఇక్కడ ఉండడం వేస్ట్ మావయ్య మనము వెళ్లిపోదాం పదండి.. మనిషిని మానసికంగా హింసించడం వేదిక మాత్రమే తెలుసు అని సత్య అంటుంది. ఇక అందరు చక్రవర్తి ఇంటికి వెళ్తారు. క్రిష్ మాత్రం తన తండ్రి చక్రవర్తి అని అనుకోలేదు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ చక్రవర్తిని తన తండ్రి అని ఇంకా నమ్మలేకపోతున్నాడు. అందుకే ఆయనతో మాట్లాడటం కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు క్రిష్. ఇక సత్తి కూడా కృషి బాధను అర్థం చేసుకొని ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడకుండా దూరంగా ఉంటుంది. సత్తి దగ్గరికి చక్రవర్తి వచ్చి క్రిష్ పరిస్థితి చూస్తే నాకు బాధగా ఉంది అని బాధపడతాడు. బాధేముంది మామయ్య ఎప్పుడో ఒక రోజు ఈ విషయం తెలియాల్సిందే కదా అది ఇప్పుడు తెలిసింది ఆయన బాధంతా దేవుడు లాగా చూసుకున్నా బాపు ఇలాంటి దారుణమైన నిజాన్ని ఎందుకు దాచి పెట్టాడని బాధపడుతున్నాడని సత్య అంటుంది.. దాంతో క్రిష్ బాబాయ్ కాసేపు నీ గుండెల మీద తల వాల్చుకోవచ్చా అని అని అంటాడు. దాంతో క్రిష్ చక్రవర్తి గుండెల మీద తలవాల్చుకొని ఏడుస్తాడు..
సంజయ్ సంధ్యకు కనిపించకుండా బయటికి వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ సంధ్య గమనిస్తుంది. సంజయ్ ఏంటి వెళ్లిపోతున్నావ్. చూశావా మా అక్క నన్ను ఈ ఇంటి నుంచి గెంటేయాలి అనుకుంది చివరికి తనే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇకపై ఈ ఇంట్లో కోడలిగా నేనే చక్రం తిప్పుతా అని సంధ్య అంటుంది. మనసులో ఏంటి తిప్పేది బొంగరం.. నీతో నా అవసరం తీరిపోతే నిన్నూ గెంటేస్తా. మీ అక్కే ఇక్కడ లేనప్పుడు నువ్వు మాత్రం ఇక్కడ ఎందుకు త్వరలో నీ లెక్కలు తేల్చుతాను సంజయ్ అనుకుంటాడు.
అటు చక్రవర్తి వాడిది చిన్న పిల్లల మనస్తత్వం. వాడు ఒకరిని ప్రేమిస్తే ఎదుటి వారి గురించి పట్టించుకోడు. నీ విషయంలో కూడా ఇదే జరిగింది కదా. వాడే ప్రాణంగా ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకొని నువ్వు అసహ్యించుకున్నా నిన్ను ప్రేమించడం మానలేదు. ఇప్పుడు మా అన్నయ్య విషయంలో అదే జరుగుతుంది. నా కొడుకు ఈ ఇంటికి ఎప్పటికీ రాడు అనుకున్నా వచ్చాడు. మనసు చాలా సంతోషంలో తేలిపోయింది కానీ నాన్న అని పిలవను అనగానే గుండె పిండేసింది. ఎవరు ఏ ఖర్మ చేసుకుంటే అవి అనుభవించాలి అంటారు. అవునమ్మా చిన్నాకి వాళ్ల అమ్మ చావు గురించి ఎందుకు చెప్పనివ్వలేదు అని అంటాడు.
మహదేవయ్య గదిలో ఉంటే పనోడు వచ్చి రేపు హైదరాబాద్ వెళ్లాలి అంటే ఆ ఏర్పాట్లు చిన్నాని చూసుకోమని అంటాడు. దాంతో రుద్ర, సంజయ్ వస్తారు. వాడు లేడు ఇప్పుడు మేం చూసుకుంటాం ఏమైనా ఉంటే మాకు చెప్పమని రుద్ర అంటాడు. ఇక పనోడు రుద్ర వాళ్లతో అయ్యగారి మందులు నుంచి అన్నీ చిన్న బాబు చూసుకునేవారు అని చెప్తాడు. మహదేవయ్య తనలో తాను ఇన్నేళ్లు నన్ను కంటికి రెప్పలా చూసుకునేవాడిని మర్చిపోమంటే ఎలా అని అనుకుంటాడు. రేణుక నందినికి కాల్ చేస్తుంది జరిగిన విషయాన్ని బయట పెట్టేస్తుంది. చిన్నాకి ఒక్క సారి అనాథని చేసేశారని చిన్నా సత్య లేని ఇళ్లు స్మశానంలా ఉందని నాకు ఇంట్లో ఉండ బుద్ధి లేదని ఏడుస్తుంది. ఇక నందిని ఏడుస్తుంది. విశాలాక్షి ఏమైంది అని అడిగితే అత్తని వాటేసుకొని ఏడుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. ఏమైందని అడుగుతారు. మైత్రి విషయం తెలిసిపోయిందని అనుకుంటాడు..
ఇక మహదేవయ్య లాంటి మోసగాడికి పుట్టానని బాధ పడుతున్నాను. మామయ్య మీ పెద్దల్లుడు మహదేవయ్య కొడుకు కాడట. చక్రవర్తి బాబాయ్ కొడుకు అంట. పెద్ద వదిన ఇప్పుడే జరిగింది అంతా చెప్పింది.. సత్య ఫ్యామిలి అందరు ఫీల్ అవుతారు. ఆ ఇంటిలో అందరి కంటే నన్ను ప్రేమగా చూసుకొనేది మా చిన్న అన్న. ఆ ఇంటిని మార్చింది మా చిన్న వదిన ఇద్దరూ ఇప్పుడు అక్కడలేరు. నేను ఇక ఆ ఇంటికి శాశ్వతంగా వెళ్లను.. అంత లేదు ఓడలు బళ్లు బళ్లు ఓడలు అయితే ఎలా ఉంటుందో అర్థమైందా అని అడగటానికి వచ్చా. ఊరిలో పబ్లిక్ ఫిగర్ అయిన మహదేవయ్య కోడలిగా ఉండటానికి ఊరిలో ఎవరికీ తెలియని చక్రవర్తి కోడలుగా ఉండటానికి తేడా లేదా.. సంధ్య మోసపోతున్నావు అని హెచ్చరిస్తుంది. కానీ సంధ్య వినదు.. అక్కడితో ఎపోసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…