Satyabhama Today Episode February 2nd: నిన్నటి ఎపిసోడ్లో.. పెళ్లిచూపులు వాళ్ళు కూతురు లేచిపోయిందని అవమానించి వెళ్ళిపోతారు. ఆ మాటలు తలుచుకొని విశ్వనాథం బాధపడతాడు.. ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే సంధి మాత్రం అక్కడ సంజయ్ నీ పెళ్లి చేసుకోవడానికి పెళ్లి పీటలు ఎక్కుతుంది. మొత్తానికి సంధ్య సంజయ్ పెళ్లి చేసుకుంటారు ఇక సత్య క్రిష్ కి ఫోన్ చేసి మనం సంధ్యను వెతకాలి వస్తావా అని అడుగుతుంది. సంధ్య అన్నంత పని చేసింది సంజయ్ సంధ్య నువ్వు కలుసుకోకుండా చేయాలని సత్య అడుగుతుంది. ఎక్కడ వెతకాల్సిన పనిలేదు సంధ్యా సంజయ్ ఇద్దరు నా దగ్గరే ఉన్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని సత్యకు షాక్ ఇస్తాడు క్రిష్.. నువ్వు మా ఇంటికి వచ్చేసేయ్ మీ వాళ్ళందరిని తీసుకొని అని క్రిష్ చెప్తాడు. ఇక విశ్వనాథ కుటుంబం అందరూ షాక్ అవుతారు. పెళ్లి చేసుకోవడం ఏంటి అని అందరూ మహాదేవయ్య ఇంటికి పరుగులు పెడతారు.. మహదేవయ్యా సంజయ్ సంధ్యను చూసి షాక్ అవుతాడు.. ఇక అందరూ ఏమైందని బయటికి ఉరుక్కుంటూ వస్తారు. సంధ్య సంజయ్ ఇద్దరు పెళ్లి చేసుకుని రావడంతో బైరవి షాక్ అవుతుంది.. ఇది సంజయ్ ని దుమ్ము దులిపేస్తుంది. నీకు ఈ ప్రపంచంలో ఎవరి దొరకలేరా తల్లి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ కుటుంబం మీద మీకు ఎందుకురా అంత ఇది మీకు ఏమైనా ఇది ఇచ్చారా అది ఇచ్చారా అని భైరవి నిష్టూరంగా మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. మహాదేవయ్య ఇంట్లో సంధ్య సంజయ్ కు హారతి ఇవ్వమంటే ఎవరు ఇవ్వడానికి ముందుకు రారు. ఇంట్లో హారతి ఇవ్వడానికి మీకు ఎవరు లేరు సరే పర్లేదు మీరు ఇంట్లోకి వెళ్ళండి అనేసి క్రిష్ అంటాడు. ఇక రేణుక వాళ్ళిద్దర్నీ లోపలికి తీసుకెళ్తుంటే సత్య వచ్చి ఈ పెళ్లి ఏంది నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తుంది. కానీ క్రిష్ మాత్రం వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు చేసుకున్నారు ఇప్పుడు ఎందుకు ఇంతగా మారుస్తున్నావ్ అనేసి సత్యను అంటాడు. ఇక సత్య మాత్రం సంధ్య ఎందుకిలా చేశావని చెంప పగలగొడుతుంది. కాసేపు మహాదేవయ్య ఇంట్లో రెండు కుటుంబాల మధ్య పెద్ద రచ్చ జరుగుతుంది.. ఇంట్లో ఇంత జరుగుతున్న మాత్రం మహదేవయ్యా అయోమయంలో ఉంటాడు తప్ప ఏంటి ఎందుకని మాత్రం అడగడు..
ఇక సంధ్యను వాళ్ళమ్మ విశాలాక్షి బయటకు లాక్కొని పద ఇంటికని వెళ్తుంది. సంధ్య వాళ్ళమ్మ మాటలు లెక్కచేయకుండా బరితెగించేస్తుంది. నేను పెళ్లి చేసుకున్నాను నాకు పెళ్లయింది నేను మేజర్ ని అని అందరికి షాక్ ఇస్తుంది. ఇక సంధ్య ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే వస్తుంది. సంధ్య చెయ్యి పట్టుకొని విశాలాక్షి లాక్కుని వెళ్తుంటే పోలీసులతో నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు నాకు అన్యాయం జరిగేలా ఉంది నాకు న్యాయం చేయండి అని పోలీసులు తో అంటుంది. ఇక క్రిష్ ఇది మా ఇంటి సమస్య మేమే పరిష్కరించుకుంటాం మీరు ఎలాంటి ఎస్ఐ గారు అనేసి పోలీసుల్ని పంపించేస్తాడు. తర్వాత అందరూ ఎంతగా నచ్చచెప్పినా సంధ్య మాత్రం వినదు తనకి పెళ్లి అయిందని సంజయ్ తన భర్తని అంటుంది.
ఇక సత్య కుటుంబం ఇంటికి వెళ్ళిపోతుంది. సంధి ఇలా చేస్తది నీ కలలో కూడా ఊహించలేదు అని నందిని అంటుంది. ఇక చేసేదేమీ లేదు తన ఇష్టమా తను పోయింది అక్కడ తనకే సమస్య రాకుండా సత్యం ఉంది కదా సత్య చూసుకుంటుందిలే అని అందరూ ఎవరికి వాళ్లే సమర్ధించుకుంటారు. అటు మహదేవయ్య ఇంట్లో క్రిష్ కు సత్య మధ్య గొడవ జరుగుతుంది. నీ మాట నీదే కానీ వాళ్ళ ప్రేమించుకున్నారు అని చెప్తే అర్థం కాదా అనేసి అంటుంది సంజయ్ ఎలాంటి వాడు చెప్పబోతుంది మధ్యలో ఎందుకులే అని ఆగుతుంది. ఇక మాదేవయ్య సత్య దగ్గరికి వచ్చి నువ్వు ఎన్నికల నుంచి తప్పుకోవాలని వార్నింగ్ ఇస్తాడు.. నువ్వు కాదు కూడదు అని ఎన్నికల్లో పోటీ చేయాలని వచ్చావనుకో సంజయ్ నా మాట కాదనకుండా ఉండడు. నేను ఏది చెప్తే అదే వింటాడు ఇది కూడా నా మాట ప్రకారం జరిగిందనుకో అయితే నువ్వు ఎన్నికల నుంచి తప్పుకోకపోతే అటు చూడు ఒకసారి నేను ఒక ఫోన్ కాల్ చేస్తే సన్నిధిని చంపడానికి కూడా సంజయ్ వెనకాడని సత్యను భయపెడతాడు. ఇక అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో సత్య భయపడి వెనక్కి తప్పుకుంటుందా లేక ఎన్నికల బరిలోకి దిగుతుందా చూడాలి..