Satyabhama Today Episode February 6th: నిన్నటి ఎపిసోడ్లో.. సంధ్యను ఎలాగైనా సత్యకు యాంటిగా మార్చాలని అనుకుంటుంది. అదే విధంగా సంధ్యను పిలిచి నగలను ఇచ్చి బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నాకెందుకు అత్తయ్యా అని సంధ్య అడిగితే ఆడది ఇలా అనకూడదు ఎంత అయినా నగలు కావాలి అని అడగాలి అని అంగరంగ వైభవంగా జరగాల్సిన మీ పెళ్లి పక్కన ఎవరూ లేకుండా జరిగిందని ఈ ముచ్చట అయినా తీర్చుకోనివ్వు అని చెప్తుంది.. ఇక సత్య భైరవి రూమ్ కు వస్తుంది. ఇవే నగలు నాకు చూపించి బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేశారు. నేను పడలేదు. ఇప్పుడు నా చెల్లెలును వేసే ప్రయత్నం చేస్తున్నారు. అని అనగానే.. భైరవి నాటకం మొదలు పెడుతుంది.. నేనేం చేసినా మీ అక్కకి ఇష్టం లేదులే అనేసి అక్కడి నుంచి బైరవి వెళ్ళిపోతుంది ఇక సత్యా సంధ్యను అలాంటిది నమ్మొద్దు నేను మాయ చేసి తన బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తుంది అని అంటుంది అయితే దానికి సంధ్య మాత్రం నాకు పుట్టింటి వాళ్ళని దూరం చేసావు ఇప్పుడు అద్దంకి ప్రేమను కూడా దూరం చేయాలనుకుంటున్నావా నేను నీకు తోడు కోడల్ని కదా ఆ ప్రేమ వాళ్ళు నా మీద చూపిస్తే నువ్వు ఓర్వలేక పోతున్నావని సంధ్య సత్యను తిడుతుంది.. అక్కడదో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజయ్ సత్యకి గతంలో ఫొటోలు చూపించి సంధ్యని ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తాను అని చెప్పాడని చెప్తుంది. సంధ్య ఎంతకీ నమ్మకపోవడంతో సంజయ్ ఫోన్ చెక్ చేయమని చెప్తుంది. ఒకవేళ అందులో ఏం లేకపోతే సంజయ్కి సారీ చెప్పాలని అంటుంది. సత్య సరే అంటుంది. బయట సంజయ్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే సంధ్య ఫోన్ తీసుకుంటుంది. చెక్ చేస్తా అంటే సంజయ్ వద్దని నీ ఫోన్ నేను ఎప్పుడూ చెక్ చేయలేదు అని అంటే సంధ్య తన ఫోన్ సంజయ్ చేతిలో పెట్టి నా ఫోన్ చూసుకో నీ ఫోన్ నేను వెరిఫై చేస్తానని అంటుంది. సంజయ్ చాలా టెన్షన్ పడతాడు. సంధ్య మొత్తం చెక్ చేసి అందులో ఏం లేకపోవడంతో సత్య చేతిలో పెట్టి ఇదిగో నువ్వు కూడా చెక్ చేయ్ అని ఇస్తుంది.. ఇక సంజయ్ మాత్రం సత్యకు పెద్ద షాకే ఇస్తాడు. ఇక సంధ్య ఫస్ట్ నైట్ గురించి ముద్దు ముచ్చట ఏర్పాట్లు ఏం లేదా అత్తయ్య అని భైరవిని అడుగుతుంది. ఇక భైరవి వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇక పంకజం భైరవిన్ చూసి మీరు చేసేది నాకేం నచ్చలేదమ్మా. మీరు అక్క మీద కోపంతో చెల్లికి శోభనం జరిపించడం ఏంటో నాకు అర్థం కావట్లేదని అడుగుతుంది.
ఆ మాటలు విన్న భైరవి అక్క మీద కోపంతోనే నేను ఇది చేస్తున్నాను అక్క చెల్లెల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నాను నేను శోభనం జరిపించాలని చూస్తే సత్య ఆ మాటలు విన్న భైరవి అక్క మీద కోపంతోనే నేను ఇది చేస్తున్నాను అక్క చెల్లెల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నాను నేను శోభనం జరిపించాలని చూస్తే సత్య ఆ శోభనాన్ని ఆపాలని అనుకుంటుంది. దాంతో సంధి దృష్టిలో నేను మంచిదాన్ని అయిపోతాను సత్య చెడ్డదైపోతుంది అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి నేను సంబరాలు చేసుకుంటాను అని భైరవి పంకజంతో అంటుంది. అదిరిపోయింది అమ్మ నిజంగానే చాలా బాగుంది మీరు అనుకున్నది కచ్చితంగా జరుగుతుంది అని పంకజం కూడా బైరవెక్కి సపోర్టుగా నిలుస్తుంది.
ఇక భైరవి కింద సత్యం వస్తే ఏం చేస్తున్నావ్ ఇక్కడ ఖాళీగా అక్కడ రూమ్ లోనే క్రిష్ ఒక్కడే డెకరేట్ చేస్తున్నాడు వెళ్లి సాయం చేయొచ్చుగా ఇష్టం లేదా లేకపోతే చేయలేకపోతున్నావా అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. సంధ్య అక్కడికొస్తుంది ఏంటి అత్తయ్య పిలిచారంట అని అనగానే ఇది నీకు ఇద్దామని అనుకున్నాను మా అత్తయ్య నాకు పెట్టిన చీర నాకు చాలా ఇష్టమైన చీర ఇది కాస్త నలిగినట్టుందే అంటే సంధ్య నేను ఐరన్ చేసుకుంటాను అంటుంది. ఐరన్ చేస్తావా మరి అని సత్యకి ఇస్తుంది. సత్య చీరను అక్కడ పెట్టేసి లోపలికి వెళ్లి పూలు పండ్లను పెట్టేసి వస్తుంది. ఇస్తూ కాస్త సరదాగా మాట్లాడుతుంది ఆ లోపల చీరకాలిన వాసన రావడంతో రేణుక చీర కాలుతుంది అని అరుస్తుంది. అందరూ బయటకు వచ్చి బంగారు లాంటి చీర కాలిపోయింది అంతా సత్య కావాలని చేసిందని తప్పంతా సత్యాన్ని అందరూ సత్యమేదనూరి పోస్తారు. సంధ్య సత్యను అపార్థం చేసుకుని వెళ్ళిపోతుంది. సత్య నా తప్పేమీ లేకపోయినా నన్నే కావాలని ఇలా అంటున్నారు నా చెల్లిని నాపై ఉసిగొలుపుతున్నారని బాధపడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో సంజయ్ సంధ్య శోభనాన్ని ఏర్పాటు చేస్తారు. సత్య ఆపుతుందా లేదా అన్నది చూడాలి..