Satyabhama Today Episode January 12th : నిన్నటి ఎపిసోడ్ లో… సత్య వల్లే ఒక పెద్దావిడ చనిపోయిందని ఎమోషనల్ అవుతుంది ఇంత మంది బాగోగులు చూసుకుంటున్న ఈవిడను చంపేశారని అంటుంది. అందరినీ నేను తీసుకెళ్లిపోతాను ఎక్కడైనా తీసుకెళ్లిపోతా ఈ పెద్దావిడను బతికించమని అరుస్తుంది. రేపో మాపో నా పరిస్థితి ఇంతే అని ఆ పెద్దావిడ ప్లేస్లో నేనే నీ ఒడిలో శవంలా ఉంటానని నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేవు అని అంటుంది. క్రిష్ షాక్ అయిపోతాడు. నువ్వు వెళ్లిపో క్రిష్ మీ అన్నయ్య మీ బాపు నిన్ను ఇక్కడ చూస్తే మరో ప్రళయం చేస్తారని అంటుంది. అక్కడున్న అందరికీ సత్య తన వల్ల జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్తుంది. రాత్రి క్రిష్ మందు తాగుతూ సత్య మాటలు తలచుకొని ఉంటాడు. గదిలో సత్య ఏడుస్తుంటుంది. క్రిష్ మాత్రం ఏమి చేయలేకపోయాను నేను ఎంత చేతగాని వాడిని అంటూ బాధపడతాడు. విశ్వనాథంకు గాయం తగలడంతో అందరూ బాధపడతారు. మనము సత్యకు సపోర్ట్ చేయడం లేదు కదా మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అందరూ అనుకుంటారు. ఇక చేసేదేమీ లేదు సత్యకు సపోర్టుగా నిలవాలి ఏదైతే అది జరిగిందని విశాలాక్షి అంటుంది. సంధ్య మాత్రం సంజయ్ కి దూరమైన బ్రతకలేను ఎలాగైనా వీళ్ళని ఆపాలి అక్కని వెనక్కి తగ్గేలా చేయాలని అనుకుంటుంది. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమోలో చూస్తే.. జయమ్మ క్రిష్ దగ్గరికి వచ్చి ఏమైందిరా ఇంతగా తాగుతున్నావ్ ఎందుకంతగా బాధపడుతున్నావ్ నీ కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఎందుకు అని అడుగుతుంది. దానికి క్రిష్ చాలా బాధగా ఉంది బామ్మ.. నాన్న అన్నయ్య తమ స్వార్థం కోసం ఒక ముసలావిడని ప్రాణం తీసేసారు సత్య అది చూసి భయపడి పోయింది. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు బామ్మ అని బాధపడతాడు.. నీకు తప్పు అనిపించినప్పుడు వెళ్లి మీ బాబుని అడుగు అని జయమ్మ అంటుంది. కానీ నేను అడగలేదు బామ్మ. పేరును గుండెల మీద పచ్చబొట్టు పడిపెచ్చుకున్నాడు ఈ మాట గనక అడిగితే ఆయన గుండెలు పగిలిపోతాయి. అందుకే చేతకాక ఏమి చేయలేక ఇలా తాగుతున్నానని జయమ్మ తో అంటాడు.. ఇక సత్య మనసు విరిగిపోతుంది. దాంతో ఆమె ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని అనుకుంటుంది. కానీ క్రిష్ సత్యను రెచ్చ గోడతాడు.
నువ్వు ఎన్నికల్లో చేత కాక తప్పుకుంటున్నావు కానీ బాపు మీద నిందలు వేస్తె ఊరుకోను అని అంటాడు. దానికి సత్య నావల్ల ఒక ప్రాణం పోయింది. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయా అని భయపడినట్లు సత్య అంటుంది. కానీ క్రిష్ మాత్రం అంత ధైర్యం లేని దానివి ఎందుకు నిలబడ్డావు అని సత్యను దారుణంగా అంటాడు. మహాదేవయ్య వద్దని అంటున్నా కూడా మళ్ళీ సత్యను ఎలెక్షన్స్ లో నిలబడేలా చేస్తాడు. ఇక సత్య రూమ్ లోకి వెళ్ళగానే ఎందుకు క్రిష్ నువ్వు ఇలా చేస్తున్నావు. నేను ఎన్నికల నుంచి తప్పుంటాను అంటున్న కదా అయిన నన్ను ఇలా రెచ్చగొడుతున్నావు అని అంటుంది. నువ్వు నిలబడాలి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను ఎదురుంచాలి అని అంటాడు.
ఈ రావణ కష్టం ఇక ఆపండి నేను ఎలక్షన్స్ లో ఎప్పటికీ నిలబడును ఇది నా ఆమోద పత్రం నా స్వహస్తాలతో నేను రాసిన ఆమోదపత్రమని మహదేవయ్యకు ఒక లెటర్ ఇస్తుంది. అది చూసిన క్రిష్ షాక్ అవుతాడు. నావల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఇకమీదట ఏ ప్రాణం పోకూడదు నేను ఎలక్షన్స్ లో నిలబడితే నా ప్రాణమైన పర్లేదు కానీ నాకు సపోర్ట్ గా నిలిచిన వాళ్ళు ప్రాణం పోతే ఎలా ఉంటుందో ఆలోచించండి అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో నేను ఎప్పుడూ ఎలక్షన్స్ లో నిలబడను అని చెప్తుంది. సత్య ఎలక్షన్స్ లో నిలబడాలి సత్య గెలవాలి అని క్రిష్ సత్య నువ్వు రెచ్చగొడతాడు. మా బాపు మీద నిందలేసి పోతున్నావ్ నువ్వు చేతకాక ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటున్నావా అని క్రిష్ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నన్ను క్షమించు సత్య నేను ఎలక్షన్స్ నుంచి తప్పుకోకుండా చేయడానికి నేను ఇలా మాట్లాడుతున్నానని క్రిష్ మనసులో అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. ఇక విశాలాక్షి కూడా కూతురుకు సపోర్ట్ చేస్తుంది. అది విన్న సత్య సంతోషంలో మునిగిపోతుంది. ఇక మళ్ళీ ఎలెక్షన్స్ లో నిలబడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..