Honey Rose: వేధింపులకు గురవుతున్నామని బయటపెడితే తమ కెరీర్ ఏమైపోతుందో అని చాలామంది హీరోయిన్లకు భయం ఉంటుంది. అందుకే క్యాస్టింగ్ కౌచ్ గురించి నేరుగా ప్రశ్నలు ఎదురయినా కూడా చాలామంది హీరోయిన్స్ ఆ విషయాన్ని ఒప్పుకోరు. తమకు అలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వలేదని చెప్పి తప్పించుకుంటారు. కానీ ఇటీవల మలయాళ బ్యూటీ హనీ రోజ్ మాత్రం తాను ఒక పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త నుండి వేధింపులు ఎదుర్కుంటున్నానని ఓపెన్‌గా సోషల్ మీడియాలో స్టేట్‌మెంట్ విడుదల చేసింది. దీంతో పోలీసులు కూడా వెంటనే దీనిపై స్పందించి ఆ వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు దీని ఎఫెక్ట్ తన అప్‌కమింగ్ మూవీపై పడింది.
కాంట్రవర్సీ ఎఫెక్ట్.?
బాబీ చెమ్మనూర్ (Bobby Chemmanur) అనే వ్యాపారవేత్తపై హనీ రోజ్ వేధింపుల కేసు పెట్టడం ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మామూలుగా హీరోయిన్స్ వేధింపులు ఎదుర్కోవడం, అలా ప్రవర్తించిన వారిపై కేసులు పెట్టడం సహజం. కానీ హనీ మాత్రం బాబీ నుండి ఏ విధంగా వేధింపులు ఎదుర్కున్నాననే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వివరంగా బయటపెట్టింది. దీంతో పోలీసులు బాబీని అరెస్ట్ చేయడంతో అంతా క్లియర్ అయిపోయింది అనుకున్నారు. కానీ దీని ఎఫెక్ట్ పరోక్షంగా హనీ రోజ్ నటించిన అప్‌కమింగ్ మూవీ ‘రేచెల్’పై పడినట్టు తెలుస్తోంది. దీంతో కాంట్రవర్సీల వల్లే సినిమాను విడుదల కాకుండా పక్కకు తప్పించారు అని వార్తలు వినిపిస్తుండగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: నొప్పితో బాధపడుతుంటే ఆ దర్శకుడు అలా అన్నాడు.. నిత్యా మీనన్ ఆసక్తికర కామెంట్స్
అందుకే పోస్ట్‌పోన్
బాబీ చెమ్మనూర్ తనను వేధిస్తున్నాడని హనీ రోజ్ (Honey Rose) ఆరోపణలు చేయగానే తన అప్‌కమింగ్ మూవీ ‘రేచెల్’ ప్రమోషన్స్ కోసమే తను ఇలా చేస్తుందంటూ బాబీ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. జనవరి 10న విడుదల కావాల్సిన ‘రేచెల్’ పోస్ట్‌పోన్ అయినట్టుగా చివరి నిమిషంలో అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో బాబీ చేసిన రివర్స్ ఆరోపణలే దీనికి కారణమని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ప్రేక్షకులకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి మేకర్స్ స్వయంగా ముందుకొచ్చారు. ‘‘రేచెల్‌కు ఇంకా టెక్నికల్ వర్క్ జరగాల్సి ఉంది. ఈ సినిమాకు ఇంకా సెన్సార్ కూడా అవ్వలేదు’’ అంటూ అనుకున్న తేదీకి మూవీ విడుదల అవ్వకపోవడంపై కారణం చెప్పుకొచ్చారు.
సంబంధం లేదు
‘‘రేచెల్ (Rachel) మూవీని ఇంకా సెన్సార్‌కు కూడా పంపలేదు. రిలీజ్ డేట్ కంటే 15 రోజుల ముందే సెన్సార్‌కు అప్లై చేయాల్సి ఉంటుంది. హనీ రోజ్ వల్ల గానీ, తన సమస్యల వల్ల గానీ సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది అనే వార్తల్లో నిజం లేదు. ఈ సినిమాకు సంబంధించి మరొక రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం’’ అని తెలిపారు మేకర్స్. ఏది ఏమైనా కూడా హనీ రోజ్ కాంట్రవర్సీ వల్ల తన అప్‌కమింగ్ మూవీ ‘రేచెల్’కు సరిపడా ప్రమోషన్స్ జరిగే అవకాశం ఉంది అనేది నిజమే అని నెటిజన్లు సైతం ఫీలవుతున్నారు. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదలకు సిద్ధమవుతోంది.