Satyabhama Today Episode January 14th : నిన్నటి ఎపిసోడ్ లో… జయమ్మ మాటతో క్రిష్ సత్యకు సపోర్ట్ గా నిలుస్తాడు. ఎన్నికల్లో నిలబడితే తన వల్ల ఎవరికైనా ఏమైనా అవుతుందని భయపడుతుంది సత్య.. సత్య మనసు విరిగిపోతుంది. దాంతో ఆమె ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని అనుకుంటుంది. కానీ క్రిష్ సత్యను రెచ్చ గోడతాడు. నువ్వు ఎన్నికల్లో చేత కాక తప్పుకుంటున్నావు కానీ బాపు మీద నిందలు వేస్తె ఊరుకోను అని అంటాడు. దానికి సత్య నావల్ల ఒక ప్రాణం పోయింది. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయా అని భయపడినట్లు సత్య అంటుంది. కానీ క్రిష్ మాత్రం అంత ధైర్యం లేని దానివి ఎందుకు నిలబడ్డావు అని సత్యను దారుణంగా అంటాడు. మహాదేవయ్య వద్దని అంటున్నా కూడా మళ్ళీ సత్యను ఎలెక్షన్స్ లో నిలబడేలా చేస్తాడు. ఇక సత్య రూమ్ లోకి వెళ్ళగానే ఎందుకు క్రిష్ నువ్వు ఇలా చేస్తున్నావు. నేను ఎన్నికల నుంచి తప్పుంటాను అంటున్న కదా అయిన నన్ను ఇలా రెచ్చగొడుతున్నావు అని అంటుంది. నువ్వు నిలబడాలి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను ఎదురుంచాలి అని అంటాడు.. నాకు ఎదురించే దమ్ము లేక కాదు. నా వల్ల ఎవరికి ఏం కాకూడదని అంటుంది. కానీ క్రిష్ మాత్రం అదంతా కాదు ఓడిపోయాను అని ఒప్పుకో అంటాడు.. సత్య మాత్రం ఒప్పుకోదు. మరి గెలిచి చూపించు నీకు దమ్ముంటే అని క్రిష్ రెచ్చగొడతాడు. దానికి సత్య తనిచ్చిన ఫామ్ ని చింపేసి నేను ఎలక్షన్లో పోటీకి నిలబడతాను మావయ్య అని చాలెంజ్ చేసి వెళ్తుంది.. క్రిష్ తెలివిగా సత్యను ఎన్నికల్లో నిలబడేలా చేస్తాడు. ఉదయం లేవగానే చేయమని జయమ్మ సలహా అడుగుతుంది సత్య. బైరవి ని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆలోచించాలని జయమ్మ అంటుంది. అలాగే జయమ్మ సత్య కలిసి అదిరిపోయే ప్లాన్ వేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సత్య జయమ్మని ఒక ప్లాన్ అడుగుతుంది భైరవికి ఎలాగైనా తిక్క కుదుర్చాలి నా దారిలోకి తెచ్చుకోవాలని ఏదైనా ప్లాన్ చెప్పమని సలహా అడుగుతుంది. జయమ్మ సత్య ఇద్దరు కలిసి భైరవిలో భయాన్ని కలిగిస్తారు. ముందుగా బైరవికి పాలు విరిగిపోతే అపశకనమని జయం అంటుంది. ఇక నెత్తి పైన బల్లి పడితే మహా పాపమని జయమ్మ సత్య ఇద్దరు బైరవి లో ఆందోళన కలిగిస్తారు. తాలిగండం మావయ్య గారికి ఏమవుతుందని సత్య ఇంకా స్టాప్ భయపెడుతుంది. దానికి జయమా బల్లి నెత్తిన పడితే బల్లి శాస్త్రం ప్రకారం ఏదో ఒక పరిహారం ఉంటుంది వెంటనే మనము పంతుల్ని పిలిచి ఆ పరిహారం ఏంటో కనుక్కుందామని అంటుంది. సత్య బల్లి ప్లాన్ క్రిష్ బయట నుంచి చూస్తాడు. నిజంగానే బల్లి పడిందని సత్యని అడుగుతాడు. అవును నిజంగానే పడింది నీకెందుకు అనుమానం వచ్చింది అని సత్య అడుగుతుంది. అదేం లేదు నేను ఒక బల్లిని చాలా బాగుంది అని కొనుక్కొని వచ్చాను అని క్రిష్ కావాలనే సత్యకు హింట్ ఇస్తాడు.
ఇక కొంపతీసి నా ప్లాన్ ఏమైనా తెలిసిపోయిందని సత్య టెన్షన్ పడుతుంది. అప్పుడే పంతులు వస్తాడు. బల్లి శాస్త్రం ప్రకారం మృత్యుంజయ హోమం చేస్తే చాలా మంచిది అని పంతులు చెప్తాడు. మహదేవయ్యను టెన్షన్ పెడుతుంది భైరవి.. అయ్యో పెనిమిటి నాకు తాలికొండమ్మ మీరు లేకుండా నేను అసలు ఊహించుకోలేను అనేసి ఏదేదో అంటుంది దానికి కోపంతో మహదేవ ఆ మృత్యుంజయ హోమం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక అంతే కాదమ్మా ఇందులో ఒక చిక్కు ఉందని పంతులు చెప్తాడు.. అదేంటి పంతులుగారు ఇంకా ఏదైనా సమస్య ఉందా అని భైరవి అడుగుతుంది. సమస్య కాదమ్మా ఈ హోమం తర్వాత మీరు ఇంట్లోని ఆడవాళ్ళ కోరికలు తీర్చాలని అంటాడు. అదేం పెద్ద భాగ్యం కాదు అలానే పంతులుగారు మీరు ముందు హోమం చేయించండి ఈ బల్లి గురించి నాకు టెన్షన్ పట్టుకుంది. ఎలాగైనా ముందు తొలగిపోతే చాలు వాళ్ళ కోరికల్ని తీరుస్తానని భైరవి భరోసా ఇస్తుంది.
అటు హర్ష సంధ్యలో ఏదో మార్పు వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాడు. సంధ్య ప్రవర్తన ఈమధ్య అసలు బాగోలేదని సత్యకు ఎప్పుడు సపోర్ట్ చేసే సంధ్య ఇప్పుడు ఏది చెప్పినా కానీ వద్దని వాదిస్తుంది అంటూ హర్ష అంటారు. దానికి నందిని కూడా అవును మీరు చెప్పింది నిజమే ఏదో జరుగుతుంది అని అనగానే అప్పుడే సంధ్య అక్కడికి వస్తుంది.. సత్యకు ఇంకా నామినేషన్ లో సంతకం పెట్టడానికి సపోర్ట్ చేయడానికి కొంతమంది కావాలి అని విశాలాక్షి సంధ్యతో ఉంటుంది.. నేను ఆల్రెడీ సత్యకుమాటి ఇచ్చేశాను సత్యకు సపోర్ట్ చేయాల్సిందే నా మాటని కాదనే వాళ్ళు ఎవరు ఉండరని అంటుంది. దానికి సంధ్యా షాక్ అవుతుంది. ఇక భైరవి ఇంట్లో మృత్యుంజయ హోమం చేయడానికి మహదేవయ్య అన్ని ఏర్పాట్లు చేస్తాడు.. హోమం అయితే పూర్తవుతుంది ఇక భైరవి ఎవరికి ఏం కావాలో కోరికలు కోరుకోండి అని అంటుంది. జయమ్మ నాకు ఉత్తర రామాయణం కావాలి అని అడిగితే, ఉత్తర రామాయణం ఏంది దాంతోపాటు దక్షిణం తూర్పు పడమర రామాయణంలో కూడా కొనిస్తానని అంటుంది. దానికి జయమ్మ బైరవని తిడుతుంది. అనేది ఒకటే ఉంటుంది అన్ని రామాయణాలు ఉండవే అనేసి అరుస్తుంది. ఇక రేణుక నాకు ఒక మంచి కంచి పట్టుచీర కావాలని కోరుకుంటుంది. సత్య మాత్రం నామినేషన్స్ లో సంతకం పెట్టడానికి నాకు ఒక మనిషి కావాలి మీ సంతకం నాకు కావాలని అడుగుతుంది అది విన్న భైరవి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భైరవి సంతకం పెడుతుందా లేదా అన్నది చూడాలి.. చక్రవర్తి సత్యకు సపోర్ట్ చేస్తాడా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాల్సి ఉంది..