Satyabhama Today Episode January 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇక క్రిష్ మాట్లాడడానికి సత్య ప్రయత్నిస్తుంది. క్రిష్ మాత్రం మౌనంగా ఉంటాడు. ఇక బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే సత్య బెడ్ ని సరి చేస్తూ ఉంటుంది. క్రిష్ రాగానే సత్య సాంబార్ చాలా బాగా కుదిరింది కానీ నువ్వు మిస్ అవుతున్నావ్ అది గమనించి క్రిష్ అనేసి అంటుంది.. మీకోసం సాంబార్ అన్నం కలిపి తీసుకొచ్చాను అనేసి అనగానే క్రిష్ నాతో మాట్లాడొద్దు అని అంటాడు. ఇక క్రిస్ తో గొడవకు దిగుతుంది సత్య.. కానీ క్రిష్ మాత్రం సత్యకు లొంగడు. సత్య మాత్రం క్రిష్ ని ఎక్కడ తగ్గకుండా మాటలతో కట్టిపడేస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత అని ముగ్గులోకి దించేస్తుంది మొత్తానికి క్రిష్ మెల్ట్ అయ్యి సత్య దారిలోకి వచ్చేస్తాడు. ఇద్దరి మధ్య కాసేపు గొడవలు తగ్గిపోతాయి. ఏదైనా గొడవలు ఉంటే గది బయట చూసుకుందాం గదిలోపల మాత్రం మొగుడు పెళ్ళాలుగా ఉందామని అంటుంది. .. విశ్వనాథం ఇంటిని కబ్జా చేసిన వ్యక్తి కనిపిస్తే అతనితో మాట్లాడాలని నందిని అక్కడికి వెళ్తుంది. అతనితో రివర్స్లో అడిగానని అనుకుంటుంది. దాంతో మహదేవయ్య ప్లాన్ గురించి మొత్తం నిజం చెప్తాడు ఆరోజు దొంగ డాక్యుమెంట్స్ చేయించామని వాటిని తీసుకొని వాళ్ల దగ్గరికి వెళ్లి అవి నిజమే నేను నమ్మేలా చేయాలని అడుగుతాడు. ఆ తర్వాత ఆయన డబ్బులు ఇచ్చి ఆ ఇంటిని కొన్నట్టు నాటకం ఆడాలని చెప్పాడు మొత్తం అనుకున్నది అనుకున్నట్లయితే చేస్తాడు అసలు అంత బాగా రావడానికి కారణం మహదేవయ్య నటన అని నిజం చెప్తాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నట్లు మీడియాతో ప్రకటిస్తుంది. మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారని మీడియా వాళ్ళు అడిగితే నాకు అధికారం కావాలి అధికారం ఉంటేనే నేను పదిమందికి న్యాయం చేయగలను అని అనుకుంటున్నాను అందుకే మీడియా వరకు ఎమ్మెల్యేగా అవ్వాలని ప్రకటిస్తున్నాను అనేసి అంటుంది. ఇక మహదేవయ్యను అడిగితే మా ఇంటి నుంచి మరొకరు పోటీకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి మహదేవయ్య అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నందిని ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తుంది. టీవీలో సత్య పోటీ చేయబోతున్నట్టు ప్రకటిస్తుంది అది విన్న విశ్వనాథ కుటుంబం అంతా షాక్ అవుతుంది. అసలు సత్య ఎందుకిలా చేస్తుందని మాట్లాడుకుంటారు. కానీ నందిని మాత్రం సత్యకు సపోర్ట్ చేస్తుంది. మాకన్నా ఎక్కువగా మీ నాన్న గురించి నీకే తెలుసు మరి ఎందుకు నువ్వు సత్యకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావ్ అనేసి హర్ష అంటాడు. ఎలక్షన్లో పోటీ ఎవరైనా చేయొచ్చు తిక్క కుదిరితే నేను కూడా మా బాపుకి పోటీగా నిలుస్తాను అనేసి అంటుంది. అటు టెన్షన్ పడుతూ ఉంటుంది సత్తికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి ఏమంటుందో అంటే వినేదే అయితే ఎప్పుడో వినేది మన చేయి దాటి పోయింది విశాలాక్షి అని అంటాడు. ఇక సత్యా పోటీలో నిలబడుతున్న విషయం నరసింహ తెలుసుకొని సంబర్ పడిపోతాడు. మహదేవయ్యకు తన ఇంటి నుంచి పోటీ రాబోతుంది ఇది కదా మజా అంటే అని గంతులు వేస్తాడు.
ఇక మహదేవయ్యకు పార్టీ ఇంచార్జ్ ఫోన్ చేస్తాడు. మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి నీ కోడలు నీమీద పోటీకి దిగుతుందా అది ఎంతవరకు నువ్వే ఆలోచించు ఇంట్లో వాళ్లే పోటీ దిగితే ఇక జనాలు ఏం నమ్ముతారు ఓట్లు ఎం పడతాయి ఇది నువ్వు తగ్గించుకోకపోతే నీకే నష్టం అనేసి హెచ్చరిస్తాడు. ఏదైనా మనసులో తీరని కోరికలు ఉన్నాయేమో ఆ కోరికలను తీర్చు తన ఎలక్షన్ గురించి విరమించుకుంటుంది అనేసి సలహా ఇస్తాడు. ఇది కూడా నిజమే. క్రిష్ కి నేను తండ్రి కాదన్న విషయాన్ని సత్యము నందు ఒప్పుకోలేమో లేకున్నా అంటే ఏ కు మేకై కూర్చుంటుంది కదా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. భైరవి అక్కడికి వచ్చి తన మనసులో మాట విన్నట్లు చెబుతుంది అది విన్నా మహదేవయ్య షాక్ అవుతాడు. ఆ సత్య మీద కన్నెర చేస్తే కామ్ గా ఉంటుంది కానీ నువ్వు అలా చేయట్లేదు పార్టీ ఇంచార్జ్ కదా ఇప్పుడు ఫోన్ చేసింది రేపు ఇంకేది చేస్తుందో అనేసి అంటాడు.
సత్య క్రిష్ కోసం గదిలో వెయిట్ చేస్తూ ఉంటుంది. తలలో పూలతో తెల్లచీరతో రెడీగా ఉంటుంది. సత్యను చూసిన క్రిష్ మెల్ట్ అయిపోతాడు.. ఎలాగైనా దీనికి లొంగకూడదు అనేసి అనుకుంటాడు కానీ కంట్రోల్ చేసుకోలేక బయటకు వెళ్ళిపోతాడు. జయమ్మ దగ్గర కూర్చొని నాకు భగవద్గీత శ్లోకాలు చెప్పు అనేసి ఏదేదో మాట్లాడుతాడు. ఇక సత్యా కృష్ణ బలవంతంగా లోపలికి తీసుకొని వెళుతుంది. గది బయట వరకే మనము గొడవపడతాం గదిలోపల మొగుడు పెళ్ళాలుగా ఉందామనేసి అంటుంది. ఇక క్రిష్ ని కన్విస్ట్ చేసి లొంగ తీసుకుంటుంది దాంతో క్రిష్ మెల్ట్ అయిపోయే సత్యకు లాక్ అయిపోతాడు. తర్వాత రోజు ఉదయం సత్య కాఫీ తీసుకొచ్చి భైరవికి మహదేవయ్యకు ఇస్తుంది. మహదేవయ్య తన మనిషిని పిలిచి నామినేషన్ కి టైం అయింది ఎలా చేయాలా అనేది అడుగుతాడు. నువ్వు చెప్పు చిన్న కోడలా నువ్వెలా వెళ్లి నామినేషన్ చేస్తావంటే నాకు అంత ఆడంబరాలు అవసరం లేదు అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో నందిని శేషుని తీసుకొని మహదేవయ్య ఇంటికి వస్తుంది. మహదేవయ్య గురించి నిజం చెప్పమని అతనితో అడుగుతుంది.. ఏం జరుగుతుందో చూడాలి..