Satyabhama Today Episode January 21 st : నిన్నటి ఎపిసోడ్ లో… సత్యకు రుద్ర సపోర్ట్ చెయ్యడం చూసి అందరూ షాక్ అవుతారు. రుద్ర నామినేషన్స్ ఫామ్ లో సంతకం పెట్టేస్తాడు. పదిమంది సంతకం పెట్టడంతో సత్యకు నామినేషన్స్ లో సపోర్ట్ దొరుకుతుంది. చూసావా అమ్మ పుట్టింటి వాళ్లు సపోర్ట్ గా ఉంటే ఎంత బాగుందో అని అంటుంది. సంధ్య రాలేదని మీరు తనని తిట్టొద్దు తనని ఏమీ అనద్దు అని సత్య అంటుంది. వస్తానని చెప్పి మాట ఇచ్చింది కానీ అబద్ధం చెప్పి తప్పించుకుంది ఏమీ అనకుండా ఎలా ఉంటామని విశాలాక్షి అంటుంది. కానీ సత్య మాత్రం సంధ్య ఏమనుకుంటుందో కానీ ఎందుకు భయపడుతుందో అందుకు కారణం ఏంటో నేను తెలుసుకుంటానని అంటుంది. కానీ సత్య నేను తెలుసుకుంటాను నువ్వేం అడగొద్దు అంటుంది. ఇక రుద్ర సంతకం పెట్టడంపై భైరవి కోపంగా ఉంటుంది. నామినేషన్స్ పూర్తయింది కదా ఇక సంబరాలు చేసుకోవాలి పార్టీ చేసుకుందాం రండి అని నందిని బయట బాంబులు కలిసి ధూమ్ ధామ్ గా సందడి చేస్తారు. అది చూసిన క్రిష్ దూరంగా సంతోష పడతాడు. నామినేషన్స్ లో సంతకం పెట్టడానికి మీ మీ అన్నయ్యకి చేసావని అర్థమైంది ఏం చేస్తావో చెప్పొచ్చు కదా అని సత్య అడుగుతుంది. క్రిష్ మాత్రం నీకు నామినేషన్స్ అయితే పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు ఆ పని అని చెప్పు అంటాడు. కానీ సత్య మాత్రం నాకు నువ్వే హెల్ప్ చేశావని నీ నోటితోనే చెప్పిస్తాను అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అదృశ్య శక్తి ఎవరిని కృష్ణ ఒక ఆట ఆడుకుంటుంది సత్య. నాకు రాత్రి ఎంతగా నిద్రపోవాలనుకున్న నిద్ర పట్టలేదు ఆదృశ శక్తి ఎవరో తెలుసుకోవాలని నాకు వెనుక నుండి ఇంత సపోర్ట్ చేసిన అతన్ని నేను చూడాలని మదనపడ్డాను. అతను నాకు మెసేజ్ చేశాడు. దాంతోనే నువ్వు ఊపిరి పీల్చుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడని అతనితో మాట్లాడుతుంది కానీ క్రిష్ అవతలి ఎవరూ లేరని అనుకుంటున్నాడు.. సత్య అవతల మాట్లాడే వాళ్ళు ఎవరో వినాలని స్పీకర్ ఆన్ చేసి వింటుంది. ఆ మాటలు విన్న క్రిష్ షాక్ అవుతాడు. ఇక తర్వాత క్రిష్ ఎక్కడుంటే అక్కడ సత్య ఈ విషయాన్ని గురించి గుచ్చి గుచ్చి చెప్తూ కృషికి కోపాన్ని తెప్పిస్తుంది. ఉదయం కూడా క్రిష్ దగ్గర అతని గురించి చెప్తూ క్రిష్ కి కోపాన్ని తెప్పిస్తుంది..
ఇక నందినికి సత్య ఫోన్ చేసి మాట్లాడుతుంది. అదృశ శక్తి ఎవరో కాదు మీ అన్నయ్య నాకు అర్థం అయిపోయింది అది ఆయన నోటి నుంచే బయటపెట్టేయాలి అని అంటుంది నువ్వు హింటిచ్చావు కదా వదినా ఇక అల్లేసుకుంటానని అని అంటుంది. నువ్వు రెడీ అవ్వు మనం పనుంది బయటికి వెళ్లాలి అని నందిని సత్యత అంటుంది. అప్పుడే రూమ్ లోకి హర్ష వస్తాడు. ఏంటో ఈరోజు ఈ మధ్య మేడంగారులో హుషారు ఎక్కువైంది అని అంటాడు. ఎమ్మెల్యే మరదలు అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని నందిని అంటుంది. దానికి హర్ష అప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్లు ఫిక్స్ అయిపోదు ఇంకా చాలా ఉంది అని అనగానే అయిపోతుంది పక్కా అని నందిని అంటుంది. ఇక క్రిష్ ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం హర్షతో అంటుంది. ఈ విషయాన్ని నువ్వు ఎక్కడైనా చెప్పావంటే బెడ్ రూమ్ లోకి అలో లేదు బయట సోఫాలని పడుకోవాల్సి వస్తుంది అనేసి అంటుంది నందిని..
నేనెందుకు చెప్తాను మా బావ సపోర్ట్ చేస్తున్నాడంటే నాకు ఇంకా హ్యాపీ నే కదా అనేసి అంటాడు హర్ష.. ఇక మహదేవయ్యా నా ప్రచారం ఎలా జరుగుతుంది రా అని తన మనుషులని అడుగుతాడు. మేము ప్రచారం బాగానే చేస్తున్నామయ్యా కానీ ఎక్కడికి వెళ్లినా ఒకటే మాట వినిపిస్తుంది ఇంట్లో ఇద్దరు మనుషులు పోటీ పడుతున్నారని ఎవరికి ఓటేయాలంటూ అడుగుతున్నారని అంటారు. దానికి మహదేవయ్య లోపలికి వెళ్లి రెండు బాక్స్లు నిండా డబ్బులు తీసుకుని ఇస్తాడు.. సమాధానం మాటలతో కాదు నోట్లతోనే చెప్పండి ప్రచారంలో లోటుపాట్లు రాకుండా చూసుకోండి అనేసి అంటాడు. ఇక క్రిష్ రుద్ర సత్యల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలవుతుంది. అప్పుడే నందిని ఎంట్రీ ఇస్తుంది. భైరవి నువ్వు కూడా నీ బాబుని వద్ద నిలబడి సపోర్ట్ చేయాలి. నీ అత్తింటి వాళ్లను కూడా మీ బాబుకి సపోర్ట్ చేయమని చెప్పరా అదే అని భైరవి అడుగుతుంది.. కానీ నందిని మాత్రం సత్యకే సపోర్ట్ చేస్తానని మొండిగా ఉంటుంది. వదిన మనం బయట ఫోటోషూట్ ఉంది నువ్వు వెళ్లి రెడీగా అనేసి అనగానే కృషి కూడా బాపు నువ్వు కూడా వెళ్లి రెడీగా ఫోటోషూట్ నీకు కూడా ఉంది అనేసి అంటాడు. లోపలికి వెళ్ళగానే సత్య ఏ చీర కట్టుకోవాలని కృష్ణుని అడుగుతుంది. అదృశ్య శక్తిని కలవాలి ఫోటోషూట్ అయిన తర్వాత వెంటనే వెళ్లి అతని కలిసి మాట్లాడితేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుందని కృష్ణతో అంటుంది సత్య.. దానికి కోపంతో రగిలిపోతాడు క్రిష్. మొబైల్ ని దొంగతనం చేసి బయటికి వెళ్లిపోతాడు..
సత్య ఫోన్ తీసుకొని ఆ అదృశ్య శక్తి ఎవరు అని ఫోన్ నెంబర్ ని చెక్ చేస్తాడు. ఫోన్లో కూడా అదృశ్య శక్తి అని పెట్టుకోవడం చూసి షాక్ అవుతాడు అతనికి వెంటనే ఫోన్ చేస్తాడు. అలా అయిన నందిని మా చిన్నాన్న ఫోన్ చేస్తున్నాడని అతనితో అదృశ్య శక్తి లాగా మాట్లాడుతుంది. క్రిష్ అతనిపై కోపంతో తప్పు చేస్తున్నామని అరుస్తాడు. నందిని సత్య ఇద్దరు మాట్లాడుకుంటారు. మా చిన్నన్నకు నువ్వంటే ఎంత ప్రేమ అర్థం అయిందా అని నందిని అంటుంది. ఆ ప్రేమను వదులుకోలేక కదా ఇంతగా నేను బాధపడుతున్నానని సత్య అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..