Indiramma Housing Scheme: సూపర్ సిక్స్ పథకాలు వేగంగా అమలు చేసేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది రేవంత్ సర్కార్. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు వివిధ పథకాలకు అప్లికేషన్లు స్వీకరిస్తోంది. నాలుగు స్కీములకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకాలు ఉన్నాయి.
రేవంత్ సర్కార్ నాలుగు స్కీమ్‌లకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనవరి 21 నుంచి 24 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తోంది. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ, లబ్దిదారుల ఎంపికను స్వయంగా పరిశీలించనున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.
గ్రామ సభల్లోనే పథకాల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. దానివల్ల ప్రజలకు ఎలాంటి సమస్య ఉండదని భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు కోసం ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తి చేశారు. అర్హుల జాబితాలు ఆయా గ్రామాలు, వార్డులకు చేరాయి. కొన్ని చోట్లయితే తమ పేర్లు లేవని అర్హులు ఆందోళన చెందడంతో వారికి మరో ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం.
కేవలం కొత్త దరఖాస్తులు మాత్రమే కాకుండా, రేషన్ కార్డుల విషయంలో కొత్తగా పేర్లు చేర్చడానికి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈనెల 26 నుంచి నాలుగు స్కీమ్‌లను ప్రబుత్వం ఒకేసారి ప్రారంభిస్తోంది. దీంతో అర్హుల ఎంపికలో అధికారులు తనమునకలయ్యారు.
ALSO READ: కాళేశ్వరం కమీషన్లు.. అందరికీ ముడుపులు, రేపో మాపో నోటీసులు
బీఆర్ఎస్ హయాంలో రైతు బందు స్కీమ్, గుట్టలు, క్వారీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగు యోగ్యం కాని భూములకు ఇచ్చారు. ఇప్పుడు వాటిని తొలగించినుంది ప్రభుత్వం. అర్హులైన లబ్దిదారులకు ఆయా పథకాలను వర్తింపజేయనున్నారు. దీనిపై జనవరి 16 నుంచి 19 వరకు అధికారులు ప్రతీ ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో కొత్త అప్లికేషన్లతోపాటు ఇప్పటికే రూపొందించిన జాబితాలో అనర్హులను తొలగించనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అక్కడక్కడ చిక్కులు సైతం లేకపోలేదు. గతంలో ఉపాధి హామీ కూలీల ఆదార్ నెంబర్‌లో జరిగిన పొరపాట్లను సవరించనున్నారు. దీనికి సంబంధించి ఆర్డీవోలను ఇప్పటికే మంత్రులు ఆదేశించారు కూడా.