BigTV English

Satyabhama Today Episode : సత్య ఫోటోలను చూసి మహాదేవయ్య షాక్.. ప్రచారంలో జోష్ పెంచిన క్రిష్..

Satyabhama Today Episode : సత్య ఫోటోలను చూసి మహాదేవయ్య షాక్.. ప్రచారంలో జోష్ పెంచిన క్రిష్..

Satyabhama Today Episode January 23 rd: నిన్నటి ఎపిసోడ్ లో… ప్రచారం కోసం మహాదేవయ్య అంతా సిద్ధం చేస్తాడు. ఇక నందిని ఇంటికి వస్తుంది. అందరూ నిన్ను వెనక్కి తోయాలని చూస్తున్నారు వదిన చూశావా నువ్వు ఎలాంటి ఇంట్లో ఉన్నావో.. సరేగాని నీకు ఫోటో షూట్ ఉంది పోస్టర్ల కోసం మనం ఫోటోషూట్ చేద్దాం రా అనేసి అంటుంది నందిని.. నువ్వు వెళ్లి జల్ది రెడీ అయ్యారా పో ఫోటోషూట్ మంచిగా ఉండాలని నందిని అంటుంది. క్రిష్ కూడా బాబు నీకు కూడా ఫోటోషూట్ ఉంది. ఆ అరేంజ్మెంట్లన్నీ చేశాను నువ్వు కూడా ఫోటోలు దిగాలి రెడీ అయ్యారా.. ఇక సత్య ఫోన్ తీసుకొని ఆ అదృశ్య శక్తి ఎవరు అని ఫోన్ నెంబర్ ని చెక్ చేస్తాడు. ఫోన్లో కూడా అదృశ్య శక్తి అని పెట్టుకోవడం చూసి షాక్ అవుతాడు అతనికి వెంటనే ఫోన్ చేస్తాడు. అలా అయిన నందిని మా చిన్నాన్న ఫోన్ చేస్తున్నాడని అతనితో అదృశ్య శక్తి లాగా మాట్లాడుతుంది. క్రిష్ అతనిపై కోపంతో తప్పు చేస్తున్నామని అరుస్తాడు. నందిని సత్య ఇద్దరు మాట్లాడుకుంటారు. మా చిన్నన్నకు నువ్వంటే ఎంత ప్రేమ అర్థం అయిందా అని నందిని అంటుంది. ఆ ప్రేమను వదులుకోలేక కదా ఇంతగా నేను బాధపడుతున్నానని సత్య అంటుంది.. మహదేవయ్య ఫోటోషూట్ కోసం క్రిష్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. సత్య కూడా ఫోటోషూట్ చేయించుకుంటుంది. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నిన్న ఫోటోషూట్ చేసిన ఫోటోలను ఈరోజు ఫోటోగ్రాఫర్ తెచ్చి మహదేవయ్యకి ఇస్తారు. ఆ ఫోటోలను చూసి మహదేవయ్యా కుటుంబం మురిసిపోతుంది. భైరవి మీ పెద్దోడు చూసారా అత్తమ్మ ఎంత అందంగా ఉన్నారు? సింహం లెక్క ఉన్నారని భర్తను చూసి మురిసిపోతుంది. ఇక మధ్యలో సత్య ఫోటోలు రావడంతో మహదేవయ్య షాక్ అవుతాడు.. రేణుక ఫోటోలు తీసుకుని చెల్లి ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటే అవును అక్క ఏది ఇలా విడిపోనా చూస్తారు. ఫోటోలను చూసి విసిరేస్తాడు అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. ఏమైంది బాబు ఎందుకు ఫోటోలు ఎక్కడ పడేసావంటే ఆ ఫోటోగ్రాఫర్ నీ మనిషే కదా అని బైరవే అంటుంది. నా బామ్మర్ది ఏం కాదు అనేసి అంటాడు. ఏమైంది అంటే మీ బాబు ఫోటోలు కొన్ని పెట్టి నీ పెళ్ళాం ఫోటోలు చాలా తీశాడు కదా అనేసి అంటుంది భైరవి. ఏదైనా క్రిష్ షాక్ అవుతాడు.. విని సెపరేట్ గా పంపించమంటే రెండు కలిపి పంపించాడా అడ్డంగా ఇరికించాడుగా అనేసి క్రిష్ అనుకుంటాడు. దానికి భైరవి నువ్వు నీ పెళ్ళాం సత్యనుసపోర్ట్ చేస్తున్నావా? నీ భార్యను సపోర్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది.

నందిని కి ఫోటోలు తీయడం రావట్లే ఫోటోగ్రాఫర్ అని రెండు ఫోటోలు తీయమని చెప్తే తీశాడు దానికి ఎందుకు ఇంతగానం చేస్తున్నారు ఎమ్మెల్యేగా గెల్సిపోయినట్లు ఇంతగానం చేస్తున్నారేంటి అని క్రిష్ అంటాడు. ఫోటోలు ఎంత బాగున్నాయో చూసారా పులిలెక్కున్నాయి ఈ ఫోటోలోనే కటౌట్ లేపించాలనే అని అక్కడినుంచి మెల్లగా జారుకుంటాడు. ఇక ప్రచారం చేయడానికి సత్యాన్ని ఉదయం లేవగానే బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్లినా సత్యకు నిరాశ ఎదురవుతుంది ఎవరు ఓట్లు వేయడానికి ముందుకు రారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము మహదేవయ్యకే ఓటు వేస్తామని చెప్తారు అలా రెండు రోజులు ప్రచారంలో సత్య నందిని కాళ్ళు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతుంది. సత్య నిరాశ పడితే వెనక్కి తగ్గిపోతుంది నిరాశ పడగొద్దు ఇన్ డైరెక్ట్ గా రెచ్చగొట్టాలని క్రిష్ సత్యను ఇంకా రెచ్చగొడతాడు.. సత్య రేపటి నుంచి గెలుపు నాదే అన్నట్టు ప్రచారం చేస్తానని క్రిష్ తో చాలెంజ్ చేస్తుంది.


మరోవైపు సంధ్య సంజయ్ దగ్గర సత్యకు ద్రోహం చేశానని ఏడుస్తుంది. మా అక్కంటే నాకు చాలా ప్రాణం కానీ ఈ విషయంలో మాత్రం మా అక్కని వెనకేసుకో రాలేదు. నేను మా అక్కని మోసం చేశాను నాకు అన్ని మాకే మా అక్క చెప్పినట్టే నేను చేసే దాన్ని నాకు ఇన్స్పిరేషన్ కూడా మా అక్క అని సంజయ్ తో చెప్పి ఏడుస్తుంది. పెళ్లయిన తర్వాత నువ్వు కూడా అత్తగారింటిని లెక్క చేయకుండా ఉంటావా అత్తమామల్ని పూచిక పుల్లలాగా తీసేస్తావా అని అంటే లేదు లేదు మన ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను అనేసి సంధ్యను మోటివేట్ చేసి మళ్లీ పంపిస్తాడు సంజయ్.. ఇక మూడో రోజు సత్య ప్రచారం చేస్తూ ఉంటుంది అదే వీధిలోకి మహదేవయ్యకూడా ప్రచారానికి వస్తారు. అక్కడ ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతుంటే సత్య పట్టుకొని ఆవిడని కూర్చోబెట్టి ఆవిడ పనిని చేస్తుంది మీడియా వస్తే ఇది నేను సమాజ సేవగా చేస్తున్నాను తప్ప ప్రచారంలో భాగం కాదని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×