Balakrishna.. నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna), ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby kolli ) దర్శకత్వంలో నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి బాలయ్య సినీ కెరియర్ లోనే రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్(Pragya jaiswal), శ్రద్ధ శ్రీనాథ్(Shraddha Srinath ), చాందిని చౌదరి (Chandini chowdhary ), ఊర్వశీ రౌతేల (Urvashi rautela ) కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ (SS. Thaman) ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా అటు మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా సెన్సేషన్ హిట్ కొట్టింది.
నందమూరి ఇంటిపేరు గట్టిగా ట్రై చేస్తా..
ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సినిమా బృందంతో పాటు పలువురు అభిమానులు విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి నందమూరి ఫ్యామిలీ గురించి అలాగే అఖండ సినిమా గురించి మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. బాబీ కొల్లి మాట్లాడుతూ.. “నందమూరి తమన్ అన్న.. ఎంతో అదృష్టం ఉండాలి అంత పవర్ఫుల్ ఇంటిపేరును స్వయంగా బాలయ్య గారే నామకరణం చేశారంటే చిన్న విషయం కాదు. వస్తా అన్న నేను కూడా రెండు మూడు సినిమాలు పడతాయి. కచ్చితంగా ఇంటిపేరు నేను కూడా ట్రై చేస్తాను. మనిద్దరం ఎంతో గొడవపడ్డాము, అలిగాము. దానికి కారణం కూడా నువ్వే.. మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించావు. అందులో నా స్వార్థం ఏంటంటే, మిగతా వాటికంటే నా సినిమా ఇంకా బెస్ట్ గా ఉండాలి అని అనుకున్నాను.
అఖండ సినిమా చూస్తూ నిద్రపోయాను..
అందరికీ నిజంగా చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూటింగ్ నుంచి సెకండ్ షోకి అఖండకి వెళ్ళాను. బాలయ్య బాబు సినిమా మిస్ అవ్వకూడదని వెళ్లాను. రాత్రి 11:10 షో కి తీసుకోవడం జరిగింది. వెళ్లాను సీట్లో కూర్చున్నాను.. సినిమా వస్తోంది.. విజిల్స్ వేస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాము. పొద్దున్నే ఐదింటికి లేచి పనిచేయడం వల్లే ఏమో ఎక్కడో తెలియని సందర్భంలో కునుకు పట్టింది అంటూ బాలయ్య ముందే అఖండ సినిమా చూస్తూ నిద్రపోయానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు బాబీ. ఈ విషయం విని బాలకృష్ణ కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సరి చేసుకుంటూ.. భం అఖండ అంటూ ఒక్కసారిగా బిజిఎం గట్టిగా పడింది దెబ్బకు నేను మేల్కొన్నాను. అప్పటినుంచి నేను మేల్కొనే ఉన్నాను. ఇదంతా నీ వల్లే థాంక్యు.. మన జర్నీ ఇలాగే కొనసాగుతుంది తప్పకుండా నేను మీతోనే పనిచేస్తాను అంటూ తమన్ గురించి డైరెక్టర్ బాబీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాబీ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక డాకు మహారాజ్ సినిమాను శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు.