Satyabhama Today Episode January 25th: నిన్నటి ఎపిసోడ్ లో… సత్యఎంతగా ప్రచారం చేస్తున్న ఆమెకు ఓటు వెయ్యడానికి ఎవ్వరు ఆసక్తి చూపించరు.. నందిని ఇద్దరు ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో సత్య నందిని ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోతారు. ఎక్కడికి వెళ్లినా మహదేవయ్యకు భయపడి ఎవరు ఓటు వేయడానికి ముందుకు రారు. ఇక సత్యా ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే ఒక ఆవిడ కింద పడిపోతుంది. ఆవిడ పనిని పూర్తి చేస్తారు. సత్య రోడ్డు మొత్తం క్లీన్ చేస్తుంది అప్పుడు మీడియా వస్తే నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయలేదు ఒక మనిషి కోసం ఇలా చేశాను ఆవిడకి బాగలేదు నన్ను వదిలేయండి ఇది కవర్ చేయకండి అని సత్య అంటుంది. అటు మహాదేవయ్య కూడా సత్యను చూసి రోడ్లు ఊడవ్వడం మొదలు పెడతాడు..సత్య ఎలాగైనా సపోర్ట్ చేయాలి హైలెట్ చేయాలి ఇంత సైలెంట్ గా సత్య ప్రచారం చేస్తే ఓట్లు పడవని క్రిష్ మనసులోఅనుకుంటాడు. ఇక సత్యానందిని ఇంటికి వెళ్లిన తర్వాత ప్రచారంలో మనము ఇంకా జోరుని పెంచాలి ఇలా చేస్తే మనకు ఓట్లు రావు కనీసం జనాలు కూడా మనల్ని పట్టించుకోరని అంటుంది. ఇంట్లోని గుర్తుని బయట పెడితే అందరూ మనల్ని నమ్ముతారని నందిని అంటుంది. ఇంట్లో ఉంటూ మన వెనకాల మనమే గోతులు దవ్వుకోవడం మంచిది కాదు దానికి నేను అసలు ఒప్పుకోను ఓడిపోయిన పర్లేదు అని సత్య అంటుంది. రుద్ర మాట్లాడుకోవడం భైరవి వింటుంది. సత్య ప్రచారం చేయకుండా అంటే మనమే ముందుంటామని రుద్రా అనడంతో బైరవి ఎలాగైనా సత్యను ఇంట్లో నుంచి కదలకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇక సత్యా తన చెల్లి సంధ్య ప్రమాదంలో ఉందని భైరవితో చెప్పి బయటకు వస్తుంది. క్రిష్ ను తీసుకొని సంధ్య దగ్గరకు సత్య, నందిని వెళ్తారు.. ఇక పంకజం ఏంటమ్మా అలా పంపించేశారు అంటే అదేమీ ప్రచారాన్ని కాదు కదా తన చెల్లి కోసం వెళ్ళింది కదా ఏం కాదులే అంతలోపు నేను యాక్టింగ్ చేశాను కదా రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది భైరవి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ ను తీసుకొని బయటకు వెళ్లడానికి రెడీ అవుతారు. క్రిష్ మాత్రం చాలా స్లోగా కార్ డ్రైవ్ చేస్తూ సరదాగా ఉంటాడు. సత్య నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంత సరదాగా ఎలా ఉన్నావు అని అంటుంది. దానికి క్రిష్ ఆ ఫోన్ చేసింది నేనే అలా చేస్తే నువ్వు బయటికి వచ్చి నీ ప్రచారం చేసుకోవచ్చు కదా అని చేశానని అంటాడు. మా అమ్మ నిన్ను బ్లాక్ చేసింది నాటకం ఆడి ప్రచారంకి పోనివ్వకుండా అక్కడే ఉంటే ప్రచారం ఎవరు చేస్తారని జరంత సాయం చేశాను నాకు అన్యాయం చేయడం నచ్చదు అని క్రిష్ అంటాడు. సత్యానందిని ఇద్దరు బయట ప్రచారం చేయడానికి మొదలు పెడతారు. ముందుగా ఒక జామకాయల వ్యక్తిని ఓటు వెయ్యమని అడుగుతారు. చదువుకున్న దానిలాగా ఉన్నావ్ నీకెందుకు అమ్మ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఒక చెత్త లాంటివి వీటిని అలానే వదిలేయాలి లేకుంటే మాత్రం మనల్ని పట్టుకుని పీడిస్తాయని ఆయన ఉచిత సలహాలు ఇస్తాడు. బస్టాప్ లో ఉన్న ఆడపిల్లలు నేర్పించడానికి ఇద్దరు రౌడీలు వస్తారు. వాళ్ళని ఏడిపిస్తుంటే సత్య ఊరుకోకుండా వాళ్ళని కొట్టడానికి వెళుతుంది. రౌడీలని జతగొట్టి ఆడపిల్ల నేర్పిస్తే నేను అసలు ఊరుకోను అన్యాయం జరిగిందంటే నేను ఎంతకైనా తెగిస్తానని చెప్పి చెప్పు తీసుకొని కొడుతుంది. సత్య కొడుతున్న వీడియోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది అది చూసిన వాళ్ళందరూ ఇలాంటి అమ్మాయి ఎమ్మెల్యే అయితే మన ఊరికి మంచి జరుగుతుంది అమ్మాయిలకు న్యాయం జరుగుతుందని అందరూ అనుకుంటారు..
ప్రతి ఒక్కరూ సత్యకు సపోర్ట్ చేస్తూ ఓటు వేయాలని అనుకుంటారు. ఇక సత్యానందిని ప్రచారాన్ని మళ్లీ మొదలు పెడతారు. విశ్వనాథం ఇంట్లో ఆ వీడియోని చూసి విశ్వనాథం నాన్నమ్మ టెన్షన్ పడుతూ ఉంటారు. తన ప్రచారం ఏదో తన చేసుకోకుండా ఇలా ఈ లేనిపోనివి తల మీద వేసుకోవడం ఎందుకు రా అని విశ్వనాధంతో వాళ్ళ అమ్మ అంటుంది. ఇక విశాలాక్షి వచ్చి తన స్వాతంత్రం చూసుకోకుండా ప్రజలకు అమ్మాయిలకు న్యాయం చేయాలని అనుకుంది దాంతో తప్పేమీ లేదు సపోర్ట్ చేస్తుంది. ఇక హర్ష వచ్చి సత్యకు పాపులారీటి ఎంత బాగా పెరిగిపోయిందో తెలుసా అని అంటాడు. అంతా బాగానే ఉంది కానీ ఏదైనా చిక్కుల్లో పడుతుందేమోనని విశ్వనాథం అంటాడు. ఈ విషయాన్ని వెంటనే నందిని చెప్పాలని హర్ష కాల్ చేస్తాడు.. నందినికి ఈ విషయం చెప్తాడు నందిని సంతోషంతో సత్యకు ఈ విషయం చెప్పాలని వెళ్తుంది.. సత్యకు చెప్పగానే సత్య చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియోతో అయినా చాలామంది అమ్మాయిలు ధైర్యంగా ఉంటారని సత్య అనుకుంటుంది. ఇక సంధ్య బైక్ పై వెళ్లడం చూసి సత్య షాక్ అవుతుంది. ఇక్కడ తో ప్రచారం సరిపోతుందిలే అనేసి వెళ్ళిపోదామని అంటుంది.
ఇక సంధ్యకు సత్య కాల్ చేస్తుంది. సంజయ్ ని బైక్ ని పక్కకు కాపమని సత్య కాల్ చేస్తుందని చెప్తుంది. అబద్ధాలు కూడా చెప్తారని తెలుసు కదా ఇలా మేనేజ్ చేయలేవా నువ్వు అనిసంజయ్ అంటాడు. సరే నన్ను ఇంటిదగ్గర డ్రాప్ చెయ్ నేను అక్కకు ఫోన్ చేసి మాట్లాడుతానని భయపడుతుంది. ఇక క్రిష వీడియో చూసి ఎలాగైనా రిపోర్టర్ కి ఫోన్ చేసి ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్తానని అంటాడు. ఇంటికి వచ్చి ఫోన్ చేస్తుంది. బయట దారిలో కనిపించాడు ఇంటిదగ్గర డ్రాప్ చేస్తానంటే మీ బంధువు కదా వద్దనుకోలేక వచ్చాను అక్క అంతేనా అనేసి అంటుంది. ఎందుకైనా మంచిది పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి అతనితో కాస్త జాగ్రత్తగా ఉండు అనేసి సత్య అంటుంది. సత్య ఇంటికి రాగానే మీడియా వాళ్ళు అక్కడ ఉంటారు మీడియా వాళ్లకి ఇంటర్వ్యూ వస్తుంది సత్య. ఇద్దరు ధైర్యంగా ఉండాలని నా లక్ష్యం అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..