KA Paul: ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మలచుకుంటారు కొందరు నేతలు. అలాంటివారిలో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఒకరు. ఏ పార్టీ అయినా, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు.. చెప్పాల్సిన నాలుగు మీడియా ముందుకొచ్చి కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అలాంటి వారిలో కేఏ పాల్ ఒకరు.
పాల్ చెవిలో పడిన వార్త ఏమిటో తెలీదు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై దుమ్మెత్తిపోశారు. ఏకంగా కమ్యూనిటీ పేరుతో ఆయా నేతలను దుమ్ము దులిపేశారు. ఆనాడు చిరంజీవి, ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇద్దరు నేతలు పార్టీలకు ప్యాకేజ్ స్టార్ అయ్యారని మనసులోని మాట బయటపెట్టారు.
సిగ్గులేని వాళ్లు ‘డిప్యూటీ సీఎం గారి తాలూకా’ అని బోర్డు పెట్టుకుంటారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఏపీ టూర్‌కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా స్లోగన్స్ చేయాలంటూ మెసేజ్‌లు చేపిస్తున్నారని మండిపడ్డారు. ఆవేశంలో మాట్లాడిన కేఏ పాల్, కావాలంటే తన పార్టీలో జాయిన్ కావాలని సూచన చేశారు.
పదవి రాలేదని ప్రధాని కాళ్లపై పడుతున్నారని తెలియజేశారు పాల్. ఇదే క్రమంలో మరో మాట చెప్పారాయన. సీఎం చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో తన తప్పులను చంద్రబాబు మీదకు నెట్టేసి 2029లో సీఎం కావాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: వీఎస్ఆర్ సాయం.. రేసులో కిరణ్ కుమార్‌రెడ్డి, చిరంజీవి
కేవలం పదవుల కోసమే తప్ప, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన నేతలకు ఉన్నట్లు కనిపించలేదన్నారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాశాంతి చీఫ్. హోదా విషయాన్ని ఎందుకు అడగడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు చిరంజీవి అమ్మడుపోగా, ఇప్పుడేమో బీజేపీ వంతైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొద్దిరోజులుగా బీజేపీకి చిరంజీవి టచ్‌లోకి వెళ్తారంటూ వార్తలు వస్తున్నాయి. బీజేపీ హైకమాండ్‌కు ఆయన దగ్గరగా ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. ఈ క్రమంలో పాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పార్టీల్లో దుమారం రేపుతున్నాయి. ఆవేశంలో కేఏ పాల్ మాట్లాడినా, కొన్ని నిజాలు మాత్రం బయటపెడతారని అంటున్న నేతలు సైతం లేకపోలేదు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై KA పాల్ సంచలన వ్యాఖ్యలు
సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు
అప్పుడు చిరంజీవికి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడు
ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ లకి బానిసయ్యాడు
సిగ్గులేని వాళ్లు మాత్రమే " డిప్యూటీ సీఎం గారి తాలూకా " అని… pic.twitter.com/ptsedn60Gz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2025