BigTV English
Advertisement

Satyabhama Today Episode : సత్యకు అండగా క్రిష్.. నామినేషన్స్ ను అడ్డుకోవడానికి మహాదేవయ్య ప్లాన్..

Satyabhama Today Episode : సత్యకు అండగా క్రిష్.. నామినేషన్స్ ను అడ్డుకోవడానికి మహాదేవయ్య ప్లాన్..

Satyabhama Today Episode January 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యను ఎలాగైన ఆపాలని మహాదేవయ్య ప్లాన్ వేస్తాడు. క్రిష్ ను పూర్తిగా తన సెంటిమెంట్ తో లాక్ చేస్తాడు. అటు విశాలాక్షి భయంతో ఇంట్లో అందరిని కంట్రోల్ చేస్తుంది. సత్యకు సపోర్ట్ చెయ్యొద్దని అందరి దగ్గర మాట తీసుకుంటుంది. మనం సపోర్ట్ చెయ్యకుండా ఉంటేనే సత్య వెనక్కి తగ్గుకుండా ఉంటే సత్య మాట వింటుందని అంటుంది. ఇక దానికి నందిని నన్ను క్షమించండి అంటుంది. మా బాపుని కంట్రోల్ చేయాల్సింది వదిన ఒక్కటే ఆ ధైర్యం వదినకు మాత్రమే ఉంది అందుకే నేను వదినని సపోర్ట్ చేస్తున్నాను ఇక మీ ఇష్టం అనేసి అందరికీ చెప్పి వెళ్తుంది.. ఇక సత్యా ఉదయం లేవగానే మహదేవయ్య కాళ్ళు మొక్కి బయటకు రావడానికి వస్తుంది. ఎక్కడికి పోతున్నావ్ ఇంత పొద్దున్నే తయారైపోతున్నావని భైరవి అడిగితే నవగ్రహాల కోసం అనేసి మహాదేవయ్య అంటాడు. నవగ్రహాల అదేంటి అని అంటే 9 మంది నామినేషన్ చేయడానికి సంతకాలు పెట్టాలి కదా అందుకే వెళ్తుందని తన అనుచరులతో కలిసి మహదేవయ్య పరాచకాలు ఆడుతాడు. ఆ ప్రయత్నంలో లేవు నేను చేసుకుంటానులే మామయ్య అనేసి సత్య అంటుంది అంతలోపే క్రిష్ వచ్చి తన మనిషిని కొడతాడు పనోళ్ళ ముందు నా భార్యను తక్కువ చేసి మాట్లాడద్దు బాపు మన ఇంట్లో వాళ్ల గౌరవం మనమే తీస్తున్నామనేసి క్రిష్ అంటాడు. సత్య పుట్టింటికి రాగానే అందరు మౌనంగా ఉంటారు. సత్యకు సపోర్ట్ చెయ్యడానికి ఇంట్లో ఎవరు ముందుకురారు. దాంతో సత్యకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. సత్య ఒంటరిగా పోరాటం చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య న్యాయం చెయ్యాలంటే అధికారం ఉండాలని సత్య రోజు రోజుకు గట్టిగా అనుకుంటుంది. ఇక నామినేషన్ ఫామ్ లో సంతకాల కోసం పుట్టింటికి వచ్చిన సత్యకు చుక్కెదురు అవుతుంది. మీ అత్తింటి వాళ్ళ సపోర్ట్ లేకుండా నువ్వు ఇలా మొండిగా ఉండటం బాగోలేదని చెబుతారు. ఇక విశాలాక్షితో సహా ఇంట్లో వాళ్ళందరూ సత్యకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ముందు నీ భర్తని నీ మామని నీ దారికి తెచ్చుకో ఆ తర్వాత మేము నీ దారికొస్తామని విషయాలు అంటుంది. విశ్వనాథం కూడా భార్య మాటను కాదనలేక పోతాడు. అటు హర్ష కూడా చెల్లెలుకు సపోర్ట్ చేయడానికి ముందుకు రాడు. నందిని మాత్రం నా సపోర్ట్ నీకే వదినా ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. ఇంట్లో ఎవరు ముందుకు రాకపోవడంతో నిరాశపడుతుంది. నాకు ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా నా పుట్టింటి వాళ్ళు ఉన్నారని ధైర్యంతో నేను ముందుకు సాగేదాన్ని కానీ ఇప్పుడు నా పుట్టింటి వాళ్ళు నన్ను వదిలేసారని బాధపడలో లేకపోతే ఆనందపడాలో అర్థం కావట్లేదు అని సత్య బాధపడుతుంది. సరే అమ్మ మీరందరూ నన్ను ఆశీర్వదించండి నేను విజయం సాధించాలని నన్ను దీవించండి అని సత్య అడుగుతుంది. సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

క్రిష్ ఫ్రెండ్స్ వదినకు సపోర్ట్ చేస్తాడా లేకపోతే బాబుకు సపోర్ట్ చేస్తారని తేల్చుకోలేక పోతారు. అప్పుడే క్రిష్ వచ్చి ఇంట్లో జరుగుతున్న కిరికిరి గురించి చెప్తాడు. ఇటు ఇదంతా మాకెందుకు నువ్వే ఆలోచించుకున్న నువ్వు బాపుకి సపోర్ట్ చేస్తావో లేకపోతే వదినకు సపోర్ట్ చేస్తావో నీకు అంతగా తెలుసుకోలేకపోతే కాయిన్ నెత్తిమీదకి వేసుకొని చూసుకో అనేసి వెళ్ళిపోతారు. ఇక కాయిన్ కూడా అడ్డంగా పడుతుంది. ఇక భైరవి మహదేవ్వి దగ్గరికి వచ్చి క్రిష్ గురించి చెప్తుంది. చిన్నగాడు మన పార్టీని లేడండి.. పెళ్ళాన్ని వెనకేసుకొచ్చుతున్నాడు ఆ పనోడ్ని కొట్టింది మనల్ని కొట్టాల్సి ఉంది అది మనకే వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది కదా అనేసి లేనిపోనివి నూరిపోస్తుంది. మహాదేవయ్యకు ముందు హెచ్చరిక చేస్తుంది క్రిష్ మారి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా చూసుకోవాలని అంటుంది. క్రిష్ గురించి పక్కన పెడితే నీ పెద్దోడు రుద్రను బయటికి తీసుకొచ్చే పని మీరు చేయాలి అప్పుడే వాడు మీకు సపోర్ట్ గా ఉంటాడని అంటుంది. ఇక భైరవి ససి మీద అంటుంది రుద్రనే బయటికి తీసుకొని రావాల్సిందే అని మొండి పట్టుదల పడుతుంది.


అటు సంధ్య సంజయ్ కు ఇంట్లోనే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. ఇంట్లో జరిగింది ఇది అనేసి సంజయ్ కి చెప్తుంది. సత్యకు సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు అని చెప్పగానే సెండ్ చెయ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.. ఇక సంధ్య మనసులో సంజయ్పై ఉన్న ప్రేమను బయటపెడుతుంది. మహదేవయ్య సత్యను ఇన్సల్ట్ చేస్తాడు. నీ పుట్టిన రోజు చాలా పిరికోళ్ళు ఏమన్నా కూడా పారిపోతారు ఇక నువ్వు ఆశ వదులుకోవడం మంచిది అని మహాదేవయ్య అంటాడు. సత్య మాత్రం తగ్గకుండా నా మీద జాలి పడడం ఆపేసి ఏం చెప్పాలనుకున్నారో స్ట్రైట్ గా చెప్పండి అనేసి అంటుంది. నేను నామినేషన్స్ నుంచి తప్పుకోవాలంటే మీరు నాకు రెండు ప్రామిస్లు చేయాలని సత్యం అంటుంది. నా భర్తని మీ అవసరాలకు వాడుకోకూడదు రెండోది పేదవాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయొద్దు అనేసి అంటుంది. దానికి మహదేవయ్యా కుక్క బిస్కెట్లు వేసి పులిని బోన్ లో పెట్టాలని చూస్తున్నావా అనేసి సత్యని అడుగుతాడు. ఇద్దరి మధ్య వాదన ఎపిసోడ్కి హైలైట్ గా మారుతుంది. ఇక సత్యా క్రిష్ పై కోపంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Sai Kiran: 46 ఏళ్ల వయసులో తండ్రి.. ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్‌ చేసిన హీరో!

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బ్లాక్ మ్యాన్ గురించి నిజం తెలుసుకున్న మిస్సమ్మ 

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు భద్ర స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీవల్లి..భాగ్యం దెబ్బకు ఆనందరావుకు షాక్..

Brahmamudi Serial Today November 8th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని చంపాడని రాహుల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు    

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై అనుమానం.. నిజం తెలిసిపోతుందా..? చక్రధర్ కు టెన్షన్..

GudiGantalu Today episode: గిఫ్ట్ కొట్టేసేందుకు ప్రభావతి ప్లాన్..బాలుకు మీనా క్లాస్.. సుశీల కోసం మనోజ్ గిఫ్ట్..

Serial Actress : కెమెరా బాయ్ టు యాక్టర్.. అనిల్ జీవితంలో కష్టాలు.. ఫస్ట్ రెమ్యూనరేషన్..?

Today Movies in TV : శనివారం సూపర్ హిట్ సినిమాలు..వాటిని అస్సలు మిస్ అవ్వకండి..

Big Stories

×