Satyabhama Today Episode March 6th : నిన్నటి ఎపిసోడ్లో.. సత్య కృష్ణ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. చూసావు కదా క్రిష్ ఎంతగా అవమానించారు అందుకే నిన్ను అక్కడికి వెళ్ళద్దని చెప్పాను అయినా కూడా నా మాటంటే కాస్త కూడా లెక్క చేయకుండా వెళ్లావు మీ అమ్మ ఏమందో విన్నావా? అది వాళ్ళ పరిస్థితి నిన్ను ఇన్ని రోజులు కాపలాగా వాడుకున్నారు ఇప్పుడు నీ అవసరం తీరిపోయింది కాబట్టి నేను ఇంట్లోంచి బయటికి గెంటేశారు అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో నీకే తెలియాలి అని సత్య బాధపడుతుంది. ఇక ఉదయం లేవగానే రేణుక మహదేవయ్యకు కాఫీ ఇస్తుంది. భైరవి రేణుకను ఏదో ఒకటి అంటూ ఉంటుంది. క్రిష్ సత్య కోసం అబద్దం ఆడతాడు. మైత్రి హర్షను బ్లాక్ మెయిల్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహదేవయ్య బయటకు వెళుతూ ఉంటాడు. బయట కార్ ఆగిపోతుంది. ఏమైందని డ్రైవర్ని అడిగితే పాత కారు కదయ్యా ఆగిపోయింది అని అనగానే వేరే కార్ని పంపించమని చెప్పు అనేసి అంటాడు. అప్పుడే క్రిష్ అటు వెళ్తూ మహదేవయ్య చూసి అక్కడికి వస్తాడు. నా తప్పేంటి బాబు నేను చేసిన తప్పు ఏంటి అసలు పాతికేళ్లు నీ దగ్గరే ఉన్నాను నీ గురించి ఆలోచించను ఇప్పుడు అంత పరాయిడ్ని అయిపోయానా అనేసి క్రిష్ అడుగుతాడు.. కానీ మహదేవయ్య ఏం మాట్లాడాడు. క్రిష్ కార్ని రిపేర్ చేసి మహదేవను అడుగుతాడు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డని నీ కళ్ళముందే కొట్టడం నా తప్పే సంజయ్ కాళ్ళ మీద పడతాను నన్ను క్షమించమని అడుగుతాను కానీ నాతో మాట్లాడు బాపు అనేసి క్రిష్ బతిమిలాడుతాడు మహదేవ మాత్రం క్రిష్వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
ఇక సత్య నందిని మాట్లాడుకుంటారు. హర్షిని ఆ మైత్రి బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇది జరిగింది కానీ మీ అన్న చాలా మంచోడు ఆ మైత్రి చేసిన మోసంలో ఇరుక్కున్నాడు మైత్రివల్లే ఇదంతా జరిగింది అని నందిని సత్యతో అంటుంది. మైత్రి ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మైత్రివల్లే ఇప్పుడు మా కాపురం చెడిపోయేలా ఉంది దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి వదిన లేకుంటే మాత్రం మీ అన్న అతని మనసులో అతను లేకుండా ఉన్నాడు ఇది అయిపోయాడని నందిని అంటుంది. అయితే సత్య ఇదంతా నేను చూసుకుంటాను ఆ మైత్రి సంగతి నేను చూసుకుంటాలే అని నందినీకి భరోసా ఇస్తుంది.
ఇక మహదేవయ్యా క్రిష్ కలిసిన విషయం గురించి భైరవి సంజయ్ తో అంటాడు. సంజయ్ నువ్వు ఇంకా ఆ పేర్లు మర్చిపోలేకున్నావా డాడ్ఎందుకు నీకు ఆ పేరంటే అంత ఇది అనేసి సంజయ్ మహదేవయ్యను అడుగుతాడు. వాన్ని రానిచ్చే వాడిని అయితే వాడితో మాట్లాడుతాను కదా వాడి గురించే మాట్లాడకూడదని అనుకుంటున్నాను అని వెళ్ళిపోతాడు అయితే సంజయ్ కూడా వెళ్ళిపోతుంటే భైరవి ఆపుతుంది. భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావ్ రా అనేసి అనగానే డాడీ ఎందుకు అంతగా వాడిని దగ్గరికి రానివ్వకుండా దూరం పెట్టకుండా ఇది చేస్తున్నాడనేసి అడుగుతాడు. భైరవి సంజయ్ కి అసలు నిజం చెప్తుంది క్రిష్ వాళ్ళ అమ్మని మహదేవ చంపేసి బిడ్డను తీసుకొచ్చినట్లు చెబుతుంది. ఈ విషయం తెలిస్తే క్రిష్ మెడ మీద కూర్చుంటాడు అందుకే బాబు వాడిని దూరం పెడుతున్నాడు అని భైరవి చెప్తుంది.
ఈ ఒక్క విషయం చాలు ఇంట్లో సునామీ సృష్టించడానికి అని సంజయ్ అనుకుంటాడు. ఇక సత్య మైత్రి దగ్గరికి వెళ్లి నువ్వు బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నావు మా అన్నయ్య నీకు అంత ద్రోహం ఏం చేశాడు నీ తల్లిదండ్రులకు దూరమైతే ఆ స్థానాన్ని తాను తీసుకొని ప్రేమగా చూసుకున్నాడు అని అనగానే ఆ ప్రేమ కోసమే నేను ఇంతగా బాధపడుతున్నాను ఆరాటపడుతున్నాను నీకోసం తన ప్రేమను త్యాగం చేశాడు. అయితే ఇప్పుడు తనకి పెళ్లి అయింది కానీ నువ్వు ఇంకా ఇది చేయడం తప్పు మా అన్నయ్య ఏ తప్పు చేయడు కానీ నువ్వు అలా చేస్తున్నావ్ చేస్తున్నావని సత్య నువ్వు తప్పుకోకుంటే మాత్రం నిను ఏం చేస్తానో నాకే తెలియదు అని సత్య వార్నింగ్ ఇస్తుంది.. ఇక సంజయ్ క్రిష్ కి ఎలాగైనా నిజం చెప్పి ఇంట్లో బాంబు పేల్చాలని ప్లాన్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..