Satyabhama Today Episode November 17 th : నిన్నటి ఎపిసోడ్.. సత్య తనకు క్రిష్ పేరెంట్స్ ఎవరో తెలుసుకుందాం అని హాస్పిటల్ కు వెళ్ళింది. అక్కడ అసలు నిజం తెలియలేదని సత్య ఫీల్ అవుతుంది.. ఇక ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచనలో ఉంటుంది. క్రిష్ సత్య మూడిగా ఉండటం చూసి దగ్గరకు వస్తాడు. అప్పుడు సత్య ఓ రెండు బొమ్మలు తెచ్చి వివరిస్తుంది. ఆ రోజు ఇంకెవరూ డెలివరీ కానప్పుడు వాళ్లిద్దరే బిడ్డల్ని మార్చుకుని ఉండొచ్చు అంటాడు క్రిష్.. అయితే సత్య ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తుంది. దానికి క్రిష్ ఆలోచించడం ఎందుకు ఆ ఇద్దరిలోనే బిడ్డల మార్పిడి జరిగిందని సింపుల్ సలహా ఇస్తాడు. ఇలాంటివి రేడియోలో మస్తు చెప్తూ ఉంటారు ఎప్పుడు వినలేదా అని క్రిష్ అంటాడు. ఇక సంజయ్ గన్ తీసుకొని నా దమ్ము ఏంటో నిరూపించుకోవాలి అని అంటాడు. ఇంట్లో అందరు టెన్షన్ పడతారు. సంజయ్, క్రిష్ లు వెనక్కి తగ్గదేలే అని అంటారు.. చివరికి ఎవరికీ ఏం కాకపోవడంతో ఇద్దరు కామ్ అయిపోతారు..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య తన భర్తను తక్కువ చేసి మాట్లాడితే సహించలేను అని అంటుంది. క్రిష్ కూడా నీ మొగుడు మగాడు. కానీ ఎక్కడ తగ్గలేదు అని అంటాడు. మహదేవయ్యా కొడుక్కి ఎక్కడ ఏమవుతుందని సంజయ్ కాలుస్తున్నప్పుడు భయపడతాడు. కృష్ణ కాలుస్తున్నప్పుడు సత్య చక్రవర్తిలో భయపడతారు. ఇంట్లో అందరూ సంజయ్ ని అంటారు. మహదేవయ్య కూడా తన కొడుకుని ఎలా కాపాడుకోవాలని చూస్తాడు. సంజయ్ అమాయకుడు వాడి గురించి మీకెందుకురా నువ్వు క్రీస్తు పెట్టుకోవడం ఏంటి రా అని ఇద్దరికీ చెప్తాడు. ఇంటికి ఒక బంధువు మాత్రమే బంధువి బంధువు లాగే ఉండాలి అని అంటాడు చక్రవర్తి. దానికి మహదేవయ్యా రియాక్ట్ అవుతాడు. ఇంటికి వాడికి సంబంధం లేదని ఎందుకంటారు ఇంటికి వాడు ఏమవుతాడో తెలుసా అని నిజం చెప్పబోతాడు. ఇంటికి వాడు కూడా వారసుడే . ఈ ఇంట్లో వాడికి అన్ని అర్హతలు ఉన్నాయి.
ఇక సత్యకు అనుమానం మొదలవుతుంది.. కృష్ణ ఎప్పుడు అలా చూడలేదు మరి సంజయ్ విషయంలో ఎందుకు మావయ్య ఇంత ఆరాటపడుతున్నాడని అనుమానిస్తుంది. ఎదో జరుగుతుంది అని అంటుంది. క్రిష్ కు అన్ని తెలుసు.. సంజయ్ కు ఏమి తెలియదు. సంజయ్ ను రెచ్చ గొట్టడం ఎందుకు అని మహాదేవయ్య సీరియస్ అవుతాడు. దానికి చక్రవర్తి కూడా బాధ పడతాడు. క్రిష్ ను ఎందుకు అంటావు సంజయ్ ది తప్పు ఉంది. అదే ఆలోచించవే.. అని అంటాడు. జయమ్మ ఫీల్ అవుతుంది. ఇద్దరు పిల్లలు అన్నదమ్ములుగా ఉండాలి. కానీ ఇలాంటివి ఏంట్రా అని బాధ పడుతుంది. ఇక ఇంట్లోకి వెళ్ళగానే సత్యను అందరు తిడతారు. ఇక ఇది గేమ్ మాత్రమే మర్చిపోండి అని సంజు అంటాడు. ఇక నాకు రెండు కోట్లు కావాలి డాడీ ఇవ్వండి అంటారు. కానీ చక్రవర్తి ఎందుకు అని అడుగుతాడు. స్టార్ట్ అప్ కంపెనీ స్టార్ట్ చేస్తాను అని అంటాడు. ఏమి అవసరం లేదు ఆ ఆలోచన మానుకో అని అంటాడు.. ఇక సొంత కొడుకుకు రెండు కోట్లు ఇవ్వలేవా అని సంజయ్ నిలదీస్తాడు. కానీ చక్రవర్తి మౌనంగా ఉంటాడు. అది చూసిన సత్య చక్రవర్తిని అడుగుతుంది. సొంత కొడుకుకు డబ్బులు ఇవ్వలేక పోయారు అని తిడుతుంది. అసలు నిజం చెప్పండి అని అనగానే చక్రవర్తి షాక్ అవుతాడు. అన్ని తెలుసుకొనే మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటుంది. సత్యకు క్రిష్ గురించి నిజం చెప్పబోతాడు. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో చూడాలి..