IPL 2025 Auction: IPL 2025 మెగా వేలం ( IPL 2025 Auction ) కోసం రంగం సిద్ధం అయింది. ఈ మేరకు బీసీసీఐ పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌది అరేబియాలోని జెడ్డా వేదికగా IPL 2025 మెగా వేలం ( IPL 2025 Auction ) నిర్వహించనున్నారు. దీని కోసం ఇప్పటికే ప్లేయర్లందరూ రిజిస్టర్ చేసుకుంది. అందులో ప్లేయర్లను షార్ట్ లిస్ట్ కూడా చేశారు బీసీసీఐ అధికారులు. దీంతో IPL 2025 మెగా వేలం కేవలం 574 మంది ఆటగాళ్లు బరిలో ఉంటారన్న మాట. మెగా వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు నమోదు చేసుకుంటే 574 మంది ఫిల్టర్ చేయబడ్డారు.
Also Read: Tilak Varma: ‘పుష్ప 3’ లో టీమిండియా స్టార్ తిలక్ వర్మ ?
Also Read: Rohit Sharma Baby: మరోసారి తండ్రైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
ఈ మేరకు ఐపీఎల్ 2025 మెగా వేలంలో ( IPL 2025 Auction ) పాల్గొనే 574 మంది ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. 574 మంది ఆటగాళ్లలో 364 మంది భారతీయులు వేలంలో విక్రయించబడే అవకాశం ఉంది. రెండు రోజుల ఈవెంట్ సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24 మరియు 25, 2024 తేదీలలో 3:30 PM IST నుంచి ప్రారంభమవుతుంది. అటు IPL గవర్నింగ్ కౌన్సిల్ IPL 2025 మెగా వేలం కోసం ఆటగాళ్ల పూర్తి జాబితాను ప్రకటించింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి భారత క్రికెట్ జట్టు స్టార్లు మార్క్యూ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే.. IPL 2025 మెగా వేలం నేపథ్యంలోనే ఈ సారి 5 గురు టాప్ ప్లేయర్లు దూరం కానున్నారు. బీసీసీఐ పెట్టిన కొన్ని రూల్స్ కారణంగా దూరం అవుతే… ధవన్ రిటైర్మెంట్ ఇచ్చి.. ఐపీఎల్ కు దూరం అవుతున్నాడు. అయితే… ఈ 5 గురు టాప్ ప్లేయర్ల గురించి ఒకసారి పరిశీలిద్దాం.
Also Read: IND vs SA 4th T20i: సౌతాఫ్రికా చిత్తు..135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ !
1. బెన్ స్టోక్స్ ( Ben Stokes)
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ చివరిసారిగా 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. IPL 2024లో మధ్యలోనే వెళ్లిపోయాడు. ఈసారి అతను ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.
2. జోఫ్రా ఆర్చర్ ( Jofra Archer)
ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ కెరీర్ గాయాలతో అతలాకుతలమైంది. అతను చివరిసారిగా 2023లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. జోఫ్రా ఆర్చర్ కూడా ఐపీఎల్ ఆడేందుకు ముందుకు రావడం లేదు.
3. కామెరాన్ గ్రీన్ ( Cameron Green )
వెన్ను గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఆరు నెలల పాటు జట్టుకు దూరమయ్యాడు. అతను 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడాడు. ఇక ఈ సారి వేలంకు దూరంగా ఉంటున్నాడు.
4. క్రిస్ వోక్స్ ( Chris Woakes )
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ వోక్స్‌ను 2024లో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతను IPL 2025 వేలం కోసం నమోదు చేసుకోలేదు.
5. శిఖర్ ధావన్ ( Shikhar Dhawan )
ఐపీఎల్‌లో ధావన్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఆగస్టులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఐపీఎల్ ను కూడా పక్కనపెట్టాడు.