Indian Railways Coaches: భారతీయ రైల్వేలో బోలెడు రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. వీటిలో ప్రీమియం రైళ్లతో పాటు సాధారణ రైళ్లు కూడా ఉన్నాయి. రైళ్లలో అన్ని కోచ్ లు ఒకేలా ఉండవు. ప్రయాణీకులు పొందే సౌకర్యాల ఆధారంగా వేర్వేరు కోడ్ లను కేటాయించారు. ఆయా సౌకర్యాలను బట్టే టికెట్ ఛార్జీలు ఉంటాయి. ఇతర బోగీల విషయం ఎలా ఉన్నా M1 కోడ్ కోచ్‌లు ఇతర కోచ్‌ల తో పోల్చితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇంతకీ ఈ బోగీలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎన్ని బెర్త్ లు ఉంటాయి? ప్రయాణించే వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఇతర బోగీలకు, ఈ బోగీకి మధ్య ఉన్న తేడాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..
ఒక్కో బోగీకి ఒక్కో కోడ్
రైళ్లలో ఒక్కో రకం బోగీకి ఒక్కో కోడ్ కేటాయిస్తారు. సీట్ నంబర్ లో ‘S’ ఉంటే.. అది స్లీపర్ కోచ్ అని అర్థం. అంటే, పడుకొని ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండే బెర్త్. టికెట్ మీద B1 లేదంటే B2 అని ఉంటే, మీరు థర్డ్ AC కోచ్ లో ప్రయాణిస్తారు. టికెట్ లో ‘A’ కోడ్ ఉంటే సెకెండ్ AC క్లాస్ ను సూచిస్తుంది. టికెట్ మీద ‘D’ కోడ్ ఉంటే సెకండ్ సీటింగ్ క్లాస్ కోచ్ ను సూచిస్తుంది.
M1 కోచ్ కొన్ని రైళ్లకే పరిమితం
ఇక రైళ్లలో M1 కోచ్ చాలా ప్రత్యేకం. ఈ కోచ్ లో అన్ని రైళ్లలో ఉండవు. కేవలం కొన్ని రైళ్లలో మాత్రమే ఉంటుంది. టికెట్ లో M కోడ్ 3-టైర్ ఎకానమీ AC కోచ్ (AC-3)ని సూచిస్తుంది. M1 కోచ్ లోని చాలా సౌకర్యాలు 3-టైర్ AC కోచ్ లో మాదిరిగానే ఉంటాయి. అయితే, 3-టైర్ AC కోచ్ తో పోలిస్తే, M కోడ్ కోచ్ లో తక్కువ సౌకర్యాలు, తక్కువ ధర ఉంటుంది. 3-టైర్ ఎకానమీ AC కోచ్ లో 72 సీట్లు ఉంటాయి. కానీ, M1 కోచ్ లో 83 ఏకంగా సీట్లు ఉండటం విశేషం. అంతేకాదు, అప్పర్ బెర్త్ ఎక్కేందుకు మెట్లు కూడా ఉంటాయి.
M1 కోచ్ లో బెర్త్ సిస్టమ్
ఇక M1 కోచ్ లోని బెర్త్ సిస్టమ్ అచ్చం 3-టైర్ AC కోచ్ లో మాదిరిగానే ఉంటుంది. రెండు లోయర్ బెర్త్ లు ఉంటాయి. రెండు మిడిల్ బెర్త్ లు ఉంటాయి. రెండు అప్పర్ బెర్త్ లు, మరో రెండు రెండు సైడ్ బెర్త్ లు ఉంటాయి. 3-టైర్ AC కోచ్ లోనూ ఇలాగే బెర్త్ లు ఉంటాయి.
ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే ఏ కోచ్ లో టికెట్లు కావాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు బుక్ చేసుకున్న టికెట్ల ప్రకారమే ఆయా కోచ్ లలో బెర్త్ లను కేటాయిస్తారు. వాటి ప్రకారమే రైళ్లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక క్లాస్ లో టికెట్ తీసుకుని మరో క్లాస్ లో ప్రయాణిస్తే నేరంగా పరిగణించబడుతుంది. టీసీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
Read Also: రైళ్ల బయో టాయిలెట్‌లో రీసైకిల్ చేసిన నీటిని మళ్లీ ప్రయాణికుల అవసరాలకు వాడతారా? ఏది నిజం?