Judges Politics Chandrachud| న్యాయమూర్తులు అంటే సమాజంలో భగవంతుడితో సమానం. మనిషి తనకు ఏదైనా అన్యాయం జరిగితే తనకు న్యాయం చేయమని కనిపించని ఆ భగవంతుడికి.. కోర్టులో న్యాయం చేయడానికే కూర్చొని ఉండే న్యాయమూర్తిని వేడుకుంటాడు. కానీ అటువంటి న్యాయమూర్తి చేసే న్యాయంలో పారదర్శక ఉండడం చాలా అనవసరం. లేకపోతే న్యాయం చేసినా.. అందులో విశ్వాసం లోపిస్తుంది. ఇదే విషయం తాజాగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.
న్యాయమూర్తులు పదవి విరమణ తరువాత రాజకీయాల్లోకి రావడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నకు జస్టిస్ చంద్రచూడ్ చక్కగా సమాధానమిచ్చారు. ఒక ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. “ఈ సమాజం మాజీ న్యాయమూర్తులను చట్టానికి పరిరక్షకులుగా భావిస్తుంది. అందుకే న్యాయమూర్తల వ్యక్తిగత జీవితం కూడా సమాజంలో ఆదర్శప్రాయంగా ఉండాలి. పక్షపాతం ఉండకూడదు. న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు 65. నేను 65 ఏళ్ల వయసు తరువాత కూడా నా వృత్తి, న్యాయ వ్యవస్థపై అనుమానం కలిగించే ఏ పనీ చేయను.
Also Read: ‘దేవుని ముందు కూర్చొని ప్రార్థించా’.. అయోధ్య కేసు తీర్పుపై సిజెఐ
ఈ సమాజం న్యాయమూర్తులు రిటైర్ అయినా.. వారిని న్యాయానికి ప్రతీకగా చూస్తుంది. అందుకే సాధారణం పౌరులకు భిన్నంగా మాజీ న్యాయమూర్తులు జీవించాల్సి ఉంటుంది. అవును పదవిలో లేకపోయినా ఒక మాజీ న్యాయమూర్తి ప్రతిష్ట న్యాయానికి, పారదర్శకతకు ప్రతీకగానే ఉంటుంది. అందుకే న్యాయమూర్తి పదవిలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా తాను రిటైర్మెంట్ తరువాత ఎలాంటి జీవితం గడపాలో బాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అతను తీసుకునే నిర్ణయం అతను ఇంతకాలం చేసిన పని పారదర్శతపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఒక జడ్జి రిటైర్మెంట్ తరువాత రాజకీయాల్లోకి వెళితే.. అతను రిటైర్మెంట్‌కు ముందు చెప్పిన తీర్పులు న్యాయ సమ్మతమేనా? అనే అనుమానం కలుగుతుంది. అందుకే ఒక మాజీ న్యాయమూర్తి జీవన విధానం కూడా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
న్యాయమూర్తులు కూడా ఒక సాధారణ పౌరునితో సమానమైనప్పటికీ వారి నుంచి సమాజం ఒక ఆదర్శ జీవిన విధానం కోరుకుంటుంది. అందుకే న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల రిటైర్మెంట్ తరువాత వారి జీవితంలో ఏది ఆమోదయోగ్యం, ఏది ఆమోదయోగ్యం కాదు అనే విషయంపై ఏకాభిప్రాయం కుదరాలి. పదవిలో ఉన్న న్యాయమూర్తులు, రిటైర్ అయిన జడ్జీలతో చర్చించి రిటైర్మెంట్ అయిన తరువాత జీవితంలో ఏది సమంజసం, ఏది కాదు అనేది నిర్ణయించాలి. ఇలాంటి ఏకాభిప్రాయం ఇప్పటికైతే కుదరలేదు.” అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు