Satyabhama Today Episode November 26 th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య ప్లాన్ ప్రకారం గంగా ఇంట్లోకి దిగుతుంది. నా కొడుకు అని పెద్ద రాద్ధాంతం చేస్తుంది. గంగ చేసిన పనికి మహదేవయ్య ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక భైరవి నా కొంప ముంచావు కదా అనేసి మహాదేవయ్యను అడుగుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇదేం పని ఈ వయసులో రెండో పెళ్లి నాని అందరూ నిలదీస్తారు. గంగ చెప్పిన మాటలకి మహదేవయ్య కోపం వచ్చి గంగని బయటకు గెంటేయ్యమని చెప్తాడు. బయట కూర్చున్న గంగా నాకు న్యాయం జరగాలంటే ధర్నా చేస్తుంది. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ అయిపోతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహదేవయ్య ఇంటి బయట గంగ ధర్నా చేస్తుంది. గంగా తన కొడుకు ధర్నా చేస్తుంటే, అనుచరులు మాత్రం నువ్వు ఇంటి ముందర కూర్చుంటే మా మహదేవ గురించి నీకు తెలియదనేసి వార్నింగ్ ఇస్తారు. నాకు న్యాయం జరగాలని అడుగుతుంది. ఇక సత్య ప్లాను దాదాపు వర్కోట్ అయినట్టు కనిపిస్తుంది. గంగ చేస్తున్న పనికి మహదేవయ్య ఎక్కువ ఇంట్లో శత్రుత్వం పెరుగుతుంది. పట్టుకున్న భార్య కూడా గంగకి నిజంగానే తాళి కట్టాడేమో అని అనుమానిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒక మాటగా గంగా నిజంగానే ఈయన భార్యనా అని చర్చలు జరుపుతారు. దానికి మహదేవయ్య నాకు గంగ తెలియదు గోదావరి తెలియదు అని అంటాడు. ఇక సత్యా మహదేవయ్యను ఇంకా ఇరికించాలని నరసింహ కు ఫోన్ చేస్తుంది. గంగా అనే ఆవిడని మహదేవయ్యా రెండో పెళ్లి చేసుకున్నాడని చెబుతుంది.
మొదట నమ్మని నరసింహ మహదేవయ్య ఇంటికి వెళ్లి చూస్తాను అంటాడు. సత్య గంగ కు ఫోన్ చేస్తుంది. స్లోగన్లు బాగా ఉన్నాయి కంటిన్యూ చెయ్ మహదేవయ్య దిగి వస్తాడు అనేసి అంటుంది. గంగ చేస్తున్న నినాదాలకు మహదేవయ్య కుటుంబం మొత్తం బయటికి వచ్చి చూస్తుంది. నరసింహ చెప్పడంతో మీడియా అక్కడికి వస్తుంది. గంగకు సపోర్ట్ చేస్తూ మీడియా మాట్లాడుతుంది. ఇక మహదేవయ్య గంగ మాటలకు కోపంతో రగిలిపోతాడు. పక్కనే ఉన్న సత్య మహదేవయ్యను కంట్రోల్ చేస్తుంది. మావయ్య మీడియా ఉంది మీరు ఏం మాట్లాడినా కానీ అడ్డంగా దొరికిపోతారనేసి ఆపుతుంది. నరసింహ యాక్షన్ చూసి గంగా షాక్ అవుతుంది. వీడెవడు నాకన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడని ఆలోచిస్తుంది. నరసింహ మహదేవయ్యకు వార్నింగ్ ఇస్తాడు. గంగా నా చెల్లెలు లాంటిది గంగకు న్యాయం జరిగేంతవరకు నేను నిరాహార దీక్ష చేస్తానని మీడియా ముఖంగా చెప్తాడు..
ఇక లోపలికి వచ్చినా మహదేవయ్యకు పార్టీ ఇంచార్జ్ ఫోన్ చేస్తాడు. మీడియాలో జరుగుతున్నంత నిజమేనా అసలు ఆ గంగ ఎవరు మీరు రెండో భార్యనా నీ మొదటి భార్యకు సమ్మతంతోనే రెండో పెళ్లి చేసుకున్నావా? మొదటి పరిమిషన్ లేకుండా రెండో పెళ్లి చేసుకుంటే నీకు పార్టీ టికెట్ కూడా రాదు అని హెచ్చరిస్తాడు. దానికి మహదేవయ్య పిచ్చిపిచ్చిగా సమాధానం చెప్తాడు.. ఇదేంటో క్లియర్ చేసుకో లేకపోతే నీకు పార్టీ టికెట్ మాయమవుతుందని హెచ్చరిస్తాడు. ఇక నందిని అన్నం తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. విశాలాక్షి హర్ష ఎడమ్మా అడుగుతుంది. ఏమో నాకేం తెలుసు మీ అబ్బాయి లేకుండా ఉంటే నాకు అన్నం పెట్టరా అత్తమ్మ అని అడుగుతుంది. అక్కడికి హర్ష వచ్చి కూర్చుంటే నందిని లేసి పక్కకు వెళుతుంది. జరిగిన విషయాన్ని అత్తమామలతో నందిని చెప్పి బాధపడుతుంది. ఏమైందని హర్షని పిలిచి విశాలాక్షి విశ్వనాథ్ అడుగుతారు. మైత్రికి దూరంగా ఉండకపోతే నందిని దూరం అయిపోతుంది. తల్లిదండ్రులుగా ఇంతకన్నా మేము ఎక్కువ చెప్పలేం అనేసి అంటారు. అంతలోకే మైత్రి ఫోన్ చేస్తే మైత్రి ఫోన్ను కట్ చేస్తుంది కట్ చేస్తాడు హర్ష. మైత్రి ఫస్ట్ టైం నా ఫోన్ ని కట్ చేశాడు. ఏదో జరుగుతుంది నందిని కి ఇక చెక్ పెట్టాలని తన ఫ్రెండ్ తో చెబుతుంది.
ఇక మహదేవయ్య ఆకలేస్తుందని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి అన్నం పెట్టమని అరుస్తాడు.. మహదేవయ్యను చూసి అందరూ షాక్ అవుతారు. బయట అంత లొల్లి అవుతుంటే నాన్న అన్నం పెట్టమని కూర్చున్నాడు అనేసి అందరూ అడుగుతారు. మహాదేవయ్య కోపంతో రేణుకని చూస్తాడు. ఇక నిదానంగా ఆలోచిస్తేనే పరిష్కారం ఉంటుందని సత్య చెప్పగానే సత్య ఏం చెప్తుందని మహదేవయ్య అడుగుతాడు. డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటానని ఒప్పుకోవాలని మహదేవయ్యకు ఎక్కువ సలహా ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో క్రిష్ గంగ కొడుకుని తేలుతుందా లేదా అసలు నిజం బయటపడుతుందా చూడాలి..