Serial Actress : సాధారణంగా మహిళలకు పని ప్రదేశాలలో రక్షణ లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని విషయాలు అందరికీ తెలిసినా.. జరగాల్సినవి మాత్రం జరిగిపోతున్నాయి. ఇలా జరిగిన తర్వాత అయ్యో పాపం అంటూ నిట్టూరుస్తున్నారు కానీ ఆ సంఘటన జరగకుండా ఆపేవారు లేరు అనడంలో సందేహం లేదు అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు మంచి హోదాలో ఉండి కూడా ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడి చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani master) ను మొదలుకొని యూట్యూబర్ ప్రసాద్ (Youtuber Prasad) వరకు చాలామంది సెలబ్రిటీలు ఆడవారిని లైంగికంగా హింసించారనే కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న సీరియల్ నటి ..
అయితే ఇప్పుడు తాజాగా ఒక సీరియల్ నటి కూడా ఒక యువకుడి నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.. అసలు విషయంలోకెళితే.. ప్రేమ, పెళ్లి పేరుతో సీరియల్ నటికి వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో ఆ యువకుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..’శ్రావణ సంధ్య’ అనే టీవీ సీరియల్ లో నటిస్తున్న నటిని,అదే యూనిట్ లో పనిచేస్తున్న బత్తుల ఫణితేజ అనే యువకుడు వేధిస్తున్నాడట. గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఆమెను హింసిస్తున్నాడట దీంతో మానసిక వేధింపులకు గురి అయిన ఆ సీరియల్ నటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
యువకుడు అరెస్ట్..
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేయడంతో ఆ యువకుడు బాధితురాలితో కాళ్ల భేరానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాదు తన నోటి దూల వల్లే ఇలా చేశానంటూ సెల్ఫీ వీడియోని కూడా ఆమెకు పంపారట. ఇకపోతే బాధితురాలి క్యారెక్టర్ ను దిగజార్చే విధంగా దుష్ప్రచారం చేయడంతో ఫణితేజను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి దీనిపై బాధిత నటికి ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.