Game Changer Trailer Records: ఈరోజుల్లో కేవలం కలెక్షన్స్ విషయంలోనే కాదు.. ప్రతీ చిన్న విషయంలో కూడా హీరోల మధ్య బీభత్సమైన పోటీ జరుగుతోంది. ఫస్ట్ లుక్‌కు ఎన్ని లైక్స్ వచ్చాయి. ట్రైలర్‌కు ఎన్ని గంటల్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎవరి ట్రైలర్‌లకు ఎక్కువ లైక్స్ వచ్చాయి.. ఇలా అన్ని విషయాల్లో సినిమాల మధ్య పోటీ మొదలయ్యింది. ఇక స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ అంతా పోటీపడి మరి తమ హీరోల పేర్ల మీద కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతారు. అలా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ కూడా కేవలం 25 నిమిషాల్లోనే ఒక రికార్డ్ బ్రేక్ చేసింది.
రికార్డులు బ్రేక్
న్యూ ఇయర్ సందర్భంగా ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 2న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ రిలీజ్ అవుతుందని తెలిపారు. అంతే కాకుండా ఈ ట్రైలర్ లాంచ్ కోసం ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ఏర్పాటు చేసి, దానికి రాజమౌళిని గెస్ట్‌గా పిలుస్తున్నట్టు ప్రకటించారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవు. ఇంతకాలం అసలు ‘గేమ్ చేంజర్’ సినిమా ఉంటుందా లేదా అని అనుమానంలో ఉన్న ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఊరటనిచ్చాయి. దీంతో ట్రైలర్ రిలీజ్ అవుతుందనే సమయానికి ఫ్యాన్స్ అంతా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని సిద్ధంగా ఉన్నారు. అలా రికార్డులు బ్రేక్ అయ్యాయి.
Also Read: ‘ గేమ్ ఛేంజర్ ‘ ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లు చిరిగిపోవాల్సిందే మామా..
అరగంటలోపే
‘గేమ్ చేంజర్’ ట్రైలర్ రిలీజ్ అయిన 25 నిమిషాల్లోనే 100K లైక్స్ వచ్చాయి. అన్ని లైక్స్ రావడానికి ఈ ట్రైలర్‌కు కనీసం అరగంట కూడా పట్టలేదు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కష్టపడి కలిసి రికార్డ్ బ్రేక్ చేసినందుకు హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తానికి ఈ ట్రైలర్‌లో మూవీపై మరిన్ని అంచనాలు పెంచేశారు మేకర్స్. శంకర్ (Shankar), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ ఎన్నో అడ్డంకులను ఎదుర్కుంది. ఈ సినిమా ప్రారంభమయిన తర్వాత కొన్నాళ్ల షూటింగ్ సాఫీగానే సాగింది. ఆ తర్వాత చాలాకాలం పాటు అసలు షూటింగ్ గురించి అప్డేటే లేదు. రామ్ చరణ్ కూడా ఖాళీగా కనిపించేసరికి అసలు ‘గేమ్ చేంజర్’ ఉందా లేదా అని ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి.
ఎన్నో అనుమానాలు
‘గేమ్ చేంజర్’ (Game Changer) గురించి చాలాకాలం వరకు అప్డేట్ లేకపోవడంతో దీనిపై ఆశలు వదిలేసుకున్నారు ఫ్యాన్స్. కానీ సడెన్‌గా జనవరి 10న ఈ మూవీ విడుదల అవుతుందని అప్డేట్ వచ్చింది. అయినా కూడా చెప్పిన తేదీకి ఈ మూవీ విడుదల అవుతుందని చాలామంది నమ్మలేదు. ప్రమోషన్స్ కూడా వెంటనే ప్రారంభించకపోవడంతో అలా అనుమానాలు పెరుగుతూ వచ్చాయి. కానీ మొదటి ఈవెంట్‌నే డల్లాస్‌లో చేసి అందరికీ షాకిచ్చారు మేకర్స్. తాజాగా రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసి అందరినీ హ్యాపీ చేశారు.
#GameChanager Trailer 100K likes in 25 mins 🔥🔥#GameChangerTrailer #RamCharan𓃵 #KiaraAdvani #Shankar #SHANKARISBACK @AlwaysRamCharan @SVC_official pic.twitter.com/RrTRIa950g
— BIG TV Cinema (@BigtvCinema) January 2, 2025