E-Paper
Advertisement

Kissik Talks: టీవీ ఇండస్ట్రీ నన్ను వెలేసింది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సోనియా!

Kissik Talks: టీవీ ఇండస్ట్రీ నన్ను వెలేసింది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సోనియా!
Advertisement

Kissik Talks:ఇటీవల కాలంలో సెలబ్రిటీ టాక్ షోలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. అందులో ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొని, ప్రేక్షకులకు చేరువవడమే కాకుండా ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అలా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ.. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా ఎంతోమంది సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ.. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులకు తెలియజేస్తూ.. మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న షో కిస్సిక్ టాక్స్. బిగ్ టీవీ ప్లస్ న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా నిర్వహిస్తున్న ఈ షో ఇప్పటికే 67 ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా.. తాజాగా 68వ ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు.

టీవీ ఇండస్ట్రీకి దూరం పై సోనియా సింగ్ క్లారిటీ..

జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యూట్యూబర్, సినీ నటి సోనియా సింగ్ గెస్ట్ గా విచ్చేశారు. ఇక ఇందులో ఎన్నో తెలియని విషయాలను పంచుకున్న ఆమె.. ఒకప్పుడు తనపై ఇండస్ట్రీ వేటు వేసింది అనే రూమర్స్ కి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. “అవును, నిజమే.. ఆ పరిస్థితుల్లో బ్యాన్ చేయాల్సింది” అంటూ నిజాలు బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా.. “మీరు ఈటీవీలో కొన్ని సంవత్సరాలు పని చేయకూడదు అని మిమ్మల్ని ఆపారట. అది నిజమేనా?” అని ప్రశ్నించింది వర్ష.సోనియా మాట్లాడుతూ.. “అవును , అది నిజమే. ఆ టైంలో ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు.. నిజంగా నా కెరియర్ ఆగిపోవచ్చు.. నన్ను బ్యాన్ కూడా చేసేయొచ్చు”.. అంటూ అసలు విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అలా ఎందుకు జరిగింది ? ఏం జరిగింది? అనే పూర్తి విషయం తెలియాలి అంటే శనివారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

also read:Kissik Talks: పెళ్లికి సిద్ధమైన సిద్ధూ – సోనియా.. ముహూర్తం ఫిక్స్!

ఒంటరిగా ఉన్నప్పుడు అలా చేస్తా – సోనియా సింగ్

ఇంటర్వ్యూలో భాగంగా.. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అని వర్షా కొంటెగా ప్రశ్నించగా.. సోనియా మరే మాత్రం ఆలోచించకుండా సిద్ధూ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. సిద్ధూ ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు అని వర్షా ప్రశ్నించగా.. లైవ్ లొకేషన్ సర్చ్ చేస్తూ ఉంటాడు అంటూ తెలిపింది.వీకెండ్స్ వస్తే మీరు ఏం చేస్తారు అని ప్రశ్నించగా ప్లేట్లో అన్నం పెట్టుకొని ఏం సినిమా చూద్దామని వెతుక్కునేలోపే మేము తినే అన్నం అయిపోతుంది అంటూ తెలిపింది. అలా మొత్తానికి అయితే సోనియా సింగ్ ఇలా ఎన్నో విషయాలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంది.

Advertisement

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×