Anchor Suma : బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆమె సినిమాలు చెయ్యకపోయినా కూడా హీరోయిన్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. సుమ ఏ షో చేసిన ఆ షో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కు అయితే సుమ యాంకరింగ్ కావాలని పట్టుబట్టి మరి ఎంత డబ్బులు అయినా ఇచ్చి ఆమెనే యాంకర్ గా తీసుకొస్తున్నారు.. ఇటీవల సుమ చేసిన ప్రతి ఒక్క షో భారి క్రేజ్ ని సంపాదించుకున్నాయి… సుమ యాంకరింగ్ ఎంత బాగుంటుందో అంతకు మించి పారితోషికాన్ని కూడా అందుకుంటుంది. వరుస షోలతో కోట్లు సంపాదించిన సుమకు ఒక చిన్న బాధ అలానే ఉందట. రోజు ఆ విషయాన్ని గుర్తుతెచ్చుకొని మరి బాధ పడుతుందట. ఇంతకీ సుమను అంతగా బాధింప చేసిన ఆ ఘటన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర యాంకర్ సుమకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో ఎలాంటివారినైన ఆకట్టుకుంటుంది. ఒక మలయాళి అయినా కూడా ఆమె తెలుగింటి కోడలుగా అడుగు పెట్టి తెలుగును అనర్గలంగా నేర్చుకుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా రీచ్ అవ్వలేని స్థానంలో ఉంది. స్టార్ యాంకర్ గా ఆమె పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. కెరీర్ పరంగా సాఫీగా సాగిపోతున్న సుమకు పర్సనల్ జీవితంలో ఓ బాధ మిగిలి ఉందట..
సుమ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. అయితే సుమ అత్తగారు, మామగారు కన్నుమూసిన విషయం తెలిసిందే.. సుమకు వాళ్ళ అత్త అంటే ఎంత ఇష్టమో గతంలో ఓ షోలో బయట పెట్టింది. తనకు సొంత అమ్మ తర్వాత అమ్మలాగా భావించిన ఆమె లేకపోవడంతో సుమ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటుందట. తాను ఎన్ని ఫంక్షన్, ఎన్ని షోస్ చేసినా ఏ ఈవెంట్స్ కి వెళ్ళిన తన పిల్లల్ని దగ్గర ఉండి తనకన్నా బాగా చూసుకునేదట.. తాను ఇంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు ఆమె భౌతికంగా లేకపోవడంతో బాధ పడుతుందట.. రోజు ఇంటికి వెళ్ళగానే అత్త ఫోటో తీసుకొని బాధ పడుతుందట.. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హల్ చల్ చేస్తుండడం జరుగుతుంది. ఏదైనా మనవాళ్లు మనతో ఉన్నప్పుడు ఆ వ్యాల్యూ తెలియదు. కోల్పోయినప్పుడే తెలుస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం సుమ వరుస షోలతో సినిమా ఈవెంట్ లతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ వీడియో ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.