Karan Johar: మామూలుగా నిర్మాతల గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఈరోజుల్లో నిర్మాతలు కూడా సినిమా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అలా ప్రతీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ గురించి ఆడియన్స్‌కు తెలుస్తోంది. అలా బాలీవుడ్‌లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. బీ టౌన్‌లో హీరోహీరోయిన్లకు ఎంత పాపులారిటీ ఉంటుందో కరణ్ జోహార్‌కు కూడా అదే రేంజ్‌లో పాపులారిటీ ఉంటుంది. తనపై నెగిటివిటీ ఉన్నా కూడా అసలు కరణ్ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అలాంటి ఈ టాప్ ప్రొడ్యూసర్ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎదుర్కుంటున్న కష్టాల గురించి బయటపెట్టాడు.
ఫెయిల్యూరే సమస్య
నిర్మాతగా మాత్రమే కాదు.. దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకున్నాడు కరణ్ జోహార్. కానీ తను నిర్మాతగా రెండేళ్లకు ఒక సినిమా తెరకెక్కిస్తుంటే దర్శకుడిగా మాత్రం చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడనే విషయాన్ని తాజాగా బయటపెట్టాడు. ‘‘నేను 2016లో ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను డైరెక్ట్ చేశాను. మళ్లీ ఇంకొక సినిమాను 2023ను డైరెక్ట్ చేశాను. ఈ ఏడేళ్లలో నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. నేను ఒక్క మూవీ కూడా డైరెక్ట్ చేయలేదు. మీకు ఒక స్టూడియో ఉండి, ఫిల్మ్ మేకర్ అయినప్పుడు అసలు ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు’’ అంటూ ఫెయిల్యూర్స్ వల్లే తన కెరీర్‌లో గ్యాప్ వచ్చిందని స్పష్టం చేశాడు కరణ్ జోహార్.
ప్రెజర్ ఉంది
‘‘వరుసగా ఫెయిల్యూర్స్ వస్తే ప్రేక్షకులు కూడా మనల్ని అంత సీరియస్‌గా తీసుకోరు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. నేను కూడా వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కున్న తర్వాత కచ్చితంగా సక్సెస్ అవ్వాలని అనుకుంటాను. ఆ ప్రెజర్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను. అది మంచిది కాదు. కానీ నిజం’’ అని చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్ (Karan Johar). ఇక సినీ పరిశ్రమలో నటీనటులను, దర్శక నిర్మాతలను, సినిమాలను బ్యాన్ చేయడం కామన్‌గా జరిగేదే. అలాంటి వాటిపై కూడా కరణ్ స్పందించాడు. ‘‘మనది చాలా సెన్సిటివ్ దేశం. ప్రతీ ఒక్కరికి వారి నమ్మకాలు, ఐడియాలు ఉంటాయి. సినిమాల విషయంలో ప్రేక్షకులు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు’’ అంటూ ప్రేక్షకుల అభిప్రాయాల గురించి మాట్లాడాడు.
Also Read: సమంత లేటెస్ట్ పోస్ట్.. శోభితా, నాగచైతన్యకు సీక్రెట్ మెసేజ్.?
ఈజీ టార్గెట్స్
‘‘ఇండియన్ సినిమా.. అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్ అనేది అందరికీ ఈజీ టార్గెట్ అనిపిస్తుంది. మమ్మల్ని అటాక్ చేయడం చాలా ఈజీ. మేము ఈజీ టార్గెట్స్ కాబట్టి మమ్మల్ని అటాక్ చేస్తారు కానీ మేము సైలెంట్‌గా ఉండము. మేము ఏదైనా మాట్లాడినప్పుడు మీడియా మొత్తం అదే కవర్ చేస్తుంది. ఇది వరకు కూడా చాలా సినిమాలు బ్యాన్ అయ్యాయి. దాని వల్ల మీడియాలో చర్చలు జరిగాయి. కొన్ని సినిమాలు అయితే అతికష్టం మీద విడుదల అయ్యాయి. ఇవన్నీ కామన్‌గా ఇండస్ట్రీలో ఉండే సమస్యలే’’ అంటూ చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్. ఎప్పుడూ బాలీవుడ్‌కు సపోర్ట్‌గా మాట్లాడే కరణ్ జోహార్.. మరోసారి అదే పనిచేస్తూ తమను ఈజీ టార్గెట్స్ అంటూ సింపథీ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు.